ఆడియో సమీక్ష: శైలజా రెడ్డి అల్లుడు – సంగీతం పై ఆధిపత్యం చూపించిన సాహిత్యం !

మారుతీ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఒకప్పటి హీరోయిన్ రమ్య కృష్ణ టైటిల్ రోల్ అయిన శైలజా రెడ్డి పాత్రలో నాగ చైతన్యకు అత్తయ్యగా నటిస్తుండగా చైతు సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు గోపిసుందర్ సంగీతం సంగీతం అందించిన ఈ పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1. పాట : అను బేబీ

గాయనీ గాయకులు : అనుదీప్ దేవ్
రచన : కృష్ణ కాంత్ శ్రీరామ్

ఈ ఆల్బమ్ అను బేబీతో పాటతోనే మొదలవుతుంది, ఈ పాత కొన్ని రోజులు క్రితమే విడుదల అయింది. రచయిత కృష్ణ కాంత్ వ్రాసిన సాహిత్యానికి తగినట్లుగా గోపి సుందర్ సమకాలీనమైన బీట్స్ ను అందించి ఓ ప్రత్యేకమైన టీజింగ్ పాటగా తీర్చిదిద్దారు. అను బేబీ పాట యువతను ఆకట్టుకుంటుంది.

2. పాట : శైలజా రెడ్డి అల్లుడు చూడే
గాయనీ గాయకులు : సత్యవతి (మంగళి)
రచన : కాసరల శ్యాం

ఈ పాటను ప్రముఖ టీవీ యాంకర్ సత్యవతి (మంగళి) పాడారు. ఈ శైలజా రెడ్డి అల్లుడు చూడే పాట ఓ జానపద ఆధారిత కంటెంట్ పాట. కాసారల శ్యాం ఈ పాటను తెలంగాణ శైలిలో చాలా చక్కని పదాలతో వ్రాయటం జరిగింది. ఇక ఈ సాంగ్ విజయానికి స్క్రీన్ పై ఎలా తెరకెక్కిందో సినిమాలో ఏ సిచ్యుయేషన్ లో వస్తుందో అనే అంశాల మీద ఈ పాట విజయావకాశాలు ఆధారపడిఉన్నాయి.

3. పాట : ఎగిరెగిరే
గాయనీ గాయకులు : సిడ్ శ్రీరామ్ మరియు లిప్సిక
రచన : కృష్ణ కాంత్

ఈ ఎగిరెగిరే పాట ఆల్బమ్ లో మూడో పాటగా వస్తుంది. ఇక పాట గురించి చెప్పాలంటే శైలజారెడ్డి అల్లుడు ఆల్బమ్ లో ఎగిరెగిరే పాట బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. సిడ్ శ్రీరామ్ మరియు లిప్సిక వారి గానంతో ఈ పాటను చాలా చక్కగా పాడారు. శ్రావ్యమైన సంగీతాన్ని అందిస్తాడని పేరు ఉన్న గోపీ సుందర్ ప్రశాంతమైన ట్యూన్ అందించి ఈ సాంగ్ ను బెస్ట్ గా తీర్చిదిద్దారు. ఇక ఈ పాటను గాని సరైన రీతిలో చిత్రీకరించినట్లయితే, బెస్ట్ సాంగ్ గా నిలిచిపోతుంది.

4. పాట : పెళ్లి పందిరి
గాయనీ గాయకులు : విజయ్ యేసుదాస్
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి

సీనియర్ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు వ్రాసిన పెళ్లి పందిరి ఒక నూతన వివాహ గీతం. ఈ పాట వివాహాన్ని మరియు వివాహం యొక్క ప్రాముఖ్యతను విశ్లేషాత్మకంగా వివరిస్తుంది. విజయ్ యేసుదాస్ ఆకట్టుకునే వాయిస్ మరియు గోపి సుందర్ సమకూర్చిన సాంప్రదాయ జానపద బీట్స్ ఈ పాటను హిట్ చేసాయి.

5. పాట : తాను వెతికినా
గాయనీ గాయకులు : సత్య యామిని
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి

తాను వెతికినా సాంగ్ ఈ ఆల్బమ్ లో చివర పాటగా వస్తోంది. ఈ పాటను కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారే రాశారు. మంచి పదాలతో అర్ధవంతమైనా సాహిత్యం కారణంగా ఈ పాట బాగుంది. సత్య యామిని గానం మరియు రెగ్యులర్ విరామాలలో వచ్చే చక్కని మాడ్యులేషన్లు ఆడవారికి అలరిస్తాయి. ఇక గోపి సుందర్ సంగీతం పర్వాలేదనిపిస్తోంది.

తీర్పు:

శైలజా రెడ్డి అల్లుడు ఆల్బమ్ లో మెలోడీ సాంగ్ దగ్గరనుండి సాంప్రదాయ వివాహ సాంగ్ వరకు ఇలా అన్ని రకాల పాటలు ఉన్నాయి. ఎగిరెగిరే పాట ఆల్బమ్ లోకల్లా బెస్ట్ మెలోడీ సాంగ్ గా నిలుస్తోంది. అలాగే పెళ్లి పందిరి, మరియు తాను వెతికినా పాటలు సాహిత్యం కారణంగా బాగున్నాయి అనిపిస్తాయి. ఇక మిగిలిన రెండు పాటలు అను బేబీ, శిలాజా రెడ్డి అల్లుడు చూడు పాటలు తెరకెక్కించిన విధానం పై ఏ సందర్భంలో వస్తున్నాయనే అంశాల పై వాటి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Click here for English Music Review

</div

Exit mobile version