సమీక్ష : తీస్ మార్ ఖాన్ – కేవలం కొన్ని ట్విస్టుల కోసం మాత్రమే

సమీక్ష : తీస్ మార్ ఖాన్ – కేవలం కొన్ని ట్విస్టుల కోసం మాత్రమే

Published on Aug 20, 2022 3:04 AM IST
Tees Maar Khan Movie Review In Telugu

విడుదల తేదీ : ఆగస్టు 19, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్, సునీల్, పూర్ణ, ఠాకూర్ అనూప్ సింగ్

దర్శకత్వం : కళ్యాణ్ జి గోగన

నిర్మాతలు: నాగం తిరుపతి రెడ్డి

సంగీత దర్శకుడు: సాయి కార్తీక్

సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి

ఎడిటర్: మణికాంత్


సీనియర్ యాక్టర్ సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ యాక్షన్ కమర్షియల్ మూవీ తీస్ మార్ ఖాన్. కళ్యాణ్ జి గోగన దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించగా సునీల్, పూర్ణ, ఠాకూర్ అనూప్ సింగ్ ఇతర పాత్రలు చేసారు. నేడు మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క రివ్యూ ఇప్పుడు చూద్దాం.

కథ :

తీస్ మార్ ఖాన్ (ఆది సాయి కుమార్) మరియు పూర్ణ ఇద్దరూ కూడా తమ తల్లితండ్రుల వల్ల ఇబ్బందులు పడి చిన్నప్పుడే ఇంటి నుండి బయటకు వచ్చేస్తారు. అయితే ఒకానొక సందర్భంలో వీరిద్దరూ కలవడం, వారిలో పూర్ణ పెద్ద కావడంతో తీస్ మార్ ఖాన్ పట్ల ఆమె ఎంతో ప్రేమ, శ్రద్ధలు చూపిస్తుంది. దానితో ఆమెను తల్లిగా భావిస్తాడు తీస్ మార్ ఖాన్. అనంతరం కొన్నేళ్ల తరువాత ఆమె సునీల్ ని వివాహం చేసుకోవడం వారి ఫామిలీ జీవనం కొనసాగించడం జరుగుతుంది. అయితే మొదటినుండి ఎంతో సరదాగా లైఫ్ ని లీడ్ చేసే తీస్ మార్ ఖాన్, ఒకానొక సందర్భంలో జీజా (ఠాకూర్ అనూప్ సింగ్) తో గొడవ పెట్టుకుంటాడు. అనంతరం జీజా పూర్ణని చంపేయడం, దానితో అతడి పై ఎలాగైనా కసి తీర్చుకోవాలని తీస్ మార్ ఖాన్ ప్రయత్నాలు చేయడం, చివరికి అతడు జీజాని ఎలా మట్టుబెట్టాడు అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ఆఖరి 40 నిముషాలు ఎంతో ఎంగేజింగ్ గా పలు ట్విస్ట్ లతో సాగుతుంది. అతిహే అంతకముందు సినిమా సీన్స్ మొత్తం కూడా ఫక్తు రొటీన్ పద్దతిలో కొనసాగుతాయి. అయితే ఈ మూవీలో తీస్ మార్ ఖాన్ గా ఆది సాయికుమార్ సూపర్ గా పెర్ఫార్మ్ చేసారు. ఇందులో ఆయనది మూడు షేడ్స్ కలిగిన పాత్ర కావడం అలానే పలు యాక్షన్, ఎమోషజల్ సీన్స్ లో ఆయన ఎంతో ఆకట్టుకోవడం జరిగింది. కథలో ఆది, పూర్ణ ల మధ్య సాగె బాండింగ్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, పూర్ణ ఇలా ప్రతి ఒక్కరు కూడా మూవీలో ఎంతో బాగా యాక్ట్ చేసారు అనే చెప్పాలి. స్టోరీ లైన్ రొటీన్ గా ఉన్నప్పటికీ అక్కడక్కడా కొన్ని సీన్స్ అలరిస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా సదా సీదాగా పాత సినిమాలను మనకు రిమైండ్ చేస్తుంది. హీరో కొందరు విలన్స్ ని కొట్టగానే హీరోయిన్ ప్రేమలో పడిపోవడం, వారిద్దరి రొమాన్స్ సీన్స్ రొటీన్ గా ఉంటాయి. హీరోయిన్ పాయల్ పాత్ర కి పెద్దగా స్కోప్ ఉండదు, కేవలం సాంగ్స్, రొమాంటిక్ సీన్స్ కోసం మాత్రమే ఆమెని తీసుకున్నారా అనిపిస్తుంది. సినిమా యొక్క లాస్ట్ గంటసేపు ఆకట్టుకున్నప్పటికీ మధ్యలో స్టోరీ నారేషన్ సాగుతున్న సమయంలో సడన్ గా ఐటెం సాంగ్ రావడం కొంత అసహనంగా అనిపిస్తుంది. కమర్షియల్ మూవీస్ కి ఐటెం సాంగ్స్ అవసరమే కానీ అది స్టోరీ యొక్క ఫ్లో ని ఇబ్బంది పెట్టె విధంగా ఉండకూడదు. ఇక నెగటివ్ రోల్స్ చేసిన ఠాకూర్ అనూప్ సింగ్, కబీర్ సింగ్ ఇద్దరి పాత్రలు పెద్దగా ఆకట్టుకోవు, ఇక జీజా గా నటించిన ఠాకూర్ అనూప్ సింగ్ పాత్ర కూడా క్లియర్ గా చూపించలేదు. ముఖ్యంగా మేజర్ పాయింట్స్ పై దర్శకుడు సరిగ్గా శ్రద్ధ పెట్టలేదని చెప్పాలి.

 

సాంకేతిక విభాగం :

తీస్ మార్ ఖాన్ లో సాంగ్స్ పర్వాలేదనిపించినప్పటికీ మధ్యలో సాయి కార్తీక్ అందించిన బీజీఎమ్ బాగుంటుంది. అలానే బల్ రెడ్డి ఫోటోగ్రఫి కూడా పెద్దగా ఆకట్టుకోదు, ముఖ్యంగా కొన్ని సీన్స్ లో మరింతగా కెమెరా వర్క్ పై శ్రద్ధ పెట్టి ఉంటె బాగుండేది అనిపిస్తుంది. ఎడిటర్ మణికాంత్ పనితనం బాగుంది. దర్శకుడు కళ్యాణ్ జి మరింతగా స్క్రిప్ట్ పై ఫోకస్ చేసి ఉంటె బాగుండేది. అలానే సెకండ్ హాఫ్ లో ఒక గంట తరువాత నుండి మాత్రమే సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ కూడా బోరింగ్ గానే ఉంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా సినిమాలో కీలక పాత్రలకు సంబంధించి మరింత డెప్త్ గా దర్శకుడు సీన్స్ రాసుకుని ఉంటె బాగుండేది. రొటీన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి.

 

తీర్పు :

ఫైనల్ గా తీస్ మార్ ఖాన్ మూవీ ఒకసారి చూడవచ్చు అనే చెప్పాలి. చివరి నలభై నిమిషాలు ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, ట్విస్టులు ఈ సినిమాకి ప్రధాన బలం. ఫస్ట్ హాఫ్ సీన్స్, రొటీన్ రొమాంటిక్ ట్రాక్, సాంగ్స్, సాగదీసి సన్నివేశాలు, నార్మల్ టేకింగ్ వంటివి కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. అయినప్పటికీ కాస్త పర్వాలేదనిపించే ఎంటర్టైనర్ మూవీ చూడాలి అనుకునే వారికి తీస్ మార్ ఖాన్ బాగానే ఉంటుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు