సమీక్ష : ‘థాంక్యూ బ్రదర్’ – తెలుగు చిత్రం “ఆహా” లో ప్రసారం

Thank You Brother movie review

విడుదల తేదీ : మే 07, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : విరాజ్ అశ్విన్, నటి, యాంకర్ అనసూయ, అర్చన, వైవా హర్ష, అనిల్ కురువిల్లా, అన్నపూర్ణ

దర్శకత్వం : ర‌మేశ్ రాప‌ర్తి

నిర్మాత‌లు : మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డితో కలిసి తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి

సంగీతం : గుణ బాలసుబ్రమణియన్


విరాజ్ అశ్విన్, నటి, యాంకర్ అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన ‘థాంక్యూ బ్రదర్’ సినిమా ఆహా యాప్ లో మే 7వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాను జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంలో మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డితో కలిసి తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు ర‌మేశ్ రాప‌ర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అర్చన, వైవా హర్ష, అనిల్ కురువిల్లా, అన్నపూర్ణ, మౌనిక రెడ్డి, ఆదర్శ్, కాదంబరి కిరణ్ సమీర్ ముఖ్య పాత్రలు పోషించారు. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

అభి (విరాజ్ అశ్విన్ ) తల్లి ప్రేమను, అలాగే వ్యక్తిగత బాధ్యతలను కూడా పట్టించుకోకుండా తనకు ఇష్టం వచ్చినట్టు బతుకుతూ.. లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ టైం పాస్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతని ఆవేశం, అతనిలోని లెక్కలేని తనం కారణంగా ఇంటి నుండి బయటకు వచ్చి జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. మరోపక్క ప్రియ (అనసూయ) నిండు గర్భవతి, అప్పటికే ఆమె భర్త చనిపోయి ఉంటాడు. పైగా ప్రియది ఒక బిలౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇలా కొన్ని సమస్యలతో సాగుతోన్న అభి, ప్రియలిద్దరూ అనుకోకుండా ఓ లిఫ్ట్ లో ఇరుక్కుపోతారు. కరెక్ట్ గా ఆ టైంలో ప్రియకు నొప్పులు స్టార్ట్ అవ్వడంతో అభిలో చలనం వస్తోంది. మరి ప్రియను అతని ఎలా సేవ్ చేశాడు ? చివరకు అనసూయకి ఏమైంది ? బిడ్డ తల్లి క్షేమంగా ఉన్నారా లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

తల్లి విలువ తెలుసుకోలేని ఒక కొడుకు, తన జీవితంలో జరిగిన ఓ సంఘటన కారణంగా తిరిగి తన తల్లి ప్రేమను, అలాగే ఓ స్త్రీలోని తల్లి తనాన్ని అతను ఎలా తెలుసుకున్నాడు ? అనే కోణంలో సాగిన ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే దర్శకుడు మొదట్లో కొన్ని బోల్డ్ అండ్ కిస్ సీన్స్ తో యూత్ ను ఆకట్టుకోవడానికి చేసిన కమర్షియల్ యాంగిల్, అలాగే లవ్ ట్రాక్ మొత్తమ్మీద ఈ సినిమాలో కొన్ని అంశాలు బాగున్నాయి.

ఇక ఈ మూవీలో హీరోగా నటించిన విరాజ్ అశ్విన్ పర్ఫెక్ట్ ఫిజిక్ తో గుడ్ పెర్ఫామెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. అలాగే ప్రధాన పాత్ర పోషించిన అనసూయ తన పాత్రలో అద్భుతంగా నటించి సినిమా మొత్తం తానై నడిపిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా గర్భవతి పాత్రను చాల చక్కగా పోషించింది.
ఇక విరామానికి ముందు వచ్చే సన్నివేశంలో, డెలివరీ అయ్యే సీన్ లో ఆసక్తి రేగేలా ఆమె నటన సాగింది. కమెడియన్ వైవా హర్ష ఒకటి రెండు చోట్ల నవ్వులు పంచాడు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

మైనస్ పాయింట్స్:

పాయింట్ పరంగా, ఎమోషనల్ పరంగా మంచి కంటెంట్ తీసుకున్న దర్శకుడు రమేష్, ఈ మూవీలో కీలక సన్నివేశాలను, అలాగే ట్రీట్మెంట్ ను దర్శకుడు తెర పై ఆవిష్కరించిన విధానం మాత్రం ఆకట్టుకోదు. అయితే ఈ చిత్రానికి ప్రధాన బలం సెకండ్ హాఫ్, మొదటి సగం సో సో గానే నడుస్తోంది. పైగా కీలక సన్నివేశాలు సాగదీసినట్లు చాల స్లోగా సాగుతాయి.

సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి ఇంకా స్కోప్ ఉన్నప్పటికీ ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో.. కానీ దర్శకుడు మాత్రం ఆ దిశగా సినిమాను మలచలేకపోయాడు. ఇక చిత్రంలో కీలక రోల్స్ చేసిన వారిలో ఏ ఒక్కరి పాత్ర బలంగా తెరపై చూపించలేదు. తల్లి సెంటిమెంట్ తో సాగే సినిమాలో, ఆ తల్లి పాత్రలో నిజాయితీ ఉండాలి.

కానీ భర్త చనిపోయిన తరువాత, ఆ తల్లి రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో ఇంకా బలంగా చెప్పాల్సింది. తల్లి ఎమోషన్ చుట్టూ తిరిగే సినిమాలో ఆ ఎమోషన్ లో సిన్సియారిటీ, నిజాయితీ లేకపోతే ఎలా ?

సాంకేతిక విభాగం :

దర్శకుడు మంచి కంటెంట్ తీసుకోవడంతో కొన్ని సీన్స్ ను బలంగా తీయడంలో విజయం సాధించిన.. సినిమాని ఆకట్టుకునేలా ఆసక్తికరంగా మలచడంలో విఫలం అయ్యాడు. కెమెరామెన్ కెమెరా పనితనం బాగుంది. అలాగే కీలక సన్నివేశాలలో మ్యూజిక్ డైరెక్టర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి అనుభూతిని ఇచ్చింది. ఇక నిర్మాణ విలువ కూడా బాగున్నాయి.

తీర్పు:

ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం అక్కడక్కడ ఆకట్టుకునే ‘తల్లి విలువ తెలియజేసే ఎమోషనల్ డ్రామా’. సినిమాలో విరాజ్ అశ్విన్, అనసూయల నటనతో పాటు కొన్ని ఫీల్ గుడ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఐతే స్లో నేరేషన్, సింపుల్ ప్లే, సింగిల్ ప్లాట్, అలాగే దర్శకుడు సినిమాని తెర పై ఆవిష్కరించిన విధానం పెద్దగా ఆకట్టుకోలేదు. ఓవరాల్ గా ఎమోషనల్ మూవీస్ ఇష్టపడేవారు ఈ మూవీని ఓ సారి చూడొచ్చు.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version