ఓటిటి రివ్యూ : “స్టేట్ ఆఫ్ సీజ్-టెంపుల్ ఎటాక్” – హిందీ చిత్రం జీ5 లో ప్రసారం

ఓటిటి రివ్యూ : “స్టేట్ ఆఫ్ సీజ్-టెంపుల్ ఎటాక్” – హిందీ చిత్రం జీ5 లో ప్రసారం

Published on Jul 9, 2021 9:25 AM IST
The-Tomorrow-War Movie Review

విడుదల తేదీ : జూలై 09,2021
123telugu.com Rating : 2.75/5

నటీనటులు : అక్షయ్ ఖన్నా, వివేక్ దాహియా, గౌతం రోడె

దర్శకుడు : కెన్ ఘోష్

నిర్మాతలు : అభిమన్యు సింగ్

 

ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు వెబ్ సిరీస్‌లు మరియు డైరెక్ట్ డిజిటల్ సినిమాల రిలీజ్ రివ్యూల పరంపరలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం “స్టేట్ ఆఫ్ సీజ్-టెంపుల్ ఎటాక్”. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటించిన ఈ హిందీ చిత్రం జీ5 లో విడుదలయ్యింది. మరీ ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.
 

కథ:

2002లో గుజరాత్ గాంధీనగర్‌లోని ‘అక్షర్ధామ్’ ఆలయంపై కొందరు ఉగ్రవాదులు దాడులు జరుపుతారు. ఈ దాడిలో ఉగ్రవాదులు కొంత మంది ప్రజలను చంపేసి, అక్కడున్న మరికొందరిని బందీలుగా ఉంచుకుంటారు. ఈ క్రమంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) ఉగ్రవాదులను వేటాడి బందీలుగా ఉన్న వారిని విడిపిస్తారు. ఈ ఎన్ఎస్‌జీ బృందానికి మేజర్ (హనుత్ సింగ్) నాయకత్వం వహిస్తారు. అయితే హనుత్ సింగ్, మరియు అతని బృందం ప్రాణాలను పణంగా పెట్టి ఎలా ఉగ్రవాదులను మట్టుపెట్టిందన్న దానిని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిందే ఈ కథ.

 

ప్లస్ పాయింట్స్:

అక్షర్ ధామ్ ఆలయాన్ని చూపించడానికి ఎంచుకున్న ప్రదేశాలు చాలా బాగున్నాయి మరియు వాటిని చూసిన ప్రేక్షకులకు ఉద్రిక్త వాతావరణాన్ని కనిపించేలా ఉన్నాయి. ఈ సినిమా ప్రారంభించిన విధానం మరియు మొత్తం ఉగ్రవాద దాడిని అమలు చేసిన విధానం చాలా బాగుంది. సినిమా ఫస్టాఫ్ చాలా గ్రిప్పింగ్ మరియు మంచి ప్రభావాన్ని కలిగి ఉంది.

ఇక ఉగ్రవాదుల పాత్ర పోషించిన నటులందరూ తమ పాత్రల్లో చాలా బాగా నటించారు. అక్షయ్ ఖన్నా యాక్షన్‌లోకి తిరిగి వచ్చాడని అనిపించింది, ఎన్‌ఎస్‌జి కమాండోగా చాలా బాగా చేశాడు. అతని నటన మరియు యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఉగ్రవాదులతో ఎన్‌ఎస్‌జి వ్యవహరించే తీరును చాలా బాగా చూపించారు.

 

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రం యొక్క అతిపెద్ద లోపం ఏమిటంటే దాదాపు అన్ని సన్నివేశాలు ఊహించదగినవిగా ఉండడం. అలా ఉండడం కారణంగా తదుపరి ఏమి జరుగుతుందో అన్నది సినిమా చూసే వారికి ఖచ్చితంగా అర్ధమైపోతుంది. అయితే పాపులారిటీ ఉన్న స్టోరీ కానీ కథనం మాత్రం పెద్దగా అనిపించలేదు.

ఇక ఫస్ట్ హాఫ్ తర్వాత కథనం చాలా నెమ్మదిగా సాగడం మరియు ట్విస్టులు కూడా పెద్దగా కనిపించవు. ఇక ముగింపు కూడా చాలా రొటీన్‌గా అనిపించింది. అయితే సినిమాలో ఇతర సహాయక తారాగణం కూడా మందకొడిగా కనిపిస్తుంది. కాస్త తెలిసిన నటీ నటులను తీసుకుని ఉంటే మెరుగ్గా ఉండేదనిపించింది.

 

సాంకేతిక విభాగం:

ఈ సినిమాకు విజువల్స్ చక్కగా ఉండటంతో కెమెరావర్క్ బాగున్నట్టు అనిపించింది. యాక్షన్ భాగం మరియు డైలాగులు కూడా బాగున్నాయి. నిర్మాణ రూపకల్పన అగ్రస్థానంలో ఉంది. ఈ చిత్రం యొక్క బీజీఎం కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు కెన్ ఘోష్ వద్దకు వస్తే అతను ఒక ప్రసిద్ధ సంఘటనను ఎంచుకుని దాని చుట్టూ ఒక కథను మల్చడానికి ప్రయత్నించాడు. అతను ప్రారంభంలో కొన్ని సీన్లతో ఆకట్టుకున్నాడు కానీ ఎమోషన్ మరియు ఎండింగ్ విషయంలో ప్రేక్షకులకు కాస్త మిశ్రమ అనుభూతిని మిగిల్చాడేమో అనిపించింది.

 

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఒళ్ళు గగుర్పొడిచే ఘటన ఆధారంగా తెరకెక్కించిన “స్టేట్ ఆఫ్ సీజ్-టెంపుల్ అటాక్” రొటీన్ యాక్షన్ సన్నివేశాలను కలిగి ఉందనిపించింది. అయితే ఫస్ట్ హాఫ్ మంచి థ్రిల్స్‌తో ఒకే అనిపించినా, సెకండాఫ్, ఊహించదగ్గ సన్నివేశాలు సన్నివేశాలు ఎక్కువగా ఉండడం మరియు ముగింపు ఫాస్ట్‌గా ఉండడం మైనస్ అయ్యింది. ఏది ఏమైనప్పటికి వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది, మిగతా వారు కూడా ఈ వారాంతంలో ఓ సారి చూడవచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు