సమీక్ష : షికారు – కొన్ని చోట్ల ఆకట్టుకునే కామెడీ డ్రామా

Shikaaru Movie Review

విడుదల తేదీ : జులై 01, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సాయి ధన్సిక, అభినవ్ మేడిశెట్టి, తేజ్ కూరపాటి, ధీరజ్ ఆత్రేయ, నవకాంత్

దర్శకత్వం : హరి కొలగాని

నిర్మాత: పి ఎస్ ఆర్ కుమార్ (బాబ్జీ)

సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ: వాసిలి శ్యామ్ ప్రసాద్

ఎడిటర్: వెంకటేశ్వరరావు శృంగవరపు

యంగ్ నటి సాయి ధన్సిక ప్రధాన పాత్రలో అభినవ్ మేడిశెట్టి, తేజ కూరపాటి, ధీరజ్, నవకాంత్ మరియు చమ్మక్ చంద్ర లు నటించిన లేటెస్ట్ యూత్ ఫుల్ మూవీ “షికారు”. మరి ఈ చిత్రం కూడా ఈరోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎంతమేర ఆడియెన్స్ ని ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

ఇక కథలోకి వచ్చినట్టయితే.. కాకినాడలో చదువుకునే నలుగురు ఇంజినీరింగ్ కుర్రాళ్ళులో బాబీ(అభినవ్) కాస్త చురుగ్గా తన ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. మరి ఈ నలుగురు లో బాబీ ని దేవిక(సాయి ధన్షిక) అనే ఓ హౌస్ వైఫ్ ఆమె పర్సనల్ లైఫ్ తో సంతృప్తి లేక రమ్మంటుంది. అయితే ఆమె ఇంటికి కూడా బాబీ వెళ్తాడు. కానీ అదే సమయంలో ఆమె భర్త (కిషోర్) తన డ్యూటీ నుంచి సడన్ గా వచ్చేస్తాడు. మరి ఈ సర్ప్రైజింగ్ పరిస్థితి నుంచి బాబీ ఎలా తప్పించుకుంటాడు? వారిద్దరూ కిషోర్ కి దొరికేస్తారా? ఈ కథలో ఇతర పాత్రలు ఎలాంటి ఫన్ జెనరేట్ చేసాయి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రం అంతా చూసాక ఆడియెన్స్ కి ఓవరాల్ గా అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు టీజర్, ట్రైలర్ ప్రోమోస్ లో చూసి కాస్త అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని చాలా మంది అందుకోవచ్చు కానీ తర్వాత మేకర్స్ చెప్పినట్టుగానే ఈ సినిమలో ఎక్కడా ఓవర్ డోస్ కాకుండా జాగ్రత్త పడి నరేట్ చేయడం ఇంప్రెస్ చేస్తుంది.

అలాగే మరో బిగ్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే సినిమాలో మంచి ఫన్ తో ఎంటర్టైనింగ్ గా సాగే కథనం అని చెప్పాలి. ఇది ఆడియెన్స్ ని మెప్పిస్తుంది. ఇక ఇలాంటి రోల్ ని తెలుగులో ఫస్ట్ అటెంప్ట్ లో ఎంచుకున్న సాయి ధన్షిక ని మెచ్చుకొని తీరాలి. అంతే కాకుండా తన రోల్ కి తగ్గట్టుగా మంచి పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుంది. ఆమె లుక్స్ పరంగా కూడా అందంగా కనిపించి మెప్పించింది.

ఇంకా ధీరజ్ మంచి నటన, షేడ్స్ మరియు డైలాగ్ డెలివరీ తో ఆకట్టుకుంటాడు. అలాగే ఇతర నటులు తేజ్, నవకాంత్ మరియు చమ్మక్ చంద్రలు వారి పాత్రలకు న్యాయం చేకూర్చారు. వీటితో పాటుగా సినిమాలో బాలయ్యపై చూపించే ఓ సన్నివేశం అయితే మంచి ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మంచి ఎంటర్టైనింగ్ నరేషన్ కనిపించినా చాలా చోట్ల అయితే కథనంని ఆడియెన్స్ ముందే ఊహించదగేలా ఉంటుంది. అలాగే సినిమాలో ఒక స్టేజ్ కి వచ్చే సరికి మెయిన్ ఇష్యూ నుంచి కాస్త డైవర్ట్ అయ్యినట్టు కూడా అనిపిస్తుంది. ఇంకా అన్నపూర్ణ, సురేఖ లాంటి నటులను పెట్టుకున్నారు కానీ వారికి మరింత స్కోప్ ఇచ్చి మరిన్ని మంచి సీన్స్ ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

ఈ చిత్రాల్లో నిర్మాణ విలువలు మాత్రం సినిమా సెటప్ కి తగ్గట్టుగా క్లీన్ గా కనిపిస్తాయి. అలాగే టెక్నీకల్ టీం విషయానికి వస్తే శేఖర్ చంద్ర ఇచ్చిన సంగీతం బాగుంది, అలాగే వసిల్ శ్యామ్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. అలాగే వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక దర్శకుడు హరి కొలగాని విషయానికి వస్తే ఈ సినిమాకి ఆల్ మోస్ట్ తాను సక్సెస్ అయ్యిపోయారని చెప్పాలి. ఒకింత ఊహించదగ్గ నరేషన్ నే తాను రాసుకున్నా ఆధ్యంతం ఎంటర్టైనింగ్ గా చూపించడం అనేది బాగుంది. వీటితో పాటుగా మంచి సందేశాన్ని ఇవ్వడం ఇంప్రెస్ చేస్తుంది. ఓవరాల్ గా అయితే ఈ సినిమాకి మాత్రం తాను దర్శకునిగా న్యాయం చేకూర్చాడు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “షికారు” చిత్రం మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆకట్టుకునే సందేశం, నటీ నటుల పెర్ఫామెన్స్ లతో ఎంగేజింగ్ గా ఉంటుంది. కాకపోతే ఎంటర్టైనింగ్ గా ఉన్నా రొటీన్ కథనం పక్కన పెడితే ఈ సినిమాని ఈ వారాంతానికి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :