విడుదల తేదీ : ఆగస్టు 20, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
తారాగణం: హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల
దర్శకత్వం: మల్లిక్ రామ్
నిర్మాత : కొల్లా ప్రవీణ్
సంగీతం : నరేన్ ఆర్కే సిద్ధార్థ
ప్రస్తుతం మేము కొనసాగుతున్న పలు డైరెక్ట్ స్ట్రీమింగ్ షోస్ మరియు సినిమాలు, సిరీస్ ల సమీక్షల పరంపరలో తాజాగా ఎంచుకున్న సిరీస్ “తరగతి గది దాటి”. తెలుగు భాషలోకి తెరకెక్కిన ఈ లేటెస్ట్ సిరీస్ స్ట్రీమింగ్ యాప్ ఆహా లో లేటెస్ట్ గానే అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో పరిశీలిద్దాం రండి.
కథ :
ఈ సిరీస్ కథలోకి వస్తే.. కిట్టు(హర్షిత్) అనే ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ తన స్టడీస్ కంటే కూడా వంట నేర్చుకోవడం అనే దానిపై ఎక్కువ శ్రద్ధ పెడతాడు. మరి ఈ క్రమంలోనే తనకి జాస్మిన్(పాయల్) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి లవ్ కూడా చేసుకుంటారు. అయితే టీనేజ్ లో ఉన్న ఈ ఇద్దరి లైఫ్ ని ఒక్కసారిగా ఓ ఊహించని సంఘటన పూర్తిగా చేంజ్ చేస్తుంది. మరి ఆ సంఘటన ఏమిటి? వీరిద్దరూ దాని నుంచి బయట పడతారా లేదా అన్నది ఇందులో ఇతివృత్తం.
ప్లస్ పాయింట్స్ :
మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనెర్స్ ని ఇష్టపడే వారికి ఈ సిరీస్ అక్కడక్కడా మంచి ఫీల్ ఇస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా మెయిన్ లీడ్ మధ్య కనిపించే కొన్ని సన్నివేశాలు అలాగే వారి కెమిస్ట్రీ సిరీస్ లో ఆకట్టుకుంటుంది. హర్షిత్, పాయల్ తో పాటుగా కనిపించిన నిఖిల్ తదితర పాత్రలు కూడా మంచి నటనను పాత్రలకు తగ్గట్టుగా కనబరుస్తాయి.
అలాగే ఇందులో మంచి ఫన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటుగా డైలాగ్స్ కనిపించే బ్యాక్ డ్రాప్, ఎమోషన్స్ అంతా ఒకింత ఫ్రెష్ గా అనిపిస్తాయి. వీటి మూలాన పలు చోట్ల మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ చూసే వారికి అనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
పలు చోట్ల ఆహ్లాదంగా కొనసాగే ఈ సిరీస్ లో చిన్న లోటుపాట్లు ఉన్నాయి.. ముందు అంతా బానే ఉన్నా లాస్ట్ ఎపిసోడ్స్ కి వచ్చేసరికి అంతా షరా మాములే అనిపిస్తుంది రొటీన్ స్క్రీన్ ప్లే లో ఊహాజనితంగానే ఉంటుంది. అలాగే క్లైమాక్స్ ఎండింగ్ కూడా ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది.
అలాగే మెయిన్ లీడ్ మధ్య డీల్ అయ్యే కొన్ని సన్నివేశాల్లో మేజర్ లాజిక్స్ మిస్సయ్యినట్టు అనిపిస్తాయి. వారి మధ్య కనిపించే సంఘర్షణలు కథనంకి తగ్గట్టుగా నాచురల్ గా అనిపించవు. అలాగే సెకండ్ సీజన్ పై ఇచ్చిన హింట్ అంత ఆసక్తిని ఏం తెప్పించదు.
సాంకేతిక వర్గం :
ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు సహా టెక్నీనల్ టీం సపోర్ట్ డీసెంట్ అని చెప్పాలి. ఏవి ఎంత మేర ఉండాలో అంతలో ఉన్నాయి. సంగీతం కానీ సినిమాటోగ్రఫీ కానీ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఇక దర్శకుడు మల్లిక్ రామ్ విషయానికి వస్తే తన పనితనం కూడా ఓకే అని చెప్పొచ్చు. తాను ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ ని పెద్దగా పక్కదారి పట్టించకుండా ఓ మోస్తరుగా నడిపించారు. కాకపోతే మరికొన్ని సన్నివేశాలు ఇంకా బెటర్ గా రాసుకొని ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది.
తీర్పు :
ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ “తరగతి గది దాటి” సిరీస్ లో యువ నటీనటుల నటన డెఫినెట్ గా ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. ఇంకా డీసెంట్ ఎమోషన్స్, కామెడీ సహా కొన్ని ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. కానీ ఆల్రెడీ కొన్ని సన్నివేశాలు ఎపిసోడ్స్ ఇంకా బాగా ప్రెజెంట్ చేసి ఉంటే బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది. మొత్తానికి మాత్రం ఓకే అనిపించే స్థాయిలో ఉండే ఈ సిరీస్ ని ఓసారి మీకు సమయం ఉంటే చూడొచ్చు.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team