సమీక్ష : శ్రీ రామ రాజ్యం – రామాయణం : ఎక్కువ, తక్కువ కాదు

సమీక్ష : శ్రీ రామ రాజ్యం – రామాయణం : ఎక్కువ, తక్కువ కాదు

Published on Nov 17, 2011 10:30 PM IST
  విడుదల తేది : 17 నవంబర్  2011
దర్శకుడు : బాపు
నిర్మాత : యలమంచాలి సాయి బాబు
సంగిత డైరెక్టర్ : ఇళయరాజా
తారాగణం : బాలకృష్ణ , నయనతార , శ్రీకాంత్ , సాయి కుమార్ , అక్కినేని నాగేశ్వర రావు , జయ సుధా , మురళి మోహన్ , కే . ఆర్ . విజయ , బ్రహ్మానందం .

రామాయణ ఇతివ్రుత్తాంతంతో సినిమాలు తెరకెక్కించటం లో సుప్రసిద్ధ దర్శకుడు బాపు దిట్ట. ఇంతకు ముందు బాపు సినిమాలైన సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, ఇంకా శ్రీ రామాంజనేయ యుద్ధం ఇదే కోవకు చెందినవి. బాపు తనకు ఇష్టమైన రామాయణ నేపధ్యం తోనే ‘శ్రీ రామ రాజ్యం’ సినిమా తీయటం అబ్బుర పరిచే విషయం కాదు. ఇక అనుభవజ్ఞులైన అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణ. లతోపాటు శ్రీకాంత్ నయనతార లను సమన్వయ పరుస్తూ ఈ చిత్రాన్నితెరకెక్కించారు బాపు. ఈ సినిమా ఆశించిన దాని కంటే ఎక్కువ కాదు తక్కువా లేదు అన్న విధంగా పండింది.

చిత్రం గురించి : ‘శ్రీరామ రాజ్యం’ చిత్రం రామ బృందం లంక నుంచి అయోధ్యకు వచ్చిన సందర్భం నుంచి మొదలవుతుంది. సీతా రాములు, లక్ష్మణ, హనుమాన్ లతో శ్రీ రాముడు అయోధ్యకు చేరుకుంటాడు. అయోధ్యలో శ్రీరాముని కుటుంభం సుఖసంతోషాలతో ఉంటుంది. అదేసమయంలో అయోధ్య ప్రజలు రాముని పాలనలో సమానత్వం, సౌబ్రత్రుత్వాలతో నివసిస్తూ సుఖ సౌఖ్యాలు పొందుతారు . అంతా బాగున్న సమయంలో ఆ రాజ్య ప్రజల శంక కు అనుగుణంగా శ్రీరాముని లో ఓ మీమాంస
రేగుతుంది. అది సీతాదేవికి అగ్నిపరీక్ష(పవిత్రత పరీక్ష) కు సంబంధించి.

రావణుడి చరలో చిక్కి సుమారు సంవత్సరకాలంగా ఉన్న సీతాదేవి కి ఈ పరీక్ష నిర్వహించి అపోహలు తొలగించాలని తలపోస్తాడు శ్రీరాముడు. ఇలా చేసి తన ప్రజల మొనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని శ్రీరాముడు భావిస్తాడు. అందులో భాగంగానే శ్రీరాముడు తన భార్య సీతాదేవిని అడవిలోని వాల్మీకి ఆవాసాల వద్ద వదిలి రమ్మని ఆదేశిస్తాడు. ఈ రాముని నిర్ణయంతో కథ రక్తి కడుతుంది. తదనంతర పరిణామాలు ఏమిటన్నది శ్రీ రామ రాజ్యం చిత్రం లో చూడాలి.

ఇవి బాగున్నాయి : ఈ సినిమా కథ పై దాదాపు అందరికీ ఓ అవగాహన ఉంటుంది. ఈ పరిసితుల్లో చిత్రాన్ని ఎలా రక్తి కట్టించాలన్న్నది అటు నటీనటులకూ, చిత్ర దర్సకునికీ ఓ సవాలు వంటిదీ. ఇప్పుడున్న సినిమా హీరోల్లో పౌరాణిక పాత్రలు పోషించటంలో బాలకృష్ణ ది ప్రత్యెక స్థానం. వీటిలో ఆయనకు మంచి అనుభవం ఉంది కూడా. సీతాదేవి ఎడబాటు సందర్భంలో బాలయ్య నటనలో అది ప్రస్పుటమవుతుంది. సీత దేవి గా నాయన తార మంచిగా చేసారు. ఎంతో అనుకువగానూ, అందంగానూ, విషాద సమయంలోనూ ఇలా క్లిష్టమైన సందర్భాలలో ఆమె మెప్పించారు. ఇక వాల్మీకి పాత్రకు అక్కినేని నాగేశ్వరరావు చక్కగా సరిపోయారు. అతని నటన అద్భుతంగా ఉంది. అంతేకాదు అతని పాత్ర చాలా శాంతంగా ఆహ్లాద భరితం గా సాగింది. ఇక లక్ష్మణుడి గా శ్రీకాంత్ తెరపై కనిపించింది చాల తక్కువే అయినప్పటికీ, అటు విధేయత కలిగిన పాత్రనూ అలాగే, కొంత అసహనం తో కూడిన నటననూ శ్రీ కాంత్ బాగా పోషించారు. ఇక ముఖ్య మైన లవ, కుశ పాత్రలను చిన్నారులు నయనానంద భరితంగా పోషించారు. ప్రధానంగా బాలరాజు
చక్కటి ప్రతిభ కనపరిచాడు. రోజా చిన్నపాటి కీలకమైన పాత్రలో మెప్పించారు.

శ్రీ రామ రాజ్యం చిత్రాన్ని అందంగా తెరకెక్కించటానికే కాదు, బ్రహ్మానందం, కెఆర్ విజయ, బాలయ్య, ఎవిఎస్ తదితర నటులను వారి వారి పాత్రల్లో చక్కగా రానిచేలా చేసేందుకు దర్శకుడు చాలా శ్రమించినట్టు అవగతమవుతుంది.

ఇవి బాగులేవు : ‘శ్రీ రామ రాజ్యం’ అన్న టైటిల్ బట్టి సాధారణంగా అంతా శ్రీరాముడు తన రాజ్యాన్ని ఎలా పాలించాడు అనేదానిగురించి సినిమా నడుస్తుందని భావిస్తారు. అయితే సినిమా మొదటి భాగంలో మాత్రమే ఈ పాలన అంశాలు కనబడతాయి. రెండవ భాగం లో బాపు రామాయణంలోని (ఉత్తరాకాండ) లవ కుశ కథాంసాన్ని చొప్పించారు. శ్రీరాముని పాలనలో తలెత్తిన సమస్యలనూ చూపించారు. పాత చిత్రం ‘లవ కుశ’ సినిమా, హిందీ సీరియల్ రామాయణ్ చూసిన వారికి ఈ సినిమా అంత కొత్త గా
అనిపించదు. అయితే మొత్తం లవ కుశ ఎపిసోడ్ అంతా చాల బాగా అంకితభావం తో తీసినట్టు తేటతెల్లమవుతుంది.

సాంకేతిక విభాగాలు: ఈ చిత్ర మంచి చెడులకు పూర్తి బాధ్యత దర్శకుడు బాపుదే. బాలకృష్ణ, నయనతార ప్రతి భంగిమలో, ప్రతి కదలికలో ప్రసిద్ద బాపు మార్క్ కనిపిస్తుంది. అంతే కాదు బాపుకు అత్యంత ఆప్తుడు, సమకాలీకుడైన స్వర్గీయ ముళ్ళపూడి రమణ గారి ప్రభావం ఈ చిత్ర స్క్రీన్ ప్లే లో కనిపిస్తుంది. హనుమాన్ పాత్ర
చిత్రీకరణలోనూ బాపు-రమణ ల ప్రతిభ కనిపిస్తుంది. ముందుగా చెప్పినట్టే అందరికీ తెలిసిన ఈ కథ చిత్రీకరణ కొత్తగా చేయటం కష్ట సద్యమైనప్పటికీ బాపు-రమణ మంచి అవుట్ పుట్ ఇవ్వగాలిగారనే చెప్పాలి.

బాపు ఊహలకు తగ్గట్టుగా రవీంద్ర ఆర్ట్ వర్క్ మంచిగా తీర్చి దిద్దారు. అద్బుతమైన సెట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విజువల్ ఎఫ్ఫెక్ట్స్ పనితనం కూడా అబ్బుర పరిచే విధంగా ఉంది. ప్రత్యేకించి భూదేవి ఎపిసోడ్లో విఎఫ్ఎక్ష్ గ్రాఫిక్స్ అద్భుతంగా కనిపించాయి. పిఆర్ కె రాజు కెమెరా పనితనం చూడ చక్కగా ఉంది. అటు ఎడిటింగ్ కూడా బాగా
సాగింది. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆస్తి అని చెప్పొచ్చు. ఆయన అందించిన స్వరాలు , వీక్షకుల హృదయాన్ని తాకేవిధంగా ఉన్నాయి.

ఫైనల్ పాయింట్: శ్రీ రామ రాజ్యం చిత్రం ఫైనల్ పార్ట్ ప్రధానంగా విషాదభరితం అందువల్లే హాస్యం పాళ్ళు అంతగా కనిపించలేదు. మొత్తమ్మీద ఈ కథ తెలిసిన వారు, తెలియని వారు కూడా, ప్రతి ఒక్కరు చూడదగిన సినిమా ఇది. ఒక వేళ ఈ సినిమా మీలో కొత్త కొత్త ప్రశ్నలు లేవనెత్తితే మధన పడిపోకండి ..ఎందుకంటే ప్రశ్నలు ఎప్పుడూ మంచిదే కదా..

దయచేసి గమనించండి: చిత్ర సమీక్షకునిగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే, శ్రీ రామ రాజ్యం సినిమా సాదా సీదా చిత్రం కాదు. ఒక మంచి భక్తీ రస కావ్యం. ఈ సినిమాలో వాణిజ్య అంశాలకు తావులేదు. అందుకనే రేటింగ్ ఇవ్వటం సబబు కాదనేది నా అభిప్రాయం.

– నారాయణ – ఎవి

Check Out Sri Rama Rajyam English Version Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు