సమీక్ష : “సుడల్” ది వార్టెక్స్ – తెలుగు డబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో

Suzhal  Movie Review

విడుదల తేదీ : జూన్ 17, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: కతిర్, ఐశ్వర్య రాజేష్, రాధాకృష్ణన్ పార్తిబన్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్

దర్శకత్వం : బ్రహ్మ మరియు జి అనుచరణ్ మురుగైయన్

నిర్మాత: పుష్కర్ మరియు గాయత్రి

సంగీత దర్శకుడు: సామ్ సిఎస్

సినిమాటోగ్రఫీ: ముఖేశ్వరన్

ఎడిటర్: రిచర్డ్ కెవిన్

లేటెస్ట్ గా ప్రముఖ ఓటిటి యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చి హాట్ టాపిక్ గా మారిన క్రేజీ వెబ్ సిరీస్ “సుడల్”. తమిళ్ నుంచి తెలుగు సహా పలు భాషల్లో డబ్ అయ్యి ఏకకాలంలో రిలీజ్ అయ్యిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. షణ్ముగం(పార్తిబన్) ఎంతో కాలం నుంచి పని చేస్తున్న ఓ పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ అనుకోని విధంగా అగ్ని ప్రమాదానికి లోనవుతుంది. అయితే సరిగ్గా అదే రోజున షణ్ముగం చిన్న కూతురు నీలా కూడా కనిపించకుండా పోతుంది. అయితే ఈ రెండు కేసుల్ని సాల్వ్ చెయ్యడానికి గాను రెజీనా(శ్రీయ రెడ్డి) అలాగే చక్రి(కాథిర్) లను పోలీస్ డిపార్ట్మెంట్ నియమిస్తుంది. అయితే ఈ ప్రోగ్రెస్ లో ఈ పోలీసులు కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుంటారు. మరి వారు తెలుసుకున్న నిజాలు ఏంటి? నీలా మిస్సవడానికి కారణం ఏంటి? ఈ కేసులని వారు ఛేదించారా లేదా అనేది తెలియాలి అంటే ఈ సిరీస్ ని ప్రైమ్ వీడియోలో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సిరీస్ లో ఆడియెన్స్ ని బాగా ఇంప్రెస్ చేసే అంశం ఏదన్నా ఉంది ఉంటే పుష్కర్ మరియు గాయత్రిల గ్రిప్పింగ్ నరేషన్ అని చెప్పాలి. చాలా ఇంటెన్స్ కథనంతో వారు ఈ సిరీస్ ని తీర్చిదిద్దిన తీరు చూసే వీక్షకులకు మంచి థ్రిల్ ని కలిగిస్తుంది. అలాగే సిరీస్ లో కీలక ట్విస్టులు మరియు ప్రతి పాత్ర క్యారక్టరైజేషన్ లు మంచి ఇంపాక్ట్ కలిగించేలా కనిపిస్తాయి.

ఇంకా నటీ నటుల విషయానికి వస్తే పార్తిబన్ చాలా సెటిల్డ్ నటనను ఈ సిరీస్ లో కనబరిచారు. ఇది వరకు పలు చిత్రాల్లో తన నటన చూసాము. అలాగే ఈ సిరీస్ లో కూడా తన పర్సనీలిటీకి తగ్గట్టుగా డిజైన్ చేసిన ఈ రోల్ లో తాను ఒదిగిపోయారు. ఇంకా శ్రీయ రెడ్డి అయితే తన రోల్ ని పవర్ ఫుల్ గా డిజైన్ చేయడా దానికి తన సాలిడ్ పెర్ఫవుమెన్స్ తో రక్తి కట్టించింది.

అలాగే నటి ఐశ్వర్య రాజేష్ కథిర్ తదితరులు తమ న్యాయం చేకూర్చారు. అలాగే ఈ సిరీస్ లో మేకర్స్ చూపించిన కొన్ని సున్నిత అంశాలు బాగానే హ్యాండిల్ చేసినట్టుగా అనిపిస్తుంది. వీటితో పాటుగా స్క్రీన్ ప్లే డిజైన్ చేసిన విధానం ఇంప్రెసివ్ గా ఉంది.

 

మైనస్ పాయింట్స్ :

అయితే ఈ సిరీస్ లో బాగా నిరాశ పరిచే అంశం మాత్రం రొటీన్ స్టోరీ లైన్ అని చెప్పాలి. మంచి గ్రిప్పింగ్ గానే ఉన్నా ఓటిటి లో కూడా ఒకింత రొటీన్ లైన్ అనేది మాత్రం ఈ సిరీస్ కి మార్క్ గా ఉంటుంది.

అలాగే సిరీస్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారడానికి సమయం కూడా ఎక్కువ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. దీనితో సిరీస్ రన్ టైం ఎక్కువ కావడం ఎక్కువ ఎపిసోడ్స్ కి సాగదీసినట్టు అనిపిస్తుంది. 6 ఎపిసోడ్స్ కి అలా ఈ సిరీస్ సరిపోతుంది అని అనిపించక మానదు.

 

సాంకేతిక వర్గం :

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు మాత్రం సాలిడ్ గా ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా టెక్నికల్ టీం కి ఈ సిరీస్ లో స్పెషల్ అప్లాజ్ ఇవ్వాలి. ముఖేశ్వరన్ సినిమాటోగ్రఫీ వేరే లెవెల్లో అనిపిస్తుంది. అలాగే ఇందులో మరో మెయిన్ హైలైట్ సామ్ సి ఎస్ సంగీతం అని చెప్పాలి. ఈ సంగీత దర్శకుడు ఇప్పటికే చాలా చిత్రాలకి సాలిడ్ బి జి ఎమ్ ఇచ్చాడు.

అలాగే ఈ సిరీస్ కి కూడా మరింత ఇంప్రెసివ్ స్కోర్ ఇచ్చి మరో స్థాయిలో నిలబెట్టాడు. ఇంకా రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ మాత్రం మరింత బెటర్ గా కొన్ని ఎపిసోడ్స్ లో చెయ్యాల్సింది. ఇక డైరెక్టర్స్ బ్రమ్మ, అనుచరణ్ ల విషయానికి వస్తే ముందు చెప్పినట్టుగానే సాలిడ్ అవుట్ పుట్ ని వారు అందించారని చెప్పాలి. అక్కడక్కడా లాగ్స్ మినహా మంచి గ్రిప్పింగ్ నరేషన్ లతో ఆకట్టుకుంటారు. కథలో కొత్తదనం ఉండదు కానీ వీరి కథనం మాత్రం బాగుంది.

 

తీర్పు :

ఇక మొత్తం గా చూసినట్టు అయితే ఈ “సుడల్” సిరీస్ లో రొటీన్ స్టోరీ లైన్ నే కనిపించినా కథనం మాత్రం ఆడియెన్స్ అటెన్షన్ ని పట్టుకుంటుంది. ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్టులు బాగున్నాయి. ఇంకా నటీనటుల సాలిడ్ పెర్ఫామెన్స్ లు ఆకట్టుకున్నాయి. అయితే పలు చోట్ల మాత్రం కాస్త సాగదీత, అనవసర సన్నివేశాలు మినహాయిస్తే ఈ సిరీస్ ని తప్పకుండా చూడొచ్చు.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version