సమీక్ష : ది కాశ్మీర్ ఫైల్స్ – గ్రిప్పింగ్ ఎమోషనల్ డ్రామా

సమీక్ష : ది కాశ్మీర్ ఫైల్స్ – గ్రిప్పింగ్ ఎమోషనల్ డ్రామా

Published on Mar 16, 2022 6:00 AM IST
The Kashmir Files Movie Review

విడుదల తేదీ : : మార్చ్ 15, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు: మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, మృణాల్ కులకర్ణి

దర్శకత్వం : వివేక్ అగ్నిహోత్రి

నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, తేజ్ నారాయణ్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి

సంగీత దర్శకుడు: స్వప్నిల్ బందోద్కర్

బ్యాక్గ్రౌండ్ స్కోర్ : రోహిత్ శర్మ

సినిమాటోగ్రఫీ: ఉదయ్‌సింగ్ మోహితే

ఎడిటర్ : శంఖ్ రాజాధ్యక్ష

 

కాశ్మీర్ ఫైల్స్ ఇటీవలి కాలంలో సంచలనం సృష్టిస్తున్న చిత్రం. అనుప‌మ్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని సాలిడ్ బిజినెస్ చేస్తోంది. అది ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

కాశ్మీర్ ఫైల్స్ చిత్రం 90ల నాటి కాలం లో కాశ్మీర్‌లో జరిగిన నిజ జీవిత కథల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రం కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీరీ హిందువుల వలస గురించి తెరకెక్కించడం జరిగింది. కృష్ణ పండిట్ (దర్శన్ కుమార్) JNU విద్యార్థి, అతని తాత పుష్కర్ నాథ్ (అనుపమ్ ఖేర్) తన తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోయారు అని చెపుతాడు. కానీ, నిజం ఏమిటంటే చాలా మంది హిందూ పండిట్లను ఊచకోత కోసినట్లు తెలుస్తుది. దర్శన్ ఈ సంఘటనల గురించి తెలుసుకున్న తరువాత ఏమి చేస్తాడు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

 

ప్లస్ పాయింట్స్:

కాశ్మీర్ ఎప్పుడూ ముస్లింల డామినేషన్ ఉన్న రాష్ట్రంగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. కానీ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఏర్పడిన భారీ విభేదాల సమయంలో, హిందూ పండిట్‌లలోని ఒక విభాగం ను చంపడం జరుగుతుంది. ఈ సినిమా లో ఆ కథలను డీల్ చేయడం మాత్రమే కాకుండా, చాలా గ్రిప్పింగ్‌ గా సాగుతుంది. కాశ్మీర్ లో జరిగిన ఈ ఘటనలు ఎవరికి తెలియదు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ ఘటనలను చాలా అద్భుతం గా తెరకెక్కించారు.

అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో కాశ్మీరీ పండిట్ పాత్రలో అద్భుతం గా నటించాడు. ఈ చిత్రం కోసం అతను చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. కాశ్మీరీ యాసను డెలివరీ చేయడం లో బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. అంతేకాక ఈ చిత్రం లో కాశ్మీరీ పండిట్‌లను చంపి చిత్రహింసలకు గురి చేసే సన్నివేశాలను చాలా షాకింగ్‌ గా చూపించారు అని చెప్పాలి.

JNU విద్యార్థి గా నటి చిన దర్శన్ కుమార్ ఈ చిత్రం లో అద్భుతమైన నటనను కనబరిచాడు. టీవీ నటి అయిన పల్లవి జోషి చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రం లో నటించడం జరిగింది, తన పర్ఫార్మెన్స్ ఈ చిత్రం లో ఆకట్టుకుంటుంది.

 

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రం లో కాశ్మీరీ పండిట్ల జీవితాలలో జరిగిన కొన్ని కఠినమైన నిజాలను మరియు సమస్యలను చూపించడం జరిగింది. ఈ చిత్రం లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ను కాస్త ఆర్టిఫీషియల్ గా చూపించడం జరిగింది. అంతేకాక మల్టిపుల్ టాపిక్స్‌తో సీరియస్‌గా సినిమా సాగుతూ ఉండటం తో డల్‌గా, బోరింగ్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది.

ఈ చిత్రం లో సరైన డ్రామా ను క్రియేట్ చేయడానికి చాలా సన్నివేశాలను చిత్రీకరించాల్సి వచ్చింది. అవి కాస్త సాధారణ ప్రేక్షకులకి కాస్త బోరింగ్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్టర్ కొన్ని విషయాలను సింపుల్ గా అర్థమయ్యే రీతిలో చెబితే బాగుండేది.

 

సాంకేతిక విభాగం:

కాశ్మీర్ ఫైల్స్‌ చిత్రం లో టెక్నికల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా బెస్ట్ అని చెప్పాలి. కెమెరా వర్క్ సినిమా కి ప్రధాన ఆకర్షణ. కాశ్మీరీ విజువల్స్, లొకేషన్లు మరియు ఉపయోగించిన దుస్తులు రియాలిటీ గా ఉన్నాయి. ఈ చిత్రం కి అందించిన సంగీతం ప్రేక్షకులను వెంటాడుతూ ఉంటుంది. ఈ చిత్రం BGM అయితే కీలక సన్నివేశాలని మరో లెవెల్ కి తీసుకు పోయింది అని చెప్పాలి. సినిమా లోని డైలాగ్స్ చాలా బావున్నాయి. చిత్రం నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

మొత్తం మీద, కాశ్మీర్ ఫైల్స్ అనేది కాశ్మీర్‌లో హిందూ పండిట్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించే ప్రయత్నం. ఈ చిత్రం లో నటీనటుల నటన మరియు సన్నివేశాలు 90లలో కాశ్మీర్ లోయలోని జీవితాల గురించి తెలియని వాస్తవాలు, చాలా భయంకరమైన రీతిలో చూపించడం జరిగింది. ఈ చిత్రం లో తెలియని కొన్ని విషయాలను చూపించడం మాత్రమే కాకుండా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ను కలిగి ఉండటం తో, ఈ వారాంతం సినిమాను చూడవచ్చు.

123telugu.com Rating: 3.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు