సమీక్ష : శ్రీదేవి శోభన్ బాబు – డల్ గా సాగే సిల్లీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్!

సమీక్ష : శ్రీదేవి శోభన్ బాబు – డల్ గా సాగే సిల్లీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్!

Published on Feb 19, 2023 3:02 AM IST
Vinaro Bhagyamu Vishnu Katha Movie-Review-In-Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 18, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: సంతోష్ శోభ‌న్‌, గౌరి జి కిష‌న్‌, నాగ‌బాబు, రోహిణి త‌దిత‌రులు

దర్శకుడు : ప్ర‌శాంత్ కుమార్ దిమ్మల‌

నిర్మాతలు: సుష్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్‌

సంగీత దర్శకులు: క‌మ్రాన్‌

సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామ‌స్వామి

ఎడిటర్: శ‌శిధ‌ర్ రెడ్డి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన సినిమా ‘శ్రీదేవి శోభన్ బాబు’. ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో గౌరీ కిషన్ కథానాయికగా నటించింది. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

శోభన్ బాబు (సంతోష్ శోభ‌న్‌) శ్రీదేవి (గౌరి జి కిష‌న్‌) బావ మరదళ్లు. అయితే, వీరిద్దరూ చిన్నతనంలో వీరి కుటుంబాల్లో జరిగిన కొన్ని సంఘటనలు కారణంగా.. ఇద్దరు కుటుంబాలు వీడిపోతాయి. అయితే, ఓ ఇల్లు మాత్రం ఉమ్మడి ఆస్తిగా ఉంటుంది. ఆ ఇల్లు కోసం శోభన్ బాబు ఏం చేశాడు ?, తన తండ్రికి అన్యాయం చేసిన శోభన్ బాబు కుటుంబం పై శ్రీదేవి ఎలా రివేంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేసింది ?, అసలు గతంలో ఏం జరిగింది ?, ఆ గతం విని శ్రీదేవి ఎలా మారింది ?, చివరకు శ్రీదేవి – శోభన్ బాబు ఒక్కటి అయ్యారా? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సంతోష్ శోభ‌న్‌ చాలా బాగా నటించాడు. తన పాత్రకు తగ్గట్లు.. కామెడీ సన్నివేశాల్లో బాగా ఆకట్టుకున్నాడు. తన క్యారెక్టరైజేషన్ తో, తన టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన గౌరి జి కిష‌న్‌ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ మెప్పించింది.

హీరోకి తల్లిగా నటించిన రోహిణి కూడా తన నటనతో ఆకట్టుకుంది. హీరోయిన్ ఫాదర్ గా నటించిన నాగబాబు కూడా బాగానే నటించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సినిమాలో క్లైమాక్స్ బాగానే ఉంది. కొన్ని సెంటిమెంట్ సీన్స్ పర్వాలేదు.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా.. పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యూలర్ గా సాగడం ఈ సినిమాకి బాగా మైనస్ అయ్యింది. అదేవిదంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే చాలా స్లోగా సింపుల్ గా సాగింది. పైగా ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ బాగా బోర్ కొడతాయి.

ప్ర‌శాంత్ కుమార్ దిమ్మల‌ బిల్డప్ ఎలివేషన్స్ పై ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తాడో అర్థం కాదు. ఓవర్ యాక్షన్ పక్కన పెట్టి, కంటెంట్ పై ఫోకస్ పెడితే బెటర్. దర్శకుడు ప్ర‌శాంత్ కుమార్ దిమ్మల‌ ఆసక్తికరమైన డ్రామాను జనరేట్ చేయడంలో విఫలమయ్యాడు. సెకండ్ హాఫ్‌లో చాలా సన్నివేశాలు మరీ సిల్లీగా నడిచాయి.

అయినా అబద్ధపు సిల్లీ ఫ్యామిలీ డ్రామాకు అంత పెద్ద ప్లాష్ బ్యాక్ ఏమిటో డైరెక్టర్ కే తెలియాలి. పైగా మెయిన్ క్యారెక్టరైజేషన్స్ క్లైమాక్స్ లో ఇంట్రెస్ట్ గా అనిపించినప్పటికీ.. సినిమా మొత్తం వచ్చే సరికి ఆ క్యారెక్టరైజేషన్స్ కి క్లారిటీ మిస్ అయి ఆకట్టుకోవు. అలాగే సినిమాలో కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువవడంతో కథలో పూర్తిగా సహజత్వం లోపించింది.

 

సాంకేతిక విభాగం :

 

ఈ చిత్ర దర్శకుడు ప్ర‌శాంత్ కుమార్ దిమ్మల‌ తన దర్శకత్వ పనితనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిల్ అయ్యాడు. స్క్రిప్ట్ పై ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు, కానీ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకు ప్లస్ అయ్యేది. నిర్మాతలు సుష్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్‌ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

 

‘శ్రీదేవి శోభన్ బాబు’ అంటూ వచ్చిన ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో కొన్ని కామెడీ పంచ్ లు అండ్ ఫ్యూ లవ్ సీన్స్ పర్వాలేదు. కానీ, సింపుల్ స్టోరీ, స్లో నేరేషన్ అండ్ బోరింగ్ ట్రీట్మెంట్ అలాగే ఆసక్తికరంగా సాగని స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకు మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు