సమీక్ష : ‘శ్రీదేవి సోడా సెంటర్’ – ఆకట్టుకునే ఎమోషనల్ ప్రేమ కథ

సమీక్ష : ‘శ్రీదేవి సోడా సెంటర్’ – ఆకట్టుకునే ఎమోషనల్ ప్రేమ కథ

Published on Aug 28, 2021 3:04 AM IST
Sridevi Soda Center movie review

విడుదల తేదీ : ఆగస్టు 27, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: సుధీర్ బాబు, ఆనంది , ప‌వెల్ న‌వ‌గీత‌మ్‌,న‌రేష్‌, ర‌ఘుబాబు, అజ‌య్‌, స‌త్యం రాజేష్, హ‌ర్హ వ‌ర్ద‌న్‌, స‌ప్త‌గిరి, క‌ళ్యణి రాజు, రొహిణి, స్నేహ గుప్త త‌దిత‌రులు

దర్శకుడు: కరుణ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
సంగీత దర్శకుడు: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుద్దీన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

 

లాక్ డౌన్ 2.0 తర్వాత మంచి అంచనాలతో అందులోని అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా ఈరోజు రిలీజ్ కి వచ్చిన సినిమా “శ్రీదేవి సోడా సెంటర్”. సుధీర్ బాబు హీరోగా నటి ఆనంది హీరోయిన్ గా నాచురల్ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి ప్రమోషన్స్ నడుమ రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ అంచనాలు ఎంత మేర అందుకుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఇక ఈ చిత్ర కథలోకి వస్తే అమలాపురానికి చెందిన సూరిబాబు(సుధీర్ బాబు) ఒక సాధారణ ఎలెక్ట్రిషియన్, అలాగే అదే ఊరికి చెందిన సోడాల శ్రీదేవి (కయల్ ఆనంది) ని ప్రేమిస్తాడు. మరి ఇద్దరూ ప్రేమలో పడ్డాక వీరికి ఊహించని మలుపులు ఎదురు అవుతాయి. వీరి ప్రేమకి శ్రీదేవి తండ్రి ఎందుకు అడ్డు చెబుతాడు? అలాగే గ్రామ స్థాయిలో వారి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి? వీటన్నిటినీ దాటి వీరి ప్రేమ సఫలం అవుతుందా లేదా అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ముఖ్యంగా ఈ సినిమాలో ఇంటెన్స్ ఎమోషన్స్ మరియు స్టోరీ ఎలా కనిపిస్తుందో అంతే సాలిడ్ గా నటీనటులు అద్భుత నటనను కనబరిచారు. ఎవరికి ఎవరూ కూడా తగ్గలేదని చెప్పొచ్చు. ముందుగా సుధీర్ అయితే తన పెర్ఫామెన్స్ తో తన కెరీర్ లో ఇంకో మెట్టు ఎక్కడానికి చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది వరకు మనం చూసిన సుధీర్ బాబు కాకుండా సరికొత్త సుధీర్ బాబు ఈ చిత్రంలో కనిపిస్తాడు.

సాధారణ సన్నివేశాల్లో కాకుండా తన నటనకు స్కోప్ ఉన్న ప్రతీ సీన్ ని కూడా సుధీర్ చాలా రియలిస్టిక్ ఎమోషన్స్ తో నటించాడు. ఇది వరకు తన నుంచి చూసిన కోణాలు పక్కన పెడితే తన నటన ఈ సినిమాలో మంచి ఎస్సెట్ అని చెప్పొచ్చు. అలాగే ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో కనిపించిన సీనియర్ నరేష్ తన సీనియార్టీ మరోసారి కనబరిచారని చెప్పాలి.

ఒక తండ్రిగా ఇది వరకు ఎన్నో చిత్రాల్లో కనిపించారు కానీ ఇది ఇంకాస్త ఇంపాక్ట్ ఎక్కువ కలిగించేదిలా ఉంటుంది. సాలిడ్ ఎమోషన్స్, నెగిటివ్ షేడ్స్ లో తన వెర్సిటైల్ నటనతో తన రోల్ కి కంప్లీట్ జస్టిస్ చేకూర్చారు. ఇంకా హీరోయిన్ ఆనంది జాంబీ రెడ్డి తోనే మంచి మార్కులు అందుకున్న ఈ యువ నటి ఈ చిత్రంలో మరింత సహజత్వంతో నటించింది.

అలాగే కొన్ని కీలక ఎమోషన్స్ ని కూడా చాలా బాగా చేసింది. వీరితో పాటుగా మెయిన్ విలన్ గా పరిచయం చేసిన నటుడు పవేల్ నవగీతన్ కూడా తన రోల్ లో మంచి ఇంటెన్స్ నటనను కనబర్చడం విశేషం. ఇంకా ఈ చిత్రంలో డైరెక్టర్ ప్రాజెక్ట్ చేసిన ఎమోషన్స్ మరియు కథలో సహజత్వంతో రాబట్టిన పెర్ఫామెన్స్ లు మరింత ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో అంతగా రుచించని భాగం ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ అని చెప్పాలి. ఇది కొంచెం నెమ్మదిగా ఓ ఫ్లో లో సాగదీతగా ఉన్నట్టు అనిపిస్తుంది. రొటీన్ యావరేజ్ గా సాగే సన్నివేశాలతో ఈ పార్ట్ ఉంటుంది. ఇంకా మెయిన్ లీడ్ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే సీన్స్ కూడా పెట్టి ఉంటే బాగుండేది.

అయితే ఇవి ఎందుకు వీక్ గా అనిపిస్తాయి అంటే వాటిని మించే సీన్స్ తర్వాత ఉంటాయి కనుక వీటి ఇంపాక్ట్ ప్రేక్షకులకి పెద్దగా అనిపించదు సో వాటిని మ్యాచ్ చేసేలా వీటిని కూడా తెరకెక్కించి ఉంటే బాగుండేది. అలాగే ఫస్ట్ హాఫ్ లో హీరో తండ్రిగా ప్రముఖ నటుడు రఘు బాబు కనిపిస్తారు అతని పాత్ర నామ మాత్రంగానే కనిపిస్తుంది. తర్వాత ఇంపార్టెన్స్ కూడా కనిపించదు.

సాంకేతిక వర్గం :

చిత్రంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి, అన్ని సన్నివేశాల్లో కూడా ఎక్కడా సహజత్వం మిస్ కాలేదు. అలాగే టెక్నీకల్ టీం వర్క్ బాగుంది. స్టార్ సంగీత్ దర్శకుడు మణిశర్మ ఇచ్చిన పాటలు ఆల్రెడీ హిట్ అవి విజువల్ గా కూడా బాగున్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నేపథ్యానికి తగ్గట్టుగా బాగుంది. అలాగే శామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ కూడా నీట్ గా మంచి ఎఫెక్టీవ్ గా ఉంది. కాకపోతే ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది.

ఇక దర్శకుడు కరుణ కుమార్ విషయానికి వస్తే కరుణ తన లాస్ట్ చిత్రం పలాస తోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. మరి ఈ చిత్రంతో తనలోని క్యాలిబర్ ఎంత ఉందో మరోసారి ప్రూవ్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఈసారి కూడా ఒక ఇంటెన్స్ పాయింట్ పట్టుకొని దానికి సాలిడ్ ఎమోషన్స్ ని రాబట్టి మంచి కమెర్షియల్ ఎలిమెంట్స్ తో అలరించడంలో సక్సీడ్ అయ్యారని చెప్పాలి. నటీనటుల నుంచి కొత్త కోణాల్లో నటనను రాబట్టి ఆకట్టుకుంటారు. కానీ మెయిన్ లీడ్ లవ్ స్టోరీని కనుక ఇంకా బలంగా ప్రెజెంట్ చేసి ఉంటే మరింత బెటర్ గా ఈ సినిమా అనిపించి ఉండొచ్చు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే ఈ “శ్రీదేవి సోడా సెంటర్” లో చాలా సహజ నేపథ్యం అంతే మంచి కథనంతో కనిపిస్తుంది. డెఫినెట్ గా సుధీర్ కెరీర్ లో ఈ చిత్రం ఒక బెస్ట్ పెర్ఫామర్ గా నిలబెడుతుంది. తాను మాత్రమే కాకుండా మిగతా మెయిన్ కాస్ట్ కూడా తమ బెస్ట్ ఈ చిత్రంలో ఇచ్చారు. ఇంటెన్స్ గా సాగే కథనం, అంతే అలరించే ఎమోషన్స్ ఆడియెన్స్ కి ఫ్రెష్ ఫీల్ అందిస్తాయి. ఒక్క ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను మినహాయిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ని ఈ వారాంతానికి అందిస్తుంది.

123telugu.com Rating :  3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు