విడుదల తేదీ : జనవరి 26, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: సుధీర్ బాబు, శ్రీకాంత్ మేక, భరత్ నివాస్, మైమ్ గోపి, కబీర్ సింగ్, రవివర్మ
దర్శకుడు : మహేష్ సూరపనేని
నిర్మాతలు: వి ఆనంద ప్రసాద్
సంగీత దర్శకులు: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: అరుల్ విన్సెంట్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సంబంధిత లింక్స్: ట్రైలర్
సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ హంట్. యువ దర్శకుడు మహేష్ సూరపనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ ఆర్యన్ దేవ్ (భరత్) హత్యకి గురిఅవుతాడు. ఈ కేసును అసిస్టెంట్ పోలీస్ కమీషనర్
అర్జున్ ప్రసాద్ (సుధీర్ బాబు) అనే నిజాయితీ గల పోలీసు అధికారికి కేసు అప్పగిస్తారు. ఈ కేసులో కమీషనర్ మోహన్ (శ్రీకాంత్) అర్జున్ కి సపోర్ట్ గా నిలుస్తాడు. ఐతే, ఇన్వెస్టిగేషన్ సమయంలో అర్జున్ ప్రసాద్ కి యాక్సిడెంట్ జరిగి గతం మర్చిపోతాడు. గతంలో భరత్ – సుధీర్ బాబు – శ్రీకాంత్ మంచి స్నేహితులు. తమ స్నేహితుడిని చంపిన వాడ్ని పట్టుకోవడానకి సుధీర్ బాబు – శ్రీకాంత్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు ?, అసలు భరత్ ను చంపింది ఎవరు ?, తన జీవితంలో జరిగిన అన్ని విషయాలను మర్చిపోయిన సుధీర్ బాబు తన గురించి తాను తెలుసుకున్న నిజాలు ఏమిటి?, ఈ క్రమంలో సుధీర్ బాబు ఎలాంటి కఠిన నిజాలను ఎదురుకోవాల్సి వచ్చింది ?, చివరకు ఈ కథలో మెయిన్ హంతుకుడు ఎవరు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
సుధీర్ బాబు సీరియస్ పోలీస్ అధికారిగా తన నటనతో ఆకట్టుకున్నారు. సుధీర్ బాబు ఫిట్ నెస్ అండ్ మేనరిజమ్స్ బాగున్నాయి. క్రైమ్ అండ్ సీరియస్ సన్నివేశాల్లో సుధీర్ బాబు నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. కథ రీత్యా తన గురించి తాను నిజాలు తెలుసుకునే క్రమంలో సుధీర్ బాబు పడిన మానసిక వేదన, ఆ క్లిష్ట సన్నివేశాల్లో సుధీర్ బాబు పలికించిన హావభావాలు చాలా బాగున్నాయి.
మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ నటన కూడా బాగుంది. తమిళ నటుడు భరత్ పాత్రకు అంత పెద్దగా నిడివి లేకున్నప్పటికీ తన నటనతో భరత్ ఆకట్టుకున్నాడు. మైమ్ గోపి, కబీర్ సింగ్, రవివర్మ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమా నిర్మాణ విలువలు, బీజీఎమ్ చాలా బాగున్నాయి.
అలాగే ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. దర్శకుడు మహేష్ రాసుకున్న క్రైం డ్రామా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకి ప్లస్ అయ్యింది.
మైనస్ పాయింట్స్ :
ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా.. కొన్ని చోట్ల ప్లే సింపుల్ గా సాగుతుంది. సినిమాలో గుడ్ పాయింట్ అండ్ కంటెంట్ ఉన్నా.. మెయిన్ ప్లాట్ కూడా సింపుల్ గా ఉంది. అలాగే సుధీర్ బాబు ప్లాష్ బ్యాక్ ట్రాక్ ఇంకా బలంగా ఉండాల్సింది. అదేవిధంగా భరత్ పాత్రను చంపే మోటివ్ ను కూడా దర్శకుడు మహేష్ ఇంకా బలంగా రాసుకోవాల్సింది.
దీనికి తోడు సుధీర్ బాబు తాలూకు కొన్ని విచారణ సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా సాగాయి. మొత్తానికి హంట్ చిత్రం మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారు. కొన్ని సీన్స్ విషయంలో పర్వాలేదనిపించినా.. చాలా సీన్స్ లో తేలిపోయారు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు మహేష్ మంచి క్రైమ్ థ్రిల్లర్ కి సంబంధించి గుడ్ పాయింట్ ను తీసుకున్నా.. స్క్రీన్ ప్లే ను మాత్రం బలంగా రాసుకోలేకపోయారు. సుధీర్ బాబు ప్లాష్ బ్యాక్ ట్రాక్ ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ అరుల్ విన్సెంట్ చాలా నేచురల్ గా చూపించారు. జిబ్రాన్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
తీర్పు :
సుధీర్ బాబు హీరోగా వచ్చిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ తో పాటు మెయిన్ ట్విస్ట్ బాగుంది. అలాగే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. ఇక సుధీర్ బాబు నటన అండ్ లుక్స్ మరియు ఆటిట్యూడ్ బాగున్నాయి. అయితే, హీరో ప్లాష్ బ్యాక్ ట్రాక్, కొన్ని కీలక సన్నివేశాలు మరియు హీరో మోటివ్ ఇంకా బెటర్ గా రాసుకోవాల్సింది. మొత్తమ్మీద ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ లో కొన్ని అంశాలు బాగున్నాయి. కానీ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team