ఓటిటి రివ్యూ : సీత ఆన్ ది రోడ్ – తెలుగు చిత్రం జీ ప్లెక్స్ లో ప్రసారం

ఓటిటి రివ్యూ : సీత ఆన్ ది రోడ్ – తెలుగు చిత్రం జీ ప్లెక్స్ లో ప్రసారం

Published on Mar 6, 2021 3:01 AM IST

తారాగణం : కల్పిక గణేష్, నేసా ఫర్హాది, గాయత్రి గుప్తా
దర్శకత్వం: ప్రణీత్ యరోన్
నిర్మాణం: ప్రణూప్ జవహర్, ప్రణీత్ యారోన్
సంగీతం: ప్రణీత్ యారోన్
సినిమాటోగ్రఫీ: రాజ్ అనంత
ఎడిటింగ్: సురేష్ కుమార్ కసుకుర్తి

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం ” సీత ఆన్ ది రోడ్”.ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎట్టకేలకు స్ట్రీమింగ్ యాప్ “జీ ప్లెక్స్” లో అందుబాటులోకి ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఈ సినిమాలో మొత్తం ఐదుగురు అమ్మాయిలు కలిపి వేసుకున్న ఓ రోడ్ ట్రిప్ పై అంతా నడుస్తుంది. కల్పిక గణేష్, ఖతేరా హకీమీ, నేసా ఫర్హది అలాగే గాయత్రీ గుప్తా మరియు ఉమా లింగయ్య..డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ లకు సంబంధించిన వీరు అంతా ఎలా కలుసుకొని ఒక రోడ్ ట్రిప్ వేసుకున్నారు? ఆ తర్వాత ఏమయ్యింది అన్నదే అసలు కథ.

ప్లస్ పాయింట్స్?

ఈ సినిమా అంతా ఎక్కువ కర్ణాటక బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తుంది కాబట్టి విజువల్ గా కొన్ని కొన్ని సన్నివేశాల్లో చాలా బాగా కనిపిస్తాయి. అలాగే ఈ సినిమా అంతా మొత్తం కనిపించిన ఫిమేల్ లీడ్స్ ప్రతీ ఒక్కరు డీసెంట్ వర్క్ అందించారు.

కల్పిక మరియు ఖతేరా లు వాళ్ళవి కాస్త బోల్డ్ అయినా చాలా కాన్ఫిడెంట్ గా ఆ రోల్స్ లో కనిపించారు. అలాగే గాయత్రి మతియు ఉమా లు వారి పాత్రలకు తగ్గ ఇనోసెన్స్ చూపించి ఆకట్టుకుంటారు. మరి ఇంకా అలాగే ఈ సినిమాలో కొన్ని సింపుల్ ఎమోషన్స్ కూడా బాగుంటాయి.

మైనస్ పాయింట్స్ :

ఇక మైనస్ పాయింట్స్ కు వస్తే కనిపించే ఐదుగురు అమ్మాయిలకి కూడా వ్యక్తిగతంగా ఒక్కో స్టోరీ ఉంటుంది కానీ వాటిని మాత్రం సరైన మార్గంలో చూపించినట్టు ఎక్కడా అనిపించదు. అంతే కాకుండా మరో మైనస్ ఏమిటంటే వారి స్టోరీలలో బలమైన ఎమోషన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంత ఎఫెక్టీవ్ గా అనిపించవు.

ఇంకా వీరి ఐదుగు రోల్స్ లోనే ఇంకా అనేక లోపాలు కనిపిస్తాయి. వారి నటన వరకు ఓకే కానీ మిగతా అంతా చాలా సిల్లీ గా అనిపిస్తుంది. అంతగా ఆసక్తిగా సాగని కథనం కూడా ఒకింత బోర్ కొట్టిస్తుంది.

సాంకేతిక వర్గం :

ఇక ఈ సినిమా నిర్మాణ విలువలకు వస్తే గా ఓకే అనిపించే స్థాయిలో అనిపిస్తాయి. కెమెరా వర్క్ కానీ మ్యూజికల్ టీం వర్క్ కానీ డీసెంట్ గా ఉంటాయి. అయితే ఎడిటింగ్ ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేది కానీ డైలాగ్స్ బాగుంటాయి. ఇక దర్శకుడు ప్రణీత్ విషయానికి వస్తే సింపుల్ గా చెప్పాలి అంటే ఓ ఐదుగురు ఫ్రస్ట్రేటెడ్ అమ్మాయిలపై ఏదో డిజైన్ చేసి చూపిద్దాం అనుకున్నారు కానీ అది ఎక్కడా ఆకట్టుకునే విధంగా అనిపించదు. చాలా లోటుపాట్లు కనిపిస్తాయి. ఇంకా బెటర్ ఎఫర్ట్స్ తాను స్క్రిప్ట్ అండ్ నరేషన్ పై పెడితే బాగుండేది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే “సీత ఆన్ ది రోడ్” అనే అంథాలజి టైప్ సినిమా నటీనటుల పెర్ఫామెన్స్ లు వారిపై అనుకున్న పాయింట్ బాగానే ఉన్నా సరైన మేకింగ్ లేకపోవడంతో ఈ చిత్రం ఓవరాల్ గా ఎక్కడా ఆకట్టుకోదు. సరైన ఎమోషన్స్ కానీ నరేషన్ కానీ లేకపోవడం వంటివి ఈ సినిమాను చూసేందుకు అంతగా ఆసక్తి తెప్పించవు. బెటర్ ఈ సినిమాకు దూరంగానే ఉంటే మంచిది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు