సమీక్ష : “స్కంద” – బోయపాటి మార్క్ రెగ్యులర్ మాస్ డ్రామా

Skanda Review In Telugu

విడుదల తేదీ :సెప్టెంబర్ 28, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, ప్రిన్స్ సిసిల్, గౌతమి, ఇంద్రజ, రాజా, శ్రీకాంత్, శరత్ లోహితాశ్వ, పృథ్వీరాజ్ మరియు ఇతరులు

దర్శకుడు : బోయపాటి శ్రీను

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి

సంగీతం: ఎస్ థమన్

సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే

ఎడిటర్: బిక్కిన తమ్మిరాజు

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా అలాగే హీరోయిన్స్ లో కూడా ఎనర్జీకి నిర్వచనంలా మారిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అవైటెడ్ మాస్ డ్రామా “స్కంద”. మరి మంచి హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇండియా నుంచి ఓ దిగ్గజ బిజినెస్ మెన్ అలాగే ఎందరికో తన కంపెనీల ద్వారా లైఫ్ ఇచ్చిన రుద్రగంటి రామకృష్ణ రాజు(శ్రీకాంత్) పై ఏపీ ముఖ్యమంత్రి(అజయ్ పుర్కర్) అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి(శరత్ లోహితస్వ) కొన్ని దారుణమైన అభియోగాలు వేసి అతన్ని జైలు పాలు చేస్తారు. అయితే ఈ క్రమంలో ఇద్దరి సీఎం లకి కూడా మధ్యలో చెడుతుంది. దీనితో వీరి ఇద్దరి వైరం లోకి భాస్కర రాజు(రామ్ పోతినేని) ఎంటర్ అవుతాడు. మరి ఈ భాస్కర రాజు ఎవరు? వీళ్ళందరికీ భాస్కర్ కి ఏదన్నా కనెక్షన్ ఉందా ఉంటే అది ఏంటి? ఇంతకీ రామ్ డ్యూయల్ షేడ్స్ ఇద్దరా లేక ఒక్కరా అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది డ్యూయల్ షేడ్స్ లో కనిపించే రామ్ నటన కోసం చెప్పాలి. రెండు షేడ్స్ లో కూడా రామ్ తనదైన మాస్ ని చూపించాడు. బోయపాటి డిజైన్ చేసిన మ్యాచో పర్సనాలిటీ లో రామ్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యి యాక్షన్ సీక్వెన్స్ లలో అదరగొట్టేసాడు. అలాగే పలు ఎలివేషన్లు, మాస్ యాక్షన్ సీక్వెన్స్ లు అయితే మాస్ ఆడియెన్స్ కి ఓ రేంజ్ లో హై ఇస్తాయి.

అలానే బోయ మార్క్ డైలాగ్స్ ని కూడా అలవోకగా రామ్ పలికించాడు. అంతేకాకుండా టైటిల్ కార్డ్ నుంచే బోయపాటి తన మాస్ చూపించి సాలిడ్ స్టార్ట్ ఇచ్చారు. ఇక బోయపాటి రాసుకున్న హీరో క్యారెక్టరైజేషన్ కూడా సినిమాలో ఓ హైలైట్ అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ శ్రీ లీల కూడా తన బ్యూటిఫుల్ లుక్స్ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ఇంకా రామ్ తో కూడా తన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది.

ఇక మిగతా ముఖ్య పాత్రల్లో నటించిన శ్రీకాంత్, ఇంద్రజ, ప్రిన్స్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు. ఇంకా యంగ్ నటి సాయి మంజ్రేకర్ కూడా ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ఇక వీటితో పాటుగా సినిమాలో బోయపాటి డిజైన్ చేసుకున్న యాక్షన్ సీక్వెన్స్ లు తన మార్క్ ట్విస్ట్ లు ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

మొట్టమొదటి గా బోయపాటి అన్ని సినిమాల్లో లానే ఈ చిత్రం కూడా చాలా రెగ్యులర్ గానే సాగుతుంది. సినిమా స్టార్ట్ సాలిడ్ గా మొదలైనా నెక్స్ట్ మాత్రం కాస్త నెమ్మదిస్తుంది. దీనితో సినిమాలో ఫస్టాఫ్ చాలా పెద్దగా అనిపిస్తుంది.

ఇక మరో పాయింట్ లాజిక్స్ కూడా ఆశించకుండా సినిమా చూస్తే బెటర్ అలానే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు బాగా ఓవర్ గా కూడా అనిపిస్తాయి. ఇంకా మరో డిజప్పాయింట్ చేసే అంశం సినిమాలో పాటలు గాని వాటి ప్లేస్ మెంట్ మూలన సినిమా మరింత ల్యాగ్ అనిపిస్తుంది.

వీటితో పాటుగా సినిమాలో శ్రీలీల పాత్రకి ఇంపార్టెన్స్ కూడా అంత ఎక్కువ కనిపించదు. ఇంకా కొన్ని సీక్వెన్స్ లు చూస్తే బోయపాటి గత కొన్ని సినిమాలు కూడా గుర్తు రాక మానవు.

 

సాంకేతిక వర్గం :

ఈ చిత్రం లో నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే టెక్నీకల్ టీం లో థమన్ అందించిన స్కోర్ బాగుంది. కానీ పాటలు మాత్రం అంత అప్ టు మార్క్ అనిపించవు. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. మెయిన్ గా సాంగ్స్ విషయంలో ఏమన్నా డెసిషన్ తీసుకోవాల్సింది.

ఇక దర్శకుడు బోయపాటి శ్రీను విషయానికి వస్తే.. తాను అఖండ తర్వాత ఎలాంటి సబ్జెక్ట్ ని తీసుకుంటాడా అని చూసే సమయంలో స్కంద అనే డీసెంట్ సబ్జెక్టు పట్టుకున్నారు. అయితే హీరో పాత్రని బోయపాటి ఓ రేంజ్ లో ఆవిష్కరించారని చెప్పడంలో సందేహం లేదు. అలాగే డీసెంట్ ఎమోషన్స్ డైలాగ్స్ కూడా ఆయన ప్రెజెంట్ చేశారు. అయితే బోయపాటి సినిమా అంటేనే మాస్ ఆడియెన్స్ కోసం స్టోరీలు, లాజిక్ లు పక్కన పెట్టేయాలి అన్నట్లు అయ్యింది. మరి స్కంద కూడా ఇదే కోవకి చెందుతుంది.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “స్కంద” ఓ రెగ్యులర్ బోయపాటి మార్క్ సాలిడ్ మాస్ డ్రామా అని చెప్పొచ్చు. డెఫినెట్ గా రామ్ అయితే బోయపాటి వెర్షన్ లో అదిరిపోయాడు. తన క్యారెక్టరైజేషన్ గాని అందులో రామ్ వేరియేషన్స్ మ్యానరిజంలు ఇంప్రెసివ్ గా ఉన్నాయి. అలాగే మాస్ యాక్షన్ సీక్వెన్స్ లు , ఎలివేషన్లు మాస్ ఆడియెన్స్ కి నచ్చుతాయి. కానీ సినిమా మాత్రం అక్కడక్కడా కొంచెం సాగదీతగా అనిపిస్తుంది. మరి ఇది బోయపాటి రెగ్యులర్ మాస్ సినిమాలు ఇష్టపడేవారు, అలాగే మాస్ ఆడియెన్స్ కి ఈ వారాంతంలో ఆకట్టుకుంటుంది. ఇక మిగతా వారికి ఒక్కసారికి ఓకే అనిపిస్తుంది.

 

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version