సమీక్ష : “స్టాండప్ రాహుల్” – అక్కడక్కడా పర్వాలేదనిపిస్తుంది కానీ

సమీక్ష : “స్టాండప్ రాహుల్” – అక్కడక్కడా పర్వాలేదనిపిస్తుంది కానీ

Published on Mar 19, 2022 3:07 AM IST
StandUpRahul Movie Review

విడుదల తేదీ : మార్చ్ 18, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, మురళీ శర్మ, ఇంద్రజ, వెన్నెల కిషోర్

దర్శకత్వం : శాంటో

నిర్మాతలు: నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి

సంగీత దర్శకుడు: స్వీకర్ అగస్తి

సినిమాటోగ్రఫీ: శ్రీరాజ్ రవీంద్రన్

ఎడిటర్ : రవితేజ గిరిజాల

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్ లు రాజ్ తరుణ్ మరియు వర్ష బొల్లమ్మ లు నటించిన చిత్రం “స్టాండప్ రాహుల్”. డీసెంట్ బజ్ తో ఈరోజు రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే.. రాహుల్(రాజ్ తరుణ్) తన తల్లి(ఇంద్రజ) ఆమె భర్త అయినటువంటి(మురళీ కృష్ణ) నుంచి వేరై సెపరేట్ గా తమ లైఫ్ ని లీడ్ చేస్తారు. అయితే వీరి జీవితంలో బలమైన సంఘటనలతో పెళ్లిల కాన్సెప్ట్ పట్ల ఉద్దేశం మార్చుకున్న రాహుల్ హైదరాబాద్ లో జాబ్ కోసం రాగా అక్కడ శ్రేయ(వర్ష బొల్లమ్మ) పరిచయం అవుతుంది. ఇక్కడ నుంచి వీరి పరిచయం ఎలా మారింది? రాహుల్ కి పెళ్లి పట్ల ఉద్దేశం ఏమన్నా మారుతుందా? రాహుల్ తన లైఫ్ లో పెట్టుకున్న స్టాండప్ కమెడియన్ గోల్ సాధించాడా లేదా అనేవి తెలియాలి అంటే వెండితెరపై ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఫస్ట్ ఈ సినిమలో రాజ్ తరుణ్ కోసం మాట్లాడినట్టయితే గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో తాను చాలా ఫ్రెష్ లుకింగ్ లో కనిపిస్తాడు. మంచి యంగ్ గా మరియు హ్యాండ్సమ్ గా కనిపించి ఆకట్టుకుంటాడు. అలాగే తనకి మడీ టైమింగ్ తన రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్టవ్వడమే కాకుండా తన మాడ్యులేషన్స్ కూడా బాగా పలికించాడు. అలాగే హీరోయిన్ వర్ష మంచి రోల్ లో కనిపించింది.

రాజ్ తరుణ్ కి రోల్ కి తగ్గట్టుగా సేమ్ ఏజ్ గ్రూప్ లో కనిపించి మంచి కెమిస్ట్రీ తో ఆకట్టుకుంటుంది. అలాగే తన పాత్రలోని ఇనోసెంట్ కోణాలను కూడా చక్కగా ప్రదర్శించి మంచి నటనని అయితే ఆమె కనబరిచింది. అలాగే మరో ప్రధాన పాత్రలు ఇంద్రజ మరియు మరియు మురళీ శర్మలు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు. అలాగే పలు చోట్ల కామెడీ మరియు ఎమోషన్స్ బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో ఫ్లా స్ మాత్రం కాస్త ఎక్కువే కనిపిస్తాయని చెప్పాలి. అక్కడక్కడా పర్వాలేదు కానీ ఓవరాల్ గా అయితే ఈ సినిమాలో సరైన ఎమోషన్స్ ఎక్కడా కనిపించవు. దర్శకుడు సినిమాలో ఎంచుకున్న లైన్ కి తగ్గట్టుగా ఎమోషన్స్ ని బాగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేసాడు కానీ అవి అంత టచ్ అయ్యే రీతిలో అనిపించవు, జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో ఉంటాయి.

అలాగే హీరో పాత్ర డెవలప్మెంట్ లో కూడా లోపాలు కనిపిస్తాయి. పెళ్లి పట్ల ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ పెట్టుకున్న రాహుల్ తర్వాత హీరోయిన్ తో తీసుకునే స్టెప్స్ లో లాజిక్ మిస్ అయ్యింది. అలాగే మెయిన్ లీడ్ లో చాలా వరకు రొమాన్స్ కూడా అప్ టు మార్క్ ఆకట్టుకోకుండా సోసో గానే ఉంటుంది. అలాగే రాహుల్ రోల్ కి సంబంధించి మరిన్ని సన్నివేశాలు బాగా రొటీన్ గానే కనిపిస్తాయి. దీనితో చాలా వరకు ఈ సినిమా డల్ గా కనిపిస్తుంది.

 

సాంకేతిక విభాగం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు అన్ని చోట్లా క్లీన్ గా కనిపిస్తాయి. అలాగే స్వీకర్ అగస్తి మరియు శ్రీరాజ్ రవీంద్రన్ లు అందించిన సంగీతం గాని సినిమాటోగ్రఫీ గాని సినిమాలో ఆకట్టుకుంటాయి. అలాగే ఎడిటింగ్ పర్వాలేదు. ఇంకా డైలాగ్స్ మరియు పాటల్లో లిరిక్స్ బాగున్నాయి. ఇక దర్శకుడు శాంటో విషయానికి వస్తే..

ఓవరాల్ గా తన వర్క్ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదని చెప్పాలి. ఒక రొటీన్ లైన్ పట్టుకొని దానికి కొత్త ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేసాడు కానీ సరైన ఎమోషన్స్ ని మాత్రం తాను పండించలేకపోయాడు. బెటర్ ఎమోషన్స్ మరియు కామెడీ జెనరేట్ చెయ్యడానికి స్కోప్ ఉన్నా నరేషన్ ని ఎందుకో డల్ గా నడిపించాడు. దీనితో తన వర్క్ మాత్రం నిరాశపరుస్తుందని చెప్పాలి. కానీ మెయిన్ లీడ్ ని మాత్రం బాగా చూపించడంలో సక్సీడ్ అయ్యాడు.

 

తీర్పు :

 

ఇక మొత్తం చూసినట్టు అయితే ఈ “స్టాండప్ రాహుల్” లో రాజ్ తరుణ్ తన లుక్స్ మరియు యాక్టింగ్ పరంగా ఆకట్టుంటాడు. అలాగే హీరోయిన్ కూడా బాగా చేసింది. కానీ సినిమాలో సరైన ఎమోషన్స్ మరియు డెప్త్ లేకపోవడం డల్ గా ఉండే నరేషన్ అంత ఇంపాక్ట్ ని ఈ సినిమాలో కలిగించలేకపోయాయి. దీనితో ఈ చిత్రం ఈ వారాంతానికి అయితే బిలో యావరేజ్ ట్రీట్ ఇస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు