సమీక్ష : సిందూరం – సాదాసీదాగా సాగే సోషల్ డ్రామా

Sindhooram Movie Review

విడుదల తేదీ : జనవరి 26, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: బ్రిగిడా సాగ, శివ బాలాజీ, ధర్మ, అద్దూరి రవి వర్మ, దయానంద్ రెడ్డి, కేశవ్ దీపక్ త‌దిత‌రులు

దర్శకుడు : శ్యామ్ తుమ్మలపల్లి

నిర్మాత: ప్రవీణ్ రెడ్డి జంగా

సంగీత దర్శకుడు: గౌర హరి

సినిమాటోగ్రఫీ: కేశవ్

ఎడిటర్: జెస్విన్ ప్రభు

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

తమిళ నటి బ్రిగిడా సాగ, నూతన నటుడు ధర్మ, శివ బాలాజీ సహా మరికొందరు నటులు కీలక పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ సోషల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ సిందూరం. ట్రైలర్, టీజర్, సాంగ్స్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకాభిమనుల ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ యొక్క సమీక్షను ఇప్పుడు చూద్దాం.

కథ :

ఖమ్మం దగ్గర గల శ్రీరామగిరి అనే పల్లెటూళ్ళో రవి (ధర్మ) టీ అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. అయితే తన క్లాస్ మేట్ మరియు గ్రామాధిపతి ఈశ్వర్ రెడ్డి సోదరి అయిన శిరీష (బ్రిగిడా సాగ) ఎమ్మార్వో గా కొనసాగుతూ పలు సమస్యలు తీరుస్తూ విధులు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే త్వరలో రానున్న జెడ్పిటిసి ఎన్నికలను ఆపేందుకు ఈశ్వర్ రెడ్డి మరియు ఇతర రాజకీయనాయకుల పై తిరుగుబాటుకు సిద్దమవుతాడు సింగన్న (శివ బాలాజీ). కాగా ఈ క్రమంలో శిరీష తన గ్రామంలో నక్సలిజాన్ని నిర్మూలించాలని నిర్ణయించుకుంటుంది. మరి శిరీష తన లక్ష్యంలో విజయం సాధించిందా, ఇంతకీ రవికి సింగన్నకి సంబంధం ఏమిటి, శిరీషకు రవి మద్దతిచ్చాడా, అనేటువంటి వాటికి సమాధానాలు కావాలంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

నిజానికి మనం గతంలో నక్సలిజం కాన్సెప్ట్‌తో వచ్చిన పలు సినిమాలను చూసాము. అయితే సిందూరం మూవీ మాత్రం నాటి రోజుల్లో సరిగ్గా నక్సలిజం అంటే ఏమిటి మరియు దాని వెనుక ఉన్న వాస్తవాల గురించి తెలిపే విభిన్న సినిమా అని చెప్పాలి. దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి ఇటువంటి అంశాన్ని సినిమా యొక్క కథా వస్తువుగా తీసుకుని నడిపిన విధానాన్ని మెచ్చుకోవచ్చు. శిరీష పాత్ర చేసిన బ్రిగిడా కి ఇది తెలుగులో ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా ఆమె ఎంతో బాగా యాక్ట్ చేసారు. ఇక నూతన నటుడు ధర్మ ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్న నటుడు మాదిరిగా ఎంతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ ఎమోషనల్ సీన్స్ తో పాటు క్లైమాక్స్ సన్నివేశాల్లో తన నటన ఆడియన్స్ మనసు తాకుతుంది. కెరీర్ పరంగా తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పాలి. ముఖ్యంగా రవి, శిరీష మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. విజువల్స్ తో వారి సీన్స్ ని ఎలివేట్ చేస్తూ వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలరిస్తుంది. ఇతర నటీనటుల యాక్టింగ్ కూడా బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

అయితే ఈ సినిమా కోసం శ్యామ్ తుమ్మలపల్లి నక్సలిజం అంశాన్ని తీసుకోవడం బాగున్నప్పటికీ కాలాన్ని బట్టి వారి భావాలు, విధానాలు వంటివి ఏ విధంగా మారుతూ వస్తున్నాయి అనేది ఆడియన్స్ నాడి పట్టి చూపించడంలో మాత్రం ఆకట్టుకోలేకపోయారు. స్క్రీన్ ప్లే లో చాలా వరకు లోపాలు ఉన్నాయి. అలానే మరికొన్ని ముఖ్య పాత్రలకు బాగా తెలిసిన నటీనటులను తీసుకుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ సీన్స్ చాలా వరకు ఒకింత బోరింగ్ గా సాగుతాయి, స్క్రీన్ ప్లే లోపాలు బాగా కనపడతాయి. ఇక కీలకమైన సింగన్న పాత్రకి శివబాలాజీ న్యాయం చేసినప్పటికీ కూడా మరొక నోటెడ్ యాక్టర్ ని తీసుకుని ఉంటె సినిమాకి మరింత ప్లస్ అయ్యేది. అలానే సినిమాలో జోష్ రవి వంటి కథకి సంబంధం లేని పాత్రలని కామెడీ కోసం ఇరికించడం బాగోలేదు. ఇక సాంగ్స్ పరంగా చూస్తే క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ బాగుంటుంది తప్ప మిగతావి అలరించవు.

 

సాంకేతిక వర్గం :

ముఖ్యంగా కథ బాగా ఎంపిక చేసుకున్న దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి, కీలక పాత్రలకు తెలిసిన నటుల్ని తీసుకోకపోవడం మైనస్, అలానే స్క్రీన్ ప్లే పై కూడా మరింతగా శ్రద్ధ పెడితే బాగుండేది. కాగా డీవోపీ గా వర్క్ చేసిన కేశవ్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి వంటి వారి పనితీరు బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే ఫస్ట్ హాఫ్ లో వచ్చే చాలా వరకు అనవసరపు సన్నివేశాలు ఎడిట్ చేస్తే మరింత బాగుండేది.

 

తీర్పు :

మొత్తంగా చెప్పాలి అంటే సిందూరం మూవీ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ దర్శకుడు కథనాన్ని నడిపిన తీరు అక్కడక్కడా పర్వాలేదనిపిస్తుంది అంతే. అయితే మెయిన్ రోల్స్ చేసిన ధర్మ, బ్రిగిడా సాగ ల నటన బాగుంది. ఒకటో రెండో సీన్స్ తప్ప చాలా వరకు సినిమా పెద్దగా ఆకట్టుకోదు. అయితే మీరు కనుక సోషియో పొలిటికల్ డ్రామా మూవీస్ ఇష్టపడే వారు అయితే ఈ వారం సిందూరం చూసేయొచ్చు.

 

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version