విడుదల తేదీ : మార్చి 11, 2021
123telugu.com Rating : 2.5/5
నటీనటులు : ఆర్య, సయేషా సైగల్, కరుణకరన్, సాక్షి అగర్వాల్, మసూమ్ శంకర్
దర్శకత్వం : శక్తి ఎస్.రాజన్
నిర్మాతలు : కె. ఇ. జ్ఞానవేల్ రాజా
సంగీతం : డి. ఇమ్మన్
సినిమాటోగ్రఫీ : ఎస్ యువ
ఎడిటింగ్ : టి. శివ నందీశ్వరన్
పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం “టెడ్డీ”. స్ట్రీమింగ్ యాప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాబడ్డ ఈ తమిళ్ డబ్ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వెళ్తే శ్రీ(సాయేషా) అనే ఓ అమ్మాయికి అనుకోకుండా ఓ పెద్ద ప్రమాదం జరుగుతుంది దీనితో అక్కడ నుంచి హాస్పిటల్ కి తరలించబడ్డ ఆమెకు అక్కడి వైద్య బృందం కొన్ని పవర్ ఫుల్ మెడిసిన్స్ ఇస్తారు దీనితో ఆమె కాస్తా కోమాలోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ఆమె ఆత్మ శరీరాన్ని విడిచి ఓ టెడ్డీ బేర్ బొమ్మలోకి ప్రవేశిస్తుంది. మరి అది ఉన్న ఇల్లు శివ(ఆర్య)ది. ఇక అక్కడ నుంచి ఏం జరిగింది? శివ ఆ బొమ్మలో ఉన్న శ్రీ ఆత్మ కోసం తెలుసుకుంటాడా? తెలుసుకుంటే ఏం చేస్తాడు? చివరికి ఆమె ఆత్మ ఏమవుతుంది అన్నది తెలియాలి అంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఈ సినిమాలో కనిపించే కథ కాస్త కొత్తగా అనిపిస్తుంది. అంతే కాకుండా హర్రర్ జానర్ అంటే ఒకటే భయం ముద్ర పడిన క్రమంలో ఇది కాస్త భిన్నంగా అనిపించడం ఒక గుడ్ పాయింట్ అని చెప్పాలి. అందుకే ఒకింత ఈ అంశం ఫ్రెష్ గా అనిపిస్తుంది.
మరి నిజ జీవితంలో భార్యా భర్తలు అయినటువంటి ఆర్య మరియు సాయేషా లు నుంచి ఓ సినిమా అంటే ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ కూడా మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా సాయేషా రోల్ ఆ టెడ్డీ లోనే కనిపిస్తుంది. అలా ఆర్యాకు సాయేషా ల నడుమ కాన్వర్జేషన్స్ బాగుంటాయి. అలాగే ఆర్య కూడా తన సీరియస్ రోల్ లో చక్కగా చేసాడు.
మైనస్ పాయింట్స్ :
బేసిక్ గా ఇలాంటి ఫ్రెష్ కథను ఎంచుకుని రాసుకున్నప్పుడు అంతే స్థాయిలో తెరకెక్కించాలి. కానీ ఈ చిత్రంలో అది బాగా మిస్సయ్యినట్టు అనిపిస్తుంది. అలాగే ఎమోషనల్ పాయింట్స్ కూడా అత్యంత కీలకం కానీ ఈ పార్ట్ కూడా ఈ చిత్రంలో అంత స్ట్రాంగ్ గా ఎలివేట్ అయ్యినట్టు అనిపించదు దీనితో ఇలాంటి సినిమాలో ఈ పాయింట్స్ మిస్సవ్వడం చాలా సిల్లీగా అనిపిస్తుంది.
అలాగే ఈ చిత్రంలో బాగా సిల్లీగా అనిపించే సీన్ ఒకటి ఉంటుంది. బ్రెయిన్ నుంచి కంప్యూటర్ లో ఓ డేట్ ను మార్చాలని పైగా ఆర్య చేతికి నరం కట్ చేసి విలన్స్ బెదిరిస్తారు ఇది బాగా ఓవర్ గా అనిపిస్తుంది. ఇలాంటి సీన్స్ వల్ల మంచి పాయింట్ పక్క దారి పట్టినట్టు అనిపిస్తాయి.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో టెక్నీకల్ టీం వర్క్ ఓకే అని చెప్పొచ్చు. కోలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ కంపోజర్ డి ఇమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే ఓ సాంగ్ డీసెంట్ గా అనిపిస్తాయి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా ఇంప్రెసిక్ గా ఉంటుంది. అలాగే మరో స్పెషల్ మెన్షన్ వారి సిజి టీం కి ఇవ్వాలి. సినిమా మొత్తంలో కీలకంగా కనిపించే టెడ్డీ బేర్ ను చాలా నాచురల్ గా చూపే ప్రయత్నం వారు చూపారు. కానీ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. వీటన్నటి పరంగా ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఇక దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ విషయానికి వస్తే.. తాను ఇప్పటి వరకు మన దక్షిణాది సినిమాలో రాని ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ తో వచ్చారు అది అభినందనీయం కానీ దానిని అనుకున్న స్థాయిలో ఆవిష్కరించలేకపోవడం బాధాకరం. ఆన్ స్క్రీన్ పరంగా చాలా లోటు పాట్లు తాను సరి చేసుకోవాల్సింది. ఇలాంటి కాన్సెప్ట్ అనుకున్నప్పుడు కాస్త రియాలిటీ అంశాలు కూడా జోడించాలి అవి చాలా ముఖ్యం. కానీ వాటిని ఎలాంటి లాజికల్ అంశాలు లేకుండా చూపించేసారు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టు అయితే ఈ “టెడ్డీ”చిత్రంలో కనిపించే పాయింట్ ఒకింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అలాగే నటీనటుల పెర్ఫామెన్స్ కూడా బాగుంటుంది. కానీ దర్శకుని పనితనం బాగా దెబ్బేసింది. మంచి కథను రాసుకున్నా దానిని ఆన్ స్క్రీన్ పై సరిగ్గా తెరకెక్కించలేకపోయారు. దీనితో అది మిస్ ఫైర్ అయ్యినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే జస్ట్ ఒక్కసారి చూడడానికి పర్లేదు అని చెప్పొచ్చు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team