సమీక్ష : షకీలా – ఆకట్టుకోని బయోపిక్

సమీక్ష : షకీలా – ఆకట్టుకోని బయోపిక్

Published on Jan 1, 2021 6:15 PM IST

నటీనటులు : రిచా చాధా, పంకజ్ త్రిపాఠి, ఈస్టర్ నోరోన్హా, రాజీవ్ పిళ్ళై మరియు షీవా రానా

దర్శకత్వం: ఇంద్రజిత్ లంకేష్

నిర్మాత : సామి నాన్వానీ

సంగీతం: మీట్ బ్రోస్ మరియు వీర్ సమర్త్

సినిమాటోగ్రఫీ : సంతోష్ రాయ్

ఎడిటింగ్ : బల్లు సలుజా

అనేక రంగాలకు సంబంధించిన పలువురు పాపులర్ వ్యక్తులపై ఎన్నో బయోపిక్ చిత్రాలను మనం చూసాము. అలా ఇప్పుడు అడల్ట్ చిత్రాలలో ప్రముఖ నటి అయినటువంటి షకీలా పై ఓ బయోపిక్ నేడు థియేటర్స్ లోకి వచ్చింది. రిచా చదా షకీలా పాత్రలో నటించింది. మరి ఈ బయోపిక్ ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వెళితే 90లలో షకీలా(రిచా చదా) తల్లి ఆమెను ఓ అడల్ట్ సినిమాలు తీసే డైరెక్టర్ దగ్గరకు తీసుకెళ్లి తన కూతురిని లాంచ్ చెయ్యాలనుకుంటుంది. కానీ అందుకు షకీలా ససేమిరా ఒప్పుకోను అంటుంది, కానీ ఆమె కుటుంబ పరిస్థితులు మూలాన ఆ రంగంలోకి దిగి అప్పటి స్టార్ హీరోల రేంజ్ ఫేమ్ ను సంపాదించేసుకుంటుంది. అలా అప్పటి స్టార్ హీరో అయినటువంటి సలీమ్(పంకజ్ త్రిపాఠి) ఆమెకి తన సినిమాలో అవకాశం ఇచ్చి పర్సనల్ గా కూడా ఆమెతో సంబంధం ఏర్పర్చుకోవాలని ట్రై చేస్తాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోకపోయే సరికి కథ మరో మలుపు తిరుగుతుంది. ఇక అక్కడ నుంచి ఆమె జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంది? చిఎవరికి ఏమయ్యింది అన్నదే అసలు కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

మరి ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇందులో బిగినింగ్ బాగా అనిపిస్తుంది. షకీలా చిన్నతనంలో ఆమె తల్లి తనని ఎలా ఆ రంగానికి తీసుకెళ్లాలని ఫోర్స్ చేస్తుంది, అందుకు గల కారణాలు పరిస్థితులను బాగా చూపించారు. అలాగే చిన్నప్పటి షకీలా రోల్ లో కనిపించిన నటి కాజోల్ ఛగ్ అత్యుత్తమ నటనను కనబర్చింది. మంచి ఎమోషన్స్ కు కూడా ఆమె బాగా హ్యాండిల్ చెయ్యగలిగింది.

ఇక మెయిన్ లీడ్ లో పంకజ్ త్రిపాఠి కోసం చెప్పుకోవాలి. చాలా సెటిల్డ్ గా ఎలాంటి రోల్ ను అయినా సరే పండించగలిగే ఈ నటుడు ఇందులో సీనియర్ హీరో సలీమ్ గా మంచి నటనను కనబరిచాడు. ఇక పెద్దయ్యాక షకీలాగా కనిపించిన రిచా కొన్ని సన్నివేశాల్లో బాగా నటించింది. ముఖ్యంగా చివరి నిమిషాల్లో బాగా చేసింది. ఇంకా అలాగే పలు అడల్ట్ సన్నివేశాలు డీసెంట్ గా అనిపిస్తాయి. అలాగే మరికొన్ని నిజాలను కూడా చూపే ప్రయత్నం చేసారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఇక ఈ చిత్రంలోని డ్రా బ్యాక్స్ కు వస్తే మొట్ట మొదటిగా మైనస్ మైం లీడ్ కు తీసుకున్న రిచా అనే చెప్పాలి. మామూలుగా అయితే ఓ బయోపిక్ తీస్తే దాదాపు అనుకున్న వ్యక్తికి దగ్గర పోలికలు ఉండేవారిని తీసుకుంటారు దాని వల్ల సోల్ మరింత స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. కానీ అసలు ఈమెకు పోలికే ఉండదు పైగా కొన్ని సన్నివేశాల్లో మరీ వరస్ట్ గా కనిపిస్తుంది.

ఇక్కడే పెద్ద దెబ్బ పడింది.అలాగే గతంలో చూసిన డర్టీ పిక్చర్ ఫ్లేవరే చాలా మేర కనిపిస్తుంది. ఇది కాస్త నిరాశ పరిచే అంశం. అలాగే వీటిని మించి మితి మీరిన వల్గర్ సన్నివేశాలు బాగా ఎక్కువగా కనిపిస్తాయి. వీటి వల్ల ఈ చిత్రం మరీ బి గ్రేడ్ సినిమాలా అనిపిస్తుంది.

వీటితో పాటుగా స్లో గా ఉండే నరేషన్, సరైన ఎమోషన్స్ లేకపోవడం వంటివి దెబ్బ తీశాయి. మరో ముఖ్యమైన మైనస్ పాయింట్ ఏంటంటే సరైన రచన లేకపోవడం అని చెప్పాలి. ఈ చిత్రానికి నలుగురు పని చేసారు, మరి వారేం చేశారో వారికే తెలియాలి. సరైన ఎమోషన్స్ ను రాసుకోలేదు, ఒక బయోపిక్ కు కావాల్సిన మినిమమ్ బేసిస్ ను చాలానే మిస్ చేసేసారు.

 

సాంకేతిక వర్గం :

 

ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే ఈ చిత్రానికి పని చేసిన రచయితలు రోహిత్ బనావిల్కార్, రోహన్ బజాజ్, ఆశిష్ లు చాలా నిరాశపరిచే విధంగా పనిచేసారు. సరైన డైలాగ్స్ రాసుకోకపోవడం ఎంతో కీలకమైన కొన్ని సన్నివేశాలను సింపుల్ గా చూపించడం పెద్దగా ఇంపాక్ట్ కలిగించవు.

అలాగే నిర్మాణ విలువలు కూడా అంత చెప్పుకోదగ్గ రీతిలో కనిపించవు. ఎడిటింగ్ అంతగా బాగోదు కానీ కెమెరా వర్క్ పర్వాలేదనిపిస్తుంది. ఇక దర్శకుడు ఇంద్రజిత్ విషయానికి వస్తే తన దగ్గర మంచి కథను పెట్టుకున్నా దానిని తెరకెక్కించడంలో పూర్తిగా విఫలం అయ్యారు. అంతే కాకుండా అందులో తన అనుభవలేమి కనిపిస్తుంది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ షకీలా బయోపిక్ లో ఒక్క జస్ట్ స్టార్టింగ్ బాగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ మిగతా అన్ని అంశాలు ఏమీ కూడా ఆకట్టుకోవు. సరైన కథనం లేకపోవడం, నిర్మాణ విలువలు, ఓవర్ వల్గారిటీ, ఎమోషన్స్ అలాగే కొంత మేర రిచా అంశాలు నిరాశ పరుస్తున్నాయి. అలాగే సరైన డైరెక్షన్ లేని ఈ సినిమాను కాస్త పక్కన పెడితేనే మంచిది.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు