సమీక్ష : “ది లైఫ్ ఆఫ్ ముత్తు” – స్లోగా సాగే గ్యాంగ్‌ స్టర్ డ్రామా !

Muthu Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 17, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: సిలంబరసన్, సిద్ధి ఇద్నాని

దర్శకత్వం : గౌతం వాసుదేవ్ మీనన్

నిర్మాత: ఈశారి కె. గణేష్

సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని

ఎడిటర్: ఆంథోని

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

‘మన్మధ’, ‘వల్లభ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘శింబు’ హీరోగా వచ్చిన కొత్త చిత్రం ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’. రెహమాన్ సంగీతం, గౌతమ్ మీనన్ టేకింగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

 

ముత్తు (శింబు) కుటుంబ పరిస్థితి కారణంగా..ఉద్యోగం కోసం ముంబైకి వెళ్లాల్సి వస్తోంది. ముంబైలో ఒక పరోటా స్టాల్‌లో చిన్నపాటి ఉద్యోగంలో చేరుతాడు. కానీ, ఆ స్టాల్‌ లోని వ్యక్తులు క్రైమ్ చేస్తూ ఉంటారని ముత్తుకి అర్ధం అవుతుంది. తన స్టాల్‌ యజమానికి అండర్ వరల్డ్‌తో ఉన్న సంబంధాల గురించి తెలిసాక ముత్తు ఏం చేశాడు ?, ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ముత్తు ఆ గ్యాంగ్ వార్స్‌లో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది ?, ఆ తర్వాత ముత్తు జీవితంలో ఏం జరుగుతుందనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

శింబు వన్ మ్యాన్ షోతో నడిచిన ఈ సినిమాలో.. శింబు, ముత్తు పాత్రలో చక్కగా నటించాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ స్ లో శింబు చాలా బాగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్‌ లో అయితే శింబు నటన నెక్స్ట్ లెవెల్‌ అనిపిస్తోంది.

ఇక హీరోయిన్ గా నటించిన సిద్ధి ఇద్నానికు పెద్దగా స్కోప్ లేదు. అయితే, ఉన్నంతలో ఆమె తన క్యూట్ లుక్స్ లో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. కీలక పాత్రల్లో నటించిన రాధిక, నీరజ్ మాధవ్ లు చాలా బాగా నటించారు. అలాగే, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

లవ్ ట్రాక్ డీసెంట్‌గా ఉంది. ఇక దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని సస్పెన్స్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సస్పెన్స్ సీన్స్ కూడా బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ అంటే.. కథనం. సినిమా ప్రారంభం నుంచి, స్క్రీన్ ప్లే ప్లో చాలా నెమ్మదిగా సాగుతుంది. పైగా సూపర్బ్ గా ఉండాల్సిన సీన్స్ కూడా సరిగ్గా ఎగ్జిక్యూట్ కాలేదు. దీనికి తోడు సినిమా నిడివి కూడా ఎక్కువ కావడం కూడా ఈ సినిమాకి మరో ఎదురుదెబ్బ.

అసలు ఇలాంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సినిమా సాగితేనే.. ఆడియన్స్ ను ఆకట్టుకోగలం. అయితే, ఈ సినిమాలో అలాంటి అంశాలు ఉన్నప్పటికీ.. కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి.

అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. అయితే, దర్శకుడు సెకండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, ఓవరాల్ కొన్ని చోట్ల లాజిక్స్ వదిలేశారు. దీనికి తోడు మెయిన్ గా సినిమాలో ఇంట్రెస్టింగ్ ప్లేను బిల్డ్ చేయలేకపోయారు.

 

సాంకేతిక విభాగం :

 

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. AR రెహమాన్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఐతే, ఎడిటింగ్ టీమ్ మెరుగ్గా ఉండి ఉంటే బాగుండేది. దర్శకుడు గౌతమ్ మీనన్ విషయానికి వస్తే, దర్శకత్వం పరంగా ఓకే అనిపించినా.. స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం ఆయన ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు:

 

మొత్తమ్మీద ఈ ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ సినిమా ఒక మిడ్లింగ్ గ్యాంగ్‌ స్టర్ డ్రామా. ముత్తుగా శింబు నటన అద్భుతం, అలాగే కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలతో పాటు ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. కానీ, డెడ్ స్లో కథనం, సుదీర్ఘమైన సినిమా నిడివి, కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, అలాగే కొన్ని సీన్స్ లో ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఓవరాల్ గా ఎమోషనల్ అండ్ క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారు ఈ సినిమాని చూడొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version