విడుదల తేదీ : జులై 22, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
నటీనటులు: రణబీర్ కపూర్, సంజయ్ దత్, వాణీ కపూర్, రోనిత్ రాయ్, సౌరభ్ శుక్ల
దర్శకత్వం : కరణ్ మల్హోత్రా
నిర్మాతలు: ఆదిత్య చోప్రా
సంగీత దర్శకుడు: మిథూన్
సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి
ఎడిటర్: శివకుమార్ వి పానికర్
రణబీర్ కపూర్ హీరోగా వాణీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ షంషేరా. అగ్నీపథ్ మూవీ ఫేమ్ కరణ్ మల్హోత్రా తెరకెక్కించిన ఈ పీరియాడిక్ డ్రామా మూవీలో సంజయ్ దత్ విలన్ గా కనిపించారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు క్రియేట్ చేసిన షంషేరా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
మొఘలులు మరియు రాజ్‌పుత్‌ల మధ్య జరిగిన పోరాటంలో, ఖమేరాన్‌లు ఇబ్బందుల్లో పడతారు. అయితే బ్రిటిష్ వారి దారుణమైన పాలనలో ఖమేరాన్‌లు బానిసలుగా చూడబడతారు.దానితో వేరే దారి లేని ఖమేరాన్‌లు అగ్రవర్ణాల సంపదను దోచుకునే దొంగలుగా మారతారు. అయితే వారిని అదుపు చేసేందుకు శుద్ధ్ సింగ్ (సంజయ్ దత్) అనే పోలీస్ అధికారిని నియమిస్తారు. అయితే షంషేరా (రణబీర్ కపూర్) ఖమెరాన్ ల నాయకుడిగా వ్యవహరించి బ్రిటిష్ వారితో చేతులు కలిపి అనంతరం తమ ఖమెరాన్ లని రక్షిస్తాడు. అనంతరం తన ప్రాణాలు వదులుతాడు షంషేరా. అయితే కొన్నేళ్ల తరువాత షంషేరా కొడుకైన మల్ల (యంగ్ రణబీర్ కపూర్) తన తండ్రి మాదిరిగా ఖమెరాన్ ల బాధ్యత తీసుకుంటాడు. మరి ఆ తరువాత ఖమెరాన్ లని అతడు ఎలా రక్షిస్తాడు, ఇంతకీ తన తండ్రి బాటలో నడిచిన మల్ల ఎంతవరకు దానిని సాధిస్తాడు అనేది మొత్తం సినిమాలో చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఈ మూవీకి వెన్నెముకగా నిలిచారు హీరో రణబీర్ కపూర్. అటు షంషేరా గా ఇటు మల్ల గా రెండు రకాల పాత్రల్లో తన అత్యద్భుత స్క్రీన్ పెర్ఫార్మన్స్ తో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నారు రణబీర్. ఇక సినిమాలో ప్రధానమైన బలం విజువల్ ఎఫక్ట్స్. కీలకమైన ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చిన ట్రైన్ సీన్ ఎంతో అద్భుతంగా ఉంది. సినిమా విజువల్ గా కూడా అదిరిపోయింది. అలానే హీరోయిన్ వాణీ కపూర్ కూడా తన పాత్రలో అందరినీ ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్ :
నిజానికి షంషేరా మూవీకి కథే ప్రధాన వీక్ పాయింట్ అని చెప్పాలి. ఏ మాత్రం ఆకట్టుకోని విధంగా సాగె కథనం కూడా ప్రేక్షకులకి కొంత బోర్ కొట్టిస్తుంది. చాలావరకు సీన్స్ మనం ముందుగానే గెస్ చేసే విధంగా ఉంటాయి. నేరేషన్ కూడా ఆకట్టుకోదు. మంచి పీరియాడిక్ డ్రామా జానర్ ని ఎంచుకన్న దర్శకడు మూవీని ప్రేక్షకులకి చేరువ చేయడంలో చాలా వరకు విఫలం అయ్యాడు. చాలా వరకు స్టోరీ ఎంతో నెమ్మదిగా సాగడంతో పాటు పెద్దగా అలరించే అంశాలు ఉండవు. ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులకి కనెక్ట్ కావు. మూవీలో సంజయ్ దత్ పాత్ర బాగా డిజైన్ చేసినప్పటికీ చాలా వరకు ఆ పాత్ర ఆడియన్స్ ని ఇరిటేట్ చేస్తుంది. ముఖ్యంగా ఆయన పలికే డైలాగ్ డెలివరీ కూడా బాలేదు. ఆయనకి పెట్టిన డబ్బింగ్ అసలు సూట్ కాలేదు. చాలావరకు సినిమాలో సీన్స్ ఆడియన్స్ యొక్క పేషెన్స్ ని టెస్ట్ చేస్తాయి. ఎక్కువ లెంగ్త్ ఉన్న మూవీ కావడం దీనికి మరింత మైనస్ అనే చెప్పాలి. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్ బాగున్నప్పటికీ సరైన కథ, కథనాలు లేకపోవడం షంషేరా కి మైనస్.
సాంకేతిక విభాగం :
ప్రముఖ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ వారి నుండి వచ్చే సినిమాలు అన్ని కూడా ఎంతో భారీగా హై క్వాలిటీ తో రూపొందుతూ ఉంటాయి. అదే విధంగా షంషేరా కూడా ఎంతో భారీ స్థాయిలో రూపొందింది. సినిమాకి పెద్ద ప్లస్ అయిన విజువల్ ఎఫక్ట్స్ విషయంలో నిర్మాత భారీగా ఖర్చు చేసారు. సంగీతం బాగుంది, సాంగ్స్ బాగున్నప్పటికీ బీజీఎమ్ పెద్దగా ఆకట్టుకోదు. ముఖ్యంగా దర్శకుడు కరణ్ మల్హోత్రా రణబీర్ వంటి టాప్ స్టార్ ని పెట్టుకుని షంషేరా స్క్రిప్ట్ ని ఏ మాత్రం హ్యాండిల్ చేయలేకపోయారు. పూర్తిగా చప్పగా సాగె కథనం ఆడియన్స్ కి నీరసం తెప్పిస్తుంది. కొన్ని సీన్స్ అయితే మరీ సాగతీతగా అనిపిస్తాయి. ఆ విధంగా మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నారు కరణ్.
తీర్పు :
డైరెక్టర్ కరణ్ మల్హోత్రా ఈ గ్రాండ్ మూవీ కోసం తీసుకున్న కథ, కథనాల విషయమై మరింత శ్రద్ధ పెట్టి ఉంటె బాగుండేది. కేవలం హీరో రణబీర్ మూవీ భారాన్ని మొత్తం తన భుజం పై వేసుకుని నడిపించారు. విజువల్ గా విఎఫ్ఎక్స్ అంశాల పరంగా ఎంతో గ్రాండ్ గా ఉన్న శంషేరా, పూర్తిగా అనేక లోపాలు కలిగి ఉండడంతో మున్ముందు ఆడియన్స్ ని ఆకట్టుకుని ముందుకు సాగడం కష్టమే అం చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఎంత స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
123telugu.com Rating: 1.5/5
Reviewed by 123telugu Team