సమీక్ష : “శేఖర్” – కొన్ని చోట్ల ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్ !

సమీక్ష : “శేఖర్” – కొన్ని చోట్ల ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్ !

Published on May 21, 2022 3:02 AM IST
Shekar Movie Review

విడుదల తేదీ : మే 20, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: డా.రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్ కుబ్చంధాని, శివాని రాజశేఖర్, అభినవ్ గోమతం, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవివర్మ, శ్రవణ్ రాఘవేంద్ర

దర్శకత్వం : జీవిత రాజశేఖర్

నిర్మాత: బీరం సుధాకర రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గరం వెంకట శ్రీనివాస్.

సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ నరగాని

జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మించిన సినిమా శేఖర్. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

క‌థ‌:

 

శేఖర్ (రాజశేఖర్) వాలంటరీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో కేసులను చేధించడంలో శేఖర్ మంచి ఎక్స్ పర్ట్. అయితే, పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని బాధాకరమైన సంఘటనల కారణంగా శేఖర్ మత్తుకు అలవాటు పడి నిర్లక్ష్యంగా ఉంటాడు. ఐతే, ఒకరోజు శేఖర్ మాజీ భార్య ఇందుకు యాక్సిడెంట్ అవుతుంది. సిటీ ఆసుపత్రిలో ఆమె చనిపోతుంది. గతంలో ఇదే హాస్పిటల్ లో తన కూతురు గీత (శివాని రాజశేఖర్ ) కూడా సేమ్ ఇలాగే చనిపోతుంది. దాంతో శేఖర్ కి వారి చావుల పై అనుమానం కలుగుతుంది. శేఖర్ తన ఇన్వెస్టిగేషన్ ని ప్రారంభిస్తాడు. తన భార్య, కూతురు యాక్సిడెంట్‌ లో చనిపోలేదని, వారిని ఎవరో హత్య చేశారని తెలుసుకుంటాడు. ఈ హత్యల వెనుక ఎవరు ఉన్నారు ?చివరకు శేఖర్ వారి గురించి ప్రపంచానికి ఎలా తెలియజేశాడు ? ఈ క్రమంలో శేఖర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

రాజశేఖర్ వన్ మ్యాన్ షోతో నడిచిన ఈ సినిమాలో.. శేఖర్ పాత్రలో రాజశేఖర్ చక్కగా నటించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో రాజశేఖర్ చాలా బాగా నటించి మెప్పించాడు. ఇక హీరోయిన్ గా నటించిన జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్ కి పెద్దగా నటించే స్కోప్ లేదు. అయితే ఉన్నంతలో ఆమె తన క్యూట్ లుక్స్ లో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది.

కీలక పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, బాగానే నటించారు. అలాగే గీత పాత్రలో నటించిన శివాని రాజశేఖర్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ఇక జీవిత రాజశేఖర్ తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని సస్పెన్స్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఇలాంటి సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సినిమా సాగితేనే.. ఆడియన్స్ ను ఆకట్టుకోగలం. అయితే, ఈ సినిమాలో అలాంటి అంశాలు ఉన్నప్పటికీ.. కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. అయితే, దర్శకురాలు జీవిత సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, ఓవరాల్ కొన్ని చోట్ల లాజిక్స్ వదిలేశారు.

దీనికి తోడు మెయిన్ గా సినిమాలో ఇంట్రసింగ్ ప్లేను బిల్డ్ చేయలేకపోయారు. సినిమాలో మెయిన్ క్యారెక్టైజేషన్స్ ఇంకా ఎఫెక్టివ్ రాసుకోవాల్సింది. అలాగే హీరో క్యారెక్టర్ తాలూకు యాక్టివిటీస్ కూడా సినిమాకి మైనస్ అయ్యాయి. పైగా కొన్ని చోట్ల హీరో ట్రాక్ కూడా బలహీనంగా సాగుతోంది. ఇక కొన్ని సీన్స్ లో నాటకీయత ఎక్కువడంతో ఆ సీన్స్ సహజత్వం లోపించింది.

 

సాంకేతిక విభాగం :

 

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ ఆయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే దర్శకురాలు జీవిత ఆకట్టుకునే ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేది.

 

తీర్పు :

 

మెడికల్ క్రైమ్ పై వచ్చిన ఈ శేఖర్ మూవీ కొన్ని చోట్ల ఆకట్టుకుంది. అలాగే ఈ సస్పెన్స్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని సస్పెన్స్ సీన్స్ బాగున్నాయి. అయితే, కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, అలాగే కొన్ని సీన్స్ లో ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. అయితే సినిమాలో రాజశేఖర్ నటన, ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమాలో కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు