సమీక్ష : “ది లెజెండ్” – మెప్పించని బోరింగ్ డ్రామా

సమీక్ష : “ది లెజెండ్” – మెప్పించని బోరింగ్ డ్రామా

Published on Jul 29, 2022 3:01 AM IST
Vikrant Rona Movie Review

విడుదల తేదీ : జులై 28, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు: అరుల్ శరవణన్, ఊర్వశి రౌటేలా

దర్శకత్వం : జేడీ జెర్రీ

నిర్మాత: అరుల్ శరవణన్

సంగీత దర్శకుడు: హారిస్ జయరాజ్

సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్‌రాజ్

ఎడిటర్: రూబెన్

 

గత కొన్ని రోజులు నుంచి సినిమా దగ్గర గట్టి ప్రమోషన్స్ తో కాస్త హడావుడిగా వినిపిస్తూ వచ్చిన చిత్రం “ది లెజెండ్”. ప్రముఖ బిజినెస్ మెన్ లెజెండ్ శరవణన్ హీరోగా చేసిన మొదటి సినిమా అందులో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. మరి ఇంతలా హైప్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో ఈరోజు రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా ఆ అంచనాలు అందుకుందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఇక ఈ సినిమా కథలోకి వచ్చినట్టు అయితే..డాక్టర్ శరవణన్(లెజెండ్ శరవణన్) వ్యవసాయ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరున్న ఒక అద్భుత సైంటిస్ట్. అయితే తన ప్రజలకు ఏదైనా చెయ్యాలి అని తన పుట్టిన ఊరికి వచ్చేస్తాడు. అక్కడ తన లానే ప్రతిభ ఉన్నవాళ్ళని తయారు చెయ్యాలని అనుకుంటాడు. అయితే ఈ క్రమంలో తన ఫ్రెండ్ ఒక అరుదైన వ్యాధితో చనిపోతాడు. ఇక దీనితో ఆ వ్యాధికి మందు కనుక్కోవాలని శరవణన్ ప్రయత్నిస్తాడు. అయితే ఈ ప్రయత్నంతో తన బిజినెస్ కి భారీ నష్టం వస్తుందని వీజే (సుమన్) ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తాడు. మరి ఈ అడ్డంకులని శరవణన్ ఎలా ఎదుర్కొంటాడు? ఇంతకీ తాను కనిపెట్టాలి అనుకున్న మందు ఏంటి? చివరికి కనిపెడతాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్ :

ఈ చిత్రంలో మొదటగా చెప్పుకోవాల్సింది ఈ సినిమా గ్రాండియర్ కోసం అని చెప్పాలి. టీజర్, ట్రైలర్స్ మరియు సాంగ్స్ లో చూపించిన విధంగా చాలా గ్రాండ్ విజువల్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి. మేకర్స్ అయితే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి అవుట్ పుట్ ని తెచ్చారు. సినిమా చూసినంతసేపు మాత్రం గ్రాండ్ ట్రీట్ కనిపిస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే హీరోగా శరవణన్ పర్వాలేదనిపిస్తారు. తనపై యాక్షన్ బ్లాక్ లు బాగున్నాయి. ఇక హీరోయిన్ లు ఊర్వశి రౌటేలా మరియు గీతికలు తమ నటనతో పాటు తమ గ్లామర్ షో తో ఆకట్టుకుంటారు. అలాగే నటుడు సుమన్ కూడా విలన్ పాత్రలో ఆకట్టుకుంటాడు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మాత్రం డ్రా బ్యాక్ లు చాలా ఎక్కువే కనిపిస్తాయని చెప్పాలి. మొదటగా హీరో శరవణన్ విషయానికి వస్తే తాను సినిమా హీరోగా కనిపించాలని అనుకోవచ్చు కానీ అందుకు తగ్గట్టుగా ఇంకా ఓపెన్ గా ప్రిపేర్ అయితే తన సైడ్ నుంచి బాగా ప్లస్ అయ్యి ఉండేది.

నటన పరంగా చాలా వరకు హావభావాలు తాను ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇచ్చినట్టు అనిపించదు. ఇంకా తనతో పాటుగా చాలా మంది భారీ తారాగణమే ఉంది కానీ సినిమాకి వారు ఏమాత్రం ఉపయోగపడలేకపోయారని చెప్పాలి. ఇంకా సినిమాలో అసలు సరైన కథా కథనాలే కనిపించవు.

కేవలం గ్రాండ్ విజువల్స్ యాక్షన్ పై మాత్రమే దృష్టి పెట్టిన మేకర్స్ ఎంగేజింగ్ గా సినిమాని నడపడంలో విఫలం అయ్యారు. అలాగే చాలా వరకు సన్నివేశాల్లో కథనం చాలా రొటీన్ గా చిరాకు తెప్పించేలా ఉంటుంది. అలాగే ఒక కొత్త హీరోపై ఓవర్ గా బిల్డప్ ఇవ్వడం వంటివి జెనరల్ ఆడియెన్స్ కి బాగా అతి చేసినట్టు అనిపిస్తాయి.

పోనీ సినిమా కథ రొటీన్ గానే ఉన్నా కథనం ఏమన్నా కొత్తగా ఉంటుందా అంటే అది కూడా కనిపించదు. దీనితో అయితే థెటర్స్ లో ఆడియెన్స్ ఓపికకి పరీక్ష తప్పదు. చాలా వరకు అనవసర సీన్స్ ఓవర్ బిల్డప్ సీన్స్ తగ్గించాల్సింది.

 

సాంకేతిక వర్గం :

మొదట్లో చెప్పుకున్నట్టుగా సినిమా నిర్మాణ విలువలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తాయి. నిర్మాణం పరంగా అయితే భారీ ఖర్చు అంతా విజువల్స్ పరంగా ఓ రేంజ్ లో కనిపిస్తుంది. ఇంకా టెక్నీకల్ టీం విషయానికి వస్తే.. వారిలో సంగీత దర్శకుడు హరీష్ జై రాజ్ సినిమాటోగ్రాఫర్ వేల్ రాజ్ ల వర్క్ సాలిడ్ గా ఉంటాయి. అద్భుతమైన విజువల్స్ మరియు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు ఎక్కడైనా సినిమా బాగుంది అనిపినేది ఉందా అంటే అది వారి వల్లే అని చెప్పొచ్చు. ఇక ఎడిటర్ రూబెన్ చెయ్యడానికి కూడా ఏమి లేదు.. కొన్ని సీన్స్ తగ్గించినా కూడా సినిమా ఫలితాన్ని మార్చడానికి ఏమీ చెయ్యలేడు.

ఇక దర్శకులు జేడీ చెర్రీ విషయానికి వస్తే ఓవరాల్ డిజప్పాయింటింగ్ వర్క్ అందించారని చెప్పాలి. కేవలం పైన హంగులు తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ అసలు విషయం లేదు. దీనితో సినిమా కి పెట్టిన బడ్జెట్ మిగతా టీం ఎఫర్ట్స్ అన్నీ కూడా ఉపయోగం లేనట్టు అయిపోతాయి. కాకపోతే ఒక్క విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ లు వరకు పర్వాలేదనిపిస్తాయి. కానీ మొత్తంగా అయితే డైరెక్షన్ టీం వర్క్ మెప్పించదు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ది లెజెండ్” తో తన మొదటి సినిమాగా వచ్చిన శరవణన్ తాను హీరోగా గ్రాండ్ లెవెల్లో పరిచయం అవ్వాలన్న ఆశ నెరవేరి ఉండొచ్చు తప్ప సినిమా మాత్రం ఆడియెన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోదు. ఒక్క గ్రాండ్ విజువల్స్, సంగీతం మినహా సినిమాలో అసలు చెప్పుకునే హైలైట్ అంశం ఒకటికి కూడా పెద్దగా కనిపించదు. సో ఈ వారాంతానికి అయితే ఈ సినిమాని పక్కన పెట్టేస్తే మీ సమయం, డబ్బులు రెండు ఆదా అవుతాయి. నెక్స్ట్ టైం అయినా శరవణన్ బెటర్ కథ బెటర్ నటనతో వస్తే బాగుంటుంది.

123telugu.com Rating: 1.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు