సమీక్ష : SR క‌ళ్యాణమండంపం – కొన్ని ఎమోషన్స్ వరకు పర్వాలేదనిపిస్తుంది

SR Kalyanamandapam movie review

విడుదల తేదీ : ఆగస్టు 06, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్, సాయికుమార్ త‌దిత‌రులు

దర్శకుడు: శ్రీధ‌ర్ గాదే

నిర్మాతలు : ప్ర‌మోద్, రాజు
సంగీత దర్శకుడు : చేత‌న్ భ‌ర‌ద్వాజ్


మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తెరుచుకోవడంతో గత వారం నుంచి సినిమాలు వెండితెర మీదకు వస్తున్నాయి. మరి ఈ లిస్ట్ లో మంచి హైప్ తో ఈరోజు రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రం “ఎస్ ఆర్ కల్యాణమండపం”. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ కాంబోలో శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం వెండితెరపై ఆడియెన్స్ ని ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలో పరిశీలిద్దాం రండి.

కథ :

ఇక కథ లోకి వచ్చినట్టయితే కళ్యాణ్(కిరణ్ అబ్బవరం) కడపలోని ఓ చిన్న టౌన్ లో తన అమ్మ నాన్నలతో కలిసి జీవించే మామూలు మిడిల్ క్లాస్ యువకుడు. మరోపక్క హీరోయిన్ ప్రియాంకతో ప్రేమలో కూడా ఉంటాడు. కానీ తన తండ్రి(సాయి కుమార్) కి తనకి వచ్చిన ఒక చీలిక మూలాన దాదాపు పదేళ్ల పాటుగా సరిగ్గా మాట్లాడడు.. మరి వీరిద్దరి మధ్య వచ్చిన ఎమోషనల్ కాంఫ్లిక్ట్ కి కారణం ఏమిటి? మళ్ళీ వీరి మధ్య మాటలు కలుస్తాయా? వాటి వల్ల కళ్యాణ్ ఎదురుకున్న పరిణామాలు ఏమిటి అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెర పై వీక్షించాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

హీరోగా కిరణ్ తన మొదటి సినిమా ‘రాజావారు రాణిగారు’ తోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఈ సినిమాతో డెఫినెట్ గా మరింత మెరుగయ్యాడని చెప్పాలి. చాలా పరిపక్వత కలిగిన నటనను చాలా కీలక సన్నివేశాల్లో కనబరిచాడు. అలాగే పలు ఎమోషన్ మరియు యాక్షన్ సహా మాస్ సీక్వెన్స్ లలో మరింత సెటిల్డ్ పెర్ఫామెన్స్ కిరణ్ కనబరిచాడు. అలాగే ఫిమేల్ లీడ్ ప్రియాంకా కూడా సినిమాలో చాలా బ్యూటిఫుల్ గా క్యూట్ యాక్టింగ్ ని కనబరిచింది.

అంతే కాకుండా ఇద్దరు మెయిన్ లీడ్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. మరి వీరితో పాటుగా కీలక పాత్రలో కనిపించిన సాయి కుమార్ కోసం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సరైన భాద్యతలు లేకపోయినా మచ్చ లేని ఓ తండ్రిగా మంచి రోల్ మంచి నటనను కనబరిచి సినిమాకి మరో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తారు. అలాగే తనికెళ్ళ భరణి, శ్రీకాంత్ అయ్యంగర్ సహా ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు మంచి నటన కనబరిచారు.

ఇక వీరి విషయాలు పక్కన పెడితే ఈ చిత్రంలో కనిపించే కొన్ని కామెడీ ఎపిసోడ్స్, మెయిన్ లీడ్ ఇద్దరి మధ్య లవ్ స్టోరీ ఆల్రెడీ చార్ట్ బస్టర్ హిట్స్ అయినా సాంగ్స్ కానీ విజువల్ గా మంచి ట్రీట్ ఇస్తాయి. అలాగే సెకండాఫ్ లో కథ నడిపిన విధానం, ఎమోషన్స్ మరియు క్లైమాక్స్ జస్టిఫికేషన్ కూడా డీసెంట్ గా ఉన్నాయి..

మైనస్ పాయింట్స్ :

ఇక ఈ చిత్రంలో అంతగా రుచించని అంశాల విషయానికి వస్తే అవి కూడా ప్లస్ పాయింట్స్ కి సమానంగా దగ్గరదగ్గరగానే ఉంటాయి.. హీరో కిరణ్ ఇప్పుడిప్పుడే మంచి హీరోగా నటుడిగా కూడా ఎదుగుతున్నాడు దానికి తగ్గట్టుగా కొంత పరిధి వరకు తన ఇమేజ్ ని బిల్డప్ చేస్తూ తన సినిమా దర్శకులు కానీ మేకర్స్ కానీ తీసుకెళ్లాలి.. కానీ దానిని ఈ సినిమా నుంచే ఎక్కువగా హై తీసుకెళ్లడం ఓవర్ గా అనిపిస్తుంది.

తన కటౌట్ కి తగ్గట్టుగా కొన్ని మాస్ సీన్స్ బాగున్నాయి కానీ అవి ఎక్కువయ్యాయి ఇంత అవసరమా అన్న ఆలోచన ఆడియెన్స్ కి కలగొచ్చు.. అలాగే కథ కూడా ఈ చిత్రంలో కొత్తగా ఉండదు, పోనీ దానిని కొత్త ఎలెమెంట్స్ తో ఇంకా ఎంగేజింగ్ గా డీల్ చేసారా అంటే అది కూడా అంత ఇంపాక్ట్ కలిగించేలా ఉండదు.

అలాగే తండ్రి కొడుకులు మధ్య ఉండే బలమైన ఎమోషన్స్ ని ఇంకా బాగా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. అంతే కాకుండా హీరో హీరోయిన్స్ మధ్య కూడా ఇంకా మంచి ఎపిసోడ్స్ ని డిజైన్ చేసుకునే స్కోప్ ఉంది కానీ అవి కూడా ఇంకా బెటర్ గా తెరకెక్కించి ఉంటే బాగుండేది.. అలాగే కొన్ని అనవసర సన్నివేశాలను కూడా బాగా తగ్గించి ఉంటే బాగుండేది..

సాంకేతిక విభాగం :

ఈ చిత్రానికి టెక్నీకల్ టీం సపోర్ట్ చాలా బాగుందని చెప్పాలి. ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ మంచి ట్యూన్స్ తో కట్టిపడేసి ప్రూవ్ చేసుకున్నాడు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుంటే బాగున్ను. అలాగే విశ్వాస్ డానియెల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రం నేటివిటీకి తగ్గట్టుగా చాలా సహజంగా బాగుంది.. ముఖ్యంగా సాంగ్స్ లో మంచి విజువల్స్ ని తాను చూపించాడు. ఇంకా ఎడిటింగ్ పై బాగా దృష్టి పెట్టాల్సి ఉంది. అలాగే ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఇక దర్శకుడు శ్రీధర్ గాదె విషయానికి వస్తే.. ఓవరాల్ గా తన వర్క్ పర్వాలేదని చెప్పాలి. కొన్ని ఎలెమెంట్స్ వరకు బాగా డీల్ చేసినా మరికొన్ని అంశాల్లో లోటు పాట్లు సరిదిద్దుకోవాల్సి ఉంది. కొన్ని సన్నివేశాలను ఇంకా బెటర్ గా రాసుకొని ప్రెజెంట్ చేసి ఉంటే ఇంతకు మించిన బెటర్ అవుట్ పుట్ ని ఇచ్చి ఉండేవాడు. అలాగే ఫస్ట్ హాఫ్ లో కేవలం హీరో యాంగిల్ పై దృష్టి పెట్టకుండా ఫ్యామిలీ ఎపిసోడ్స్ పై పెట్టి ఉంటే ఆడియెన్స్ కి బెటర్ ఫీల్ వస్తుంది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’ లో మంచి రొటీన్ అయినా మంచి బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది. వాటికి అనుగుణంగా కిరణ్ అబ్బవరం సెటిల్డ్ పెర్ఫామెన్స్ ముఖ్యంగా సాయి కుమార్ కి తనకి మధ్య ఎపిసోడ్స్, సాంగ్స్ కామెడీ సహా ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. కానీ కొన్ని అనవసర సన్నివేశాలూ.. ఫస్ట్ హాఫ్ లో కాస్త లాగ్ ని పక్కన పెడితే ఈ వారాంతానికి ఈ చిత్రం డీసెంట్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది.

123telugu.com Rating : 2.75 /5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version