సమీక్ష : “చిన్నా” – అక్కడక్కడా ఆకట్టుకునే ఎమోషనల్ థ్రిల్లర్

Siddharth Chinna Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబరు 06, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సిద్ధార్థ్, నిమిషా విజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ మరియు ఇతరులు

దర్శకుడు : ఎస్ యూ అరుణ్‌కుమార్

నిర్మాత: సిద్ధార్థ్

సంగీతం: ధిబు నినాన్ థామస్ మరియు విశాల్ చంద్రశేఖర్

సినిమాటోగ్రఫీ: బాలాజీ సుబ్రమణ్యం

ఎడిటర్: సురేష్ ఎ ప్రసాద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

యంగ్ హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ చిత్రమే “చిత్తా”. తమిళంలో భారీ సక్సెస్ ని చూసిన ఈ చిత్రం తెలుగులో “చిన్నా” పేరిట రిలీజ్ చేయడానికి తీసుకొచ్చారు. మరి తమిళ్ లో అంత పెద్ద హిట్ అయ్యిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ ని మెప్పిస్తుందో లేదో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

ఇక కథలోకి వస్తే చిన్నా అలియాస్ ఈశ్వర్(సిద్ధార్థ్) చాలా సాధారణమైన మిడిల్ క్లాస్ మనిషి మున్సిపల్ ఆఫీస్ లో చిన్నపాటి ఉద్యోగంతో తన వదిన, ఆమె కూతురు అయిన చిట్టి(బేబీ సహస్ర) లతో సింపుల్ తన అన్నయ్య మరణాంతరం లైఫ్ కొనసాగిస్తూ ఉంటాడు. అయితే చిన్నా కి ఆడవాళ్లు అన్నా చిన్న పిల్లలు అన్నా ఎంతో గౌరవం, అమితమైన ప్రేమ. అలాంటి వ్యక్తికత్వం కల తన మీద ఓ చిన్నారిని శారీరికంగా ఇబ్బంది కలిగించాడు అని సడెన్ గా కథ మలుపు తిరుగుతుంది. ఈ క్రమంలో తనని తాను ప్రేమించిన అమ్మాయి శక్తి(నిమిషా విజయన్) కూడా నమ్మే పరిస్థితి కనిపించదు. ఇలాంటి సమయంలో తాను ఎంతో ప్రేమగా చూసుకునే తన అన్నయ్య కూతురు చిట్టి మిస్ అవుతుంది. దీనితో అక్కడ నుంచి ఏం జరిగింది? చిన్నా తన చిట్టిని కనుగొంటాడా లేదా? తనపై పడిన ఆరోపణ క్లియర్ అవుతుందా లేదా అసలు ఈ చిన్న పిల్లల విషయంలో ఏం జరుగుతుంది అని తెలియాలి అంటే ఈ చిత్రంని థియేటర్స్ లో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

మొదటగా సిద్ధార్థ్ కోసమే మాట్లాడుకుంటే చాలా కాలం తర్వాత తన నుంచి ఒక ఎక్ట్రార్డినరీ పెర్ఫామెన్స్ ని మనం ఈ చిత్రంలో చూడవచ్చు. మొదట అంతా సింపుల్ గానే ఉన్నా తర్వాత తర్వాత సిద్ధార్థ్ లోని షేడ్స్ కట్టి పడేస్తాయి. చాలా సింపుల్ లుక్స్ లో తన ఎమోషన్స్ గాని తాను పడే ఆవేదన వంటివి కదిలిస్తాయి. ఖచ్చితంగా తన కెరీర్ లో చిన్నా చిత్రం తన పెర్ఫామెన్స్ పరంగా మరో మంచి చిత్రంగా నిలుస్తుంది.

అలాగే చిన్నారి సహస్ర చాలా బాగా నటించింది. ఇంకా నటి నిమిషా విజయన్ కూడా క్లీన్ అండ్ సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచింది. అలాగే సినిమాలో నెగిటివ్ షేడ్ లో కనిపించిన నటుడు ‘బిచ్చగాడు’ నటుడు ఆశ్చర్యపరుస్తాడు. ఇక సినిమాలో బాగా ఎంగేజింగ్ గా అనిపించే అంశం ఏదన్నా ఉంది అంటే అది సెకండాఫ్ అని చెప్పాలి.

సెకండాఫ్ లో మంచి ఆసక్తిగా సాగే కథనం సినిమాలో ఆకట్టుకుంటుంది. పలు ఇన్వెస్టిగేషన్ సీన్స్ మంచి థ్రిల్ ని కలిగిస్తాయి. అలాగే సినిమాలో మెయిన్ గా ఆడపిల్లలు విషయంలో చిన్న ఏజ్ నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సెల్ ఫోన్ వినియోగం విషయంలో ఇచ్చిన సందేశం మెప్పిస్తుంది. అలాగే క్లైమాక్స్ ఎండింగ్ గా బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మెయిన్ కథాంశం బాగానే ఉన్నా దర్శకుడు చాలా స్లో గా అయితే స్టార్ట్ చేసాడు. దీనితో మెయిన్ కంటెంట్ లోకి సినిమా వెళ్ళడానికి కాస్త సమయం తీసుకుంటుంది. దీనితో ఫస్టాఫ్ ఒకింత బోర్ అనిపించవచ్చు. అలానే ఈ సినిమాలో టచ్ చేసిన సెన్సిటివ్ మ్యాటర్ మనం ఆల్రెడీ పలు చిత్రాల్లో చూసినట్టుగానే అనిపిస్తుంది.

ఇంట్రెస్టింగ్ గా ఆ చిత్రాలు సాయి పల్లవి నటించిన “గార్గి”, “లవ్ స్టోరీ” చిత్రాల్లో పాయింట్స్ లానే అనిపిస్తాయి. దీనితో కొంచెం అక్కడక్కడా మనం చూసిందే కదా అనిపిస్తుంది. దీనితో కాస్త థ్రిల్లింగ్ నరేషన్ ని జోడించడం సెట్ అయ్యింది. లేకపోతే ఇంకా రొటీన్ గానే అనిపించవచ్చు.

 

సాంకేతిక వర్గం :

ఈ చిత్రానికి నిర్మాణం సిద్ధార్థ్ వహించాడు తెలుగులో ఆసియన్ సినిమాస్ వారు రిలీజ్ చేశారు. మరి తెలుగు డబ్బింగ్ విషయంలో మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు ప్రతీ చిన్న డీటెయిల్ ని మన తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా సెటప్ చేశారు. ఇక టెక్నీకల్ టీం లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన విశాల్ చంద్రశేఖర్ కోసం మాట్లాడుకోవాలి. తాను సాలిడ్ స్కోర్ ని ఆయా సీన్ తాలూకా ఎమోషన్ కి తగ్గట్టుగా కంపోజ్ చేసాడు. అలాగే ధిబు నినన్ థామస్ సాంగ్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా ఓకే.

ఇక దర్శకుడు ఎస్ యూ అరుణ్ కుమార్ విషయానికి వస్తే.. కాస్త రొటీన్ ప్లాట్ నే తాను పట్టుకున్నా దానిని ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ మార్గంలో ప్రెజెంట్ చేయడంలో అయితే సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. అక్కడక్కడా చిన్న చిన్న తడబాట్లు ఉన్నాయి కానీ ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఓ ఎమోషనల్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం “చిన్నా” పర్వాలేదనిపిస్తుంది. ఆసక్తిగా సాగే సెకండాఫ్, సినిమాలో సందేశం బాగున్నాయి. వీటితో తోడు సిద్దార్థ్ నాచురల్ పెర్ఫామెన్స్ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. అయితే సినిమా బోర్ గా సాగే ఫస్టాఫ్, అందరికీ తెలిసిన రొటీన్ కంటెంట్ వంటివి మాత్రం నిరాశపరుస్తాయి. వీటితో అయితే ఈ చిత్రాన్ని ఈవారాంతానికి ఓసారి ట్రై చేయవచ్చు.

 

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version