ఓటిటి రివ్యూ: ది గ్రే మ్యాన్ – నెట్ ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ సినిమా!

The Gray Man Movie Review

విడుదల తేదీ : జులై 22, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, ధనుష్, అనా డి అర్మాస్, జెస్సికా హెన్విక్, బిల్లీ బాబ్ థోర్టన్, రెగె జీన్ పేజ్, జూలియా బటర్స్ తదితరులు

దర్శకత్వం : రుస్సో బ్రదర్స్

నిర్మాతలు: రుస్సో బ్రదర్స్, జో రోత్, జెఫ్ కిర్షెన్‌బామ్, మైక్ లారోకా, క్రిస్ కాస్టాల్డి మరియు పాలక్ పటేల్

సంగీత దర్శకుడు: హెన్రీ జాక్‌మన్

సినిమాటోగ్రఫీ: స్టీఫెన్ ఎఫ్ విండన్

ఎడిటర్: జెఫ్ గ్రోత్ మరియు పియట్రో స్కాలియా

 

రుస్సో బ్రదర్స్‌గా ప్రసిద్ధి చెందిన జో రుస్సో మరియు ఆంథోనీ రుస్సో అవెంజర్స్: ఎండ్‌గేమ్ తో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను అలరించిన తర్వాత, యాక్షన్ థ్రిల్లర్ ది గ్రే మ్యాన్‌తో ముందుకు వచ్చారు. ఈ సినిమా ఈరోజు నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

కథ:

CIA కోసం పనిచేస్తున్న ఒక గ్రే మ్యాన్, సియెర్రా సిక్స్ (ర్యాన్ గోస్లింగ్) అనే కోడ్‌నేమ్ గల కోర్ట్ జెంటీ బ్యాంకాక్‌లో సియెర్రా ఫోర్ అనే చెడ్డ వ్యక్తిని చంపడానికి పంప బడతాడు. అతని పెన్ డ్రైవ్‌లో ఏజెన్సీకి సంబంధించిన చీకటి రహస్యాలు ఉన్నాయని కనుగొన్నాడు. సియర్రా సిక్స్ అతన్ని చంపి, పెన్ డ్రైవ్ ను తీసుకొని పారిపోవడం జరుగుతుంది . కాబట్టి, సియెర్రా సిక్స్‌ను చంపి, ఆ సాక్ష్యం ను తిరిగి తీసుకు రావడానికి వారి బాస్ డెన్నీ కార్మిచెల్ (రెగ్ జీన్ పేజ్) సైకోపతిక్ మాజీ సహోద్యోగి అయినటువంటి లాయిడ్ హాన్సెన్ (క్రిస్ ఎవాన్స్)ని నియమిస్తాడు. ఆ రహస్యాలు ఏమిటి? లాయిడ్ సియర్రా సిక్స్‌ ని చంపాడా? తరువాత ఏం జరిగింది? వీటికి సమాధానాలు తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

కథ అందరికీ తెలిసిందే అయినప్పటికీ, హ్యాపీ ఎండింగ్ వరకూ కూడా కళ్ళను తిప్పుకోకుండా స్క్రీన్‌లకు అతుక్కుపోయేలా చేసే రేసీ స్క్రీన్‌ప్లే ఇది. విమానం క్రాష్ సన్నివేశం లేదా ట్రైన్ ఫైట్ వంటి యాక్షన్ సీక్వెన్స్‌ లతో పాటు సినిమాను మరింత ఆసక్తి గా చేసినందుకు జో రుస్సో, క్రిస్టోఫర్ మార్కస్ మరియు స్టీఫెన్ మెక్‌ఫీలీ ముగ్గురికి ధన్యవాదాలు తెలపాలి. పెర్ఫార్మెన్స్ ల విషయానికి వస్తే, ర్యాన్ గోస్లింగ్ ఒక హంతకుడుగా పని చేసే వ్యక్తిగా తన అత్యుత్తమ ప్రదర్శనను అందించాడు. అమాయక వ్యక్తులను రక్షించడానికి నైతికతకు కట్టుబడి ఉంటాడు. అతని పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది.

క్రిస్ ఎవాన్స్ పోషించిన లాయిడ్ పెర్ఫార్మెన్స్ గురించి మనం కచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇప్పటివరకు, అతను అవెంజర్‌గా మాత్రమే మనకు తెలుసు, కానీ ఈ చిత్రంలో అతన్ని ఒక క్రూరమైన మరియు సైకో పాతిక్ ఏజెంట్‌గా చూడవచ్చు. ఈ చిత్రం లో అతను కోరుకున్నది దక్కడానికి ఏదైనా చేస్తాడు. అతని నటన ఈ చిత్రం లో సూపర్ గా ఉంటుంది. అతని అద్భుతమైన నటన సినిమాకు పెద్ద ప్లస్ అని చెప్పాలి.

ధనుష్ విషయానికి వస్తే, అతని స్క్రీన్ ప్రెజెన్స్ పరిమితమే అయినప్పటికీ అతను తన యాక్షన్ స్టంట్స్‌తో హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అని చెప్పాలి. అనా డి అర్మాస్, బిల్లీ బాబ్ థోర్టన్, జూలియా బటర్స్ మరియు జెస్సికా హెన్విక్ తమ అత్యుత్తమ ప్రదర్శనను అందించారు.

 

మైనస్ పాయింట్స్:

 

ది గ్రే మ్యాన్‌కు కథ పెద్ద డిజప్పాయింట్ కలిగించే విషయం అని చెప్పాలి. కథ ఊహించదగినది గా ఉంటుంది. స్టార్ నటులు ఉన్నప్పుడు, అద్భుతమైన ట్విస్ట్‌లు మరియు మలుపులతో కూడిన అసాధారణమైన స్క్రిప్ట్‌తో తెరకెక్కించాలి. కానీ, రుస్సో బ్రదర్స్ ఒక సాధారణ మరియు అందరికీ తెలిసిన పిల్లి మరియు ఎలుక గేమ్ కథను ఎంచుకుని, దానిని గొప్పగా షూట్ చేస్తారు. సినిమా పై భారీ అంచనాలున్నప్పటికీ ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయింది అని చెప్పాలి.

అయితే ఈ ఏజెన్సీ యొక్క చీకటి రహస్యాల గురించిన బ్యాక్ స్టోరీ ను మరింత వివరంగా చూపించవచ్చు. అనా డి అర్మాస్ మరియు ధనుష్ పాత్రలను కథపై మరింత ప్రభావం చూపేలా మంచి పద్ధతిలో డిజైన్ చేసి ఉండవచ్చు.

 

సాంకేతిక విభాగం:

 

ఇంతకు ముందు చెప్పినట్లుగా, దర్శక ద్వయం అయిన జో రుస్సో మరియు ఆంథోనీ రుస్సో ఆకర్షణీయమైన కథను రూపొందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. స్టీఫెన్ ఎఫ్ విండన్ సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీక్వెన్స్‌లలో కొన్ని షాట్స్ ఎక్స్‌ట్రార్డినరీగా అనిపిస్తాయి. హెన్రీ జాక్‌మన్ సంగీతం సినిమాలో బాగుంది. జెఫ్ గ్రోత్ మరియు పియట్రో స్కాలియా ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు అత్యున్నతమైనవి మరియు మీరు వాటిని సినిమాలో చూడవచ్చు.

 

తీర్పు:

మొత్తం మీద, ది గ్రే మ్యాన్ అనేది అందరికీ తెలిసిన పాత కథ. మంచి యాక్షన్ ఎపిసోడ్‌ లతో కూడిన యాక్షన్ థ్రిల్లర్. క్రిస్ ఎవాన్స్ మరియు ర్యాన్ గోస్లింగ్ ల యొక్క అద్భుత నటన ఆకట్టుకుంటాయి. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ కథ పరంగా కొత్తదేమీ లేదు. అయితే మీరు యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారైతే, ఒకసారి చూడవచ్చు. ఈ చిత్రాన్ని థియేటర్ల లో విడుదల చేసి ఉంటే మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.

 

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :