రివ్యూ : షూట్ అవుట్ ఎట్ ఆలేరు (తెలుగు సిరీస్ జీ5 లో ప్రసారం)

రివ్యూ : షూట్ అవుట్ ఎట్ ఆలేరు (తెలుగు సిరీస్ జీ5 లో ప్రసారం)

Published on Dec 27, 2020 1:58 AM IST
Solo Brathuke So Better movie review

విడుదల తేదీ : డిసెంబర్ 25, 2020

123telugu.com రేటింగ్: 3.25/5

నటీనటులు : ప్రకాష్ రాజ్, మేకా శ్రీకాంత్, సంపత్ రాజ్

దర్శకుడు : ఆనంద్ రంగా

నిర్మాత: సుష్మితా కొణిదెల

సినిమాటోగ్రఫీ : అనిల్ బండారి

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల మరియు ఆమె భర్త విష్ణులు కలిసి నిర్మించిన నిజ జీవిత వెబ్ సిరీస్ “షూట్ అవుట్ ఎట్ ఆలేరు”. మొత్తం 8 ఎపిసోడ్స్ తో ప్లాన్ చేసిన ఈ సిరీస్ లేటెస్ట్ గా జీ 5 లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం.

 

కథ :

2007 హైదరాబాద్ లో జరిగిన మక్కా మసీద్ బ్లాస్ట్ ల సమయంలో కోపోద్రిక్తుడు అయిన అక్తర్ అనే వ్యక్తి పోలీసులను టార్గెట్ చెయ్యడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో అక్తర్ గుజరాత్ లోని అహ్మదాబాద్ కు అక్కడి ముఖ్యమంత్రిని చంపడానికి బయలుదేరుతాడు. ఇక ఆ క్రిమినల్ ను పట్టుకోడానికి స్పెషల్ ఆఫీసర్ ఐజీ ప్రవీణ్ చంద్(శ్రీకాంత్) తన టీం తో కలిసి ఒక స్పెషల్ ఆపరేషన్ ను స్టార్ట్ చేస్తాడు. మరి అలా స్టార్ట్ చేసిన మిషన్ లో లాస్ట్ కు ఏమయ్యింది? అసలు అక్తర్ పోలీసులను ఎందుకు టార్గెట్ చేసాడో అన్నదే ఈ సిరీస్ వృత్తాంతం.

 

ఏమి బాగుంది?

ఈ సిరీస్ లో మొదటగా మాట్లాడుకోవాల్సింది దర్శకుడు ఆనంద్ రంగా కోసమే అని చెప్పాలి. ఇలాంటి ఒక సెన్సిటివ్ పాయింట్ ను అంతే సున్నితంగా చూపించాల్సి ఉంటుంది. దానిని తాను అద్భుతంగా హ్యాండిల్ చేసారు. అలాగే అప్పటి విజువల్స్ ను మళ్లీ ఈ సిరీస్ లో అత్యున్నత ప్రామాణికాలతో చూపించిన భావన ప్రతీ ఒక్కరికీ కలుగుతుంది.

వీటితో పాటుగా అతడి కథనం కూడా మరో మంచి పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఈ సిరీస్ లో మంచి సినిమాటోగ్రాఫీ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు మంచి ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. ఇక ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా కనిపించిన శ్రీకాంత్ అత్యద్భుత పెర్ఫామెన్స్ కనబరిచారు.

కొన్ని కీలక ఎపిసోడ్స్ లో అయితే శ్రీకాంత్ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. అలాగే మరి కీ రోల్ తేజ కనుమను అక్తర్ పాత్రలో మంచి నటనను కనబరిచాడు. అలాగే మరో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఈ సిరీస్ లో తనకు ఇచ్చిన ఇంపార్టెంట్ రోల్ ను తనదైన నటనతో రక్తి కట్టించారు. అలాగే నందిని రాయ్ మరియు గాయత్రీ గుప్త తమ పాత్రలకు ఓకే అనిపించారు.

 

ఏమి బాలేదు?

ఈ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ లో అన్ని బాగానే ఉంటాయి కానీ ఓ రెండు ఎపిసోడ్స్ లో మాత్రం కాస్త ఇంటెన్స్ తగ్గినట్టు అనిపిస్తుంది. అలాగే ఇందులో మెయిన్ కథలోకి వెళ్ళడానికి కూడా ఎక్కువ సమయాన్నే తీసుకున్నట్టు కూడా అనిపిస్తుంది.

ఇక అలాగే ఇలాంటి సిరీస్ లు అంటే ఖచ్చితంగా మంచి షూట్ అవుట్ ఎపిసోడ్స్ ను ఆశిస్తారు కానీ అలాంటి వాటిని ఈ సిరీస్ లో పెద్దగా చూపకపోవడం చిన్నగా నిరాశ కలిగిస్తుంది. అలాగే యాక్షన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటే బాగున్ను అనిపిస్తుంది.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ “షూట్ అవుట్ ఎట్ ఆలేరు” సిరీస్ లో మెయిన్ లీడ్ సాలిడ్ పెర్ఫామెన్స్ లు అలాగే ఆద్యంతం ఆసక్తిగా సాగే కథనం మంచి ఆసక్తిని రేకెత్తిస్తాయి. కానీ కొన్ని ఎపిసోడ్స్ లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. అది కూడా పెద్ద ఫ్లా గా కూడా కనిపించకపోవచ్చు. కానీ ఈ అవుట్ స్టాండింగ్ సిరీస్ తమ వృత్తి పట్ల విధేయత కలిగి ప్రాణాలు అర్పించిన పోలీసులకు ఒక ఖచ్చితమైన నివాళిగా నిలుస్తుంది అని చెప్పాలి.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు