సమీక్ష : ‘తలైవి’ – ఆకట్టుకునే ‘అమ్మ’ జీవిత చరిత్ర

Thalaivii Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 10, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: కంగనా రనౌత్, అరవింద్ స్వామి, నాజర్, భాగ్యశ్రీ, సముతిరఖని, మధు బాల
దర్శకుడు: విజయ్ ఎ ఎల్
నిర్మాత‌లు: విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్
సంగీత దర్శకుడు: జి వి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: విశాల్ విట్టల్
ఎడిటర్: ఆంటోనీ

ఇండియన్ సినిమా దగ్గర బయోపిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. కరెక్ట్ గా కనుక ప్రెజెంట్ చేస్తే ఆడియెన్స్ వాటిని భారీ హిట్ చేస్తారు. మరి ఈ క్రమంలో వచ్చిన మరో గ్రాండ్ బయోపిక్ సినిమా ‘తలైవి’. తమిళ ప్రేక్షక జనం ‘అమ్మ’ అని పిలుచుకునే జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పాన్ ఇండియన్ లెవెల్లో ఈరోజే రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎంతమేర ఆకట్టుకుందో సమీక్షలో పరిశీలిద్దాం రండి..

కథ :

తన తల్లి కోరిక, పట్టు మేరకు తన యుక్త వయసులోనే జయలలిత(కంగనా రనౌత్) సినిమాల్లోకి రావాల్సి వస్తుంది. మరి అలా వచ్చిన జయలలిత అప్పటికే స్టార్ అయిన ఎం జి ఆర్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుని ఆనతి కాలంలో స్టార్ స్టేటస్ తెచ్చుకుంటుంది. మరి వీరి పరిచయం ప్రేమగా సినీ జీవితం ఒక రేంజ్ లో కొనసాగుతున్న క్రమంలో పలు కారణాల చేత రాజకీయాల్లోకి రావాల్సి వస్తుంది. మరి ఈ తరుణంలో జయ లలిత ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? తనకి ఎదురైన పరాభవాలు, కదిలించే పరిస్థితులు ఏమిటి వాటికంటే ముఖ్యంగా రాజకీయాల్లో ఒక ప్రభావవంతమైన శక్తిగా ఆమె మారి ‘అమ్మ’ గా అవతరించడం ఎలా జరిగింది అనే అనేక ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెర మీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మొట్టమొదటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సినిమా క్యాస్టింగ్ అయితే మరొకటి వారు వారి పాత్రలకు తగ్గట్టుగా అద్భుతమైన నటనను కనబర్చడం అని చెప్పాలి. కంగనా పోషించిన పాత్ర కన్నా ముందు ఎం జి ఆర్ గా కనిపించిన అరవింద స్వామి కోసం చెప్పుకోవాలి. ఈ పాత్రలో అరవింద స్వామి తన వెర్సిటిలిటీని కనబరిచిన విధానం అమోఘం.. ఖచ్చితంగా సినిమా చూసే వారిని అరవింద స్వామి ఆశ్చర్యపరుస్తాడు. ఎం జి ఆర్ మ్యానరిజమ్స్ లొక్స్, తన ప్రెజెన్స్ తో అవుట్ స్టాండింగ్ గా చేసారని చెప్పాలి.

ఇక కంగనా విషయానికి వస్తే ముందు చాలా మందికి పలు అనుమానాలు ఉన్నాయి.. కాయాన్ని వాటన్నటికీ కంగనా తన నటనతో చెక్ పెట్టింది అని చెప్పాలి. జయలలిత జీవితంలో పలు స్టేజెస్ లో ఆ ఒయాత్రకి తగ్గట్టుగా తనని తాను మలచుకోవడమే కాకుండా అంతే స్థాయిలో వివిధ తరహా నటనలను కనబరిచి అత్యద్భుతంగా రక్తి కట్టించింది ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.. కొన్ని కీలక సన్నివేశాల్లో తాను కనబరిచిన భావోద్వేగాలు అమోఘం.

మరి ఇతర కీలక పాత్రల్లో కనిపించిన నటులు సముథిరఖని, నాజర్ లు కూడా తమ పత్రాలు సంపూర్ణ న్యాయం చేకూర్చారు. వారితో పాటుగా ఇతర కీలక పాత్రల్లో కనిపించిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. అలాగే ఇలాంటి సినిమాలతో ముఖ్యంగా మళ్ళీ పాత రోజులని గుర్తు చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అవి కూడా ఈ చిత్రంలో కనిపిస్తాయి అలనాటి హంగులు భారీ లెవెల్లో ఉంటాయి. విజువల్స్ ఆ గ్రాండియర్ సెకండాఫ్ లో కనిపించే సన్నివేశాలు ఈ చిత్రంలో ప్రధానాకర్షణగా కనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో ప్రధానంగా మైనస్ పాయింట్స్ అని కాదు కానీ సినిమా కోసం బాగా తెలిసిన వారికి మాత్రం ఓ విషయంలో నిరాశ పడతారు. జయలలిత సినిమా భాగంలో తమిళ సినిమాతో పాటుగా తెలుగు సినిమాకి కూడా ఎంతో కీలక పాత్ర ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా అసలు ఈ చిత్రంలో తెలుగు సినిమాకు సంబంధించిన సన్నివేశాలే చూపించలేదు.

తెలుగులో ఎంతోమంది అగ్రులతో నటించినా అవేవి చూపకపోవడం తెలుగు ఆడియెన్స్ కి డెఫినెట్ గా నిరాశ కలిగించే అంశం. అలాగే ఈ చిత్రంలో కంగనా ని పలు షేడ్స్ లో చూపించే క్రమంలో లోటు పాట్లు కూడా ఉన్నాయి. తన కమిట్మెంట్ బాగుంది కానీ మేకర్స్ దానిని సరిగ్గా వినియోగించలేదు సరైన ప్రోస్థెటిక్ మేకప్ కంగనాకి వేసి ఉంటే బాగుండేది చాలా సన్నివేశాల్లో తన మేకప్ క్లియర్ గా కనిపిస్తుంది దీనితో అంత సహజత్వం కనిపించదు.

అలాగే ఈ సినిమాకి మేకర్స్ ఒక చిన్న ప్రయోగం చేశారు అదే కంగనా పాత్రకి రెండు భిన్నమైన డబ్బింగ్స్ ని చెప్పించారు కానీ అది అంత ఎఫెక్టీవ్ గా అనిపించదు. ఇంకా అమ్మ జీవితానికి సంబంధించి తెలియని కోణాలను చూపించినట్టైతే బాగున్ను దాదాపు చాలా మేర అందరికీ తెలిసిన సన్నివేశాలే ఉంటాయి.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కానీ టెక్నీకల్ విభాగం పని తీరు కానీ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. ప్రతి విజువల్ లో కూడా ఆ గ్రాండియర్ అలా కనిపిస్తుంది. అలాగే జివి ప్రకాష్ సంగీతం కి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి ట్రైలర్ లోనే తన వర్క్ ఏ స్థాయిలో ఉందో తాను చూపించాడు అది సినిమాలో అందులోని బిగ్ స్క్రీన్ పై సినిమాకే మరో పెద్ద ఎసెట్ గా నిలిచింది. ఇంకా విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ కూడా మళ్ళీ పాత రోజులని మరపిస్తుంది చాలా నీట్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది. అలాగే ఆంటోనీ ఎడిటింగ్ కూడా సినిమాకి తగ్గట్టుగా నీట్ గా ఉంది.

ఇక దర్శకుడు ఏ ఎల్ విజయ్ విషయానికి వస్తే ఇలాంటి ఒక తలకు మించిన బాధ్యతని చక్కగా హ్యాండిల్ చేసారని చెప్పాలి. నటీనటుల నుంచి సాలిడ్ పెర్ఫామెన్స్ ని రాబట్టడం దగ్గర నుంచి ప్రతి ఫ్రేమ్ ని ఇంపుగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. అలాగే జయలలిత జీవిత చరిత్రలో రెండు కీలక ఘట్టాలను కూడా హ్యాండిల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే జయలలిత జీవిత చరిత్రలో మరిన్ని తెలియని కోణాలు చూపించి ఉంటే కనుక ఆడియెన్స్ కి మరింత మంచి అనుభవం దక్కి ఉండేది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే ఈ ‘తలైవి’ ఎప్పుడు నుంచో ఎన్నో అంచనాలతో ఎదురు చూస్తున్న ఆడియెన్స్ కి ఓవరాల్ గా మంచి ట్రీట్ ఇస్తుంది అని చెప్పాలి. కంగనా, అరవింద స్వామి ల మెస్మరైజింగ్ నటనలతో పాటుగా ఆకట్టుకునే అంశాలు ఎన్నో కనిపిస్తాయి, కానీ ఇంకొన్ని జాగ్రత్తలు, జయలలిత జీవితంపై ఇంకా తెలియని ఏవైనా కోణాలు చూపి ఉంటే బాగుండేది. జస్ట్ వీటిని పక్కన పెడితే థియేటర్స్ లో ఈ అవైటెడ్ బయోపిక్ చిత్రాన్ని ఖచ్చితంగా ఈ వారాంతానికి చూసి ఆస్వాదించవచ్చు.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Version

సంబంధిత సమాచారం :