సమీక్ష : ‘తెల్లవారితే గురువారం’ – కొన్ని చోట్ల కామెడీతో సాగే బోరింగ్ డ్రామా !

సమీక్ష : ‘తెల్లవారితే గురువారం’ – కొన్ని చోట్ల కామెడీతో సాగే బోరింగ్ డ్రామా !

Published on Mar 28, 2021 3:06 AM IST
Thellavarithe Guruvaram movie review

విడుదల తేదీ : మార్చి 27, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.5/5

నటీనటులు : శ్రీ సింహా, మిషా నరాంగ్, చిత్ర శుక్లా, రాజీవ్ కనకాల, సత్య, అజయ్, వైవా హర్ష

దర్శకత్వం : మణికాంత్ జెల్లి

నిర్మాత‌లు : రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని

సంగీతం : కాల భైరవ

సినిమాటోగ్రఫీ : సురేష్ రగుతు

ఎడిటింగ్ : సత్య గిడుతూరి

తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ఆయ‌న హీరోగా మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం తెల్లవారితే గురువారం. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలు. కాల భైరవ సంగీతమందిస్తున్న ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

వీరు (శ్రీ సింహా కోడూరి)తెల్లారి తన పెళ్లి పెట్టుకుని పారిపోవడానికి రెడీ అవుతాడు. అయితే మధ్యలో అతనికి పెళ్లి కూతురు మధు (మిషా నారంగ్‌) తనతో పెళ్లి ఇష్టం లేక పారిపోతూ కనిపిస్తోంది. అలా తమ పెళ్లి వద్దు అనుకుని పారిపోయిన ఈ జంట.. అసలు ఎందుకు పెళ్లి వద్దు అనుకుంటున్నారు ? వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏమిటి ? అలాగే కృష్ణ వేణి (చిత్రా శుక్ల)తో వీరుకి ఉన్న సంబంధం ఏమిటి ? చివరకు వీరు – మధు పెళ్లి జరిగిందా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

చిన్న చిన్న విషయాలకే అపోహలు అపార్థాలతో విడిపోవడానికి కూడా సిద్ధపడే అమ్మాయిని ప్రేమించిన ఒక అబ్బాయి కథ ఎలాంటి మలుపులు తిరిగింది ? అంటూ దర్శకుడు ఈ సినిమాని మంచి కామెడీతో చూపించే ప్రయత్నం చేశాడు. మళ్లీ అంతలోనే సినిమాలోని కీలక పాత్రల మధ్యలో కన్ ఫ్యూజన్ కామెడీని పెట్టి ఫన్ తో పాటు టెన్షన్ ను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక హీరోయిన్ ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్న ఎమోషనల్ సీన్ కూడా బాగానే ఉంది.

నటన విషయానికి వస్తే.. వీరు పాత్ర‌లో.. సింహా తన ఎమోషనల్ యాక్టింగ్ తో బాగా నటించాడు. సినిమాలోని కన్ ఫ్యూజన్ కామెడీని తన హావభావాలతోనే బాగా పలికించే ప్రయత్నం చేశాడు. అలాగే హీరోయిన్ మిషా కూడా చాలా బాగా నటించింది. మరో హీరోయిన్ చిత్ర శుక్లా కూడా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రానికి మరో బలం కమెడియన్ సత్య కామెడీ. తన టైమింగ్ తో బాగా నవ్వించాడు. మిగిలిన ప్రధాన పాత్రధారులు రాజీవ్ కనకాల, హర్ష అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమాలో కొన్ని చోట్ల కామెడీ బాగా వర్కౌట్ అయినా.. ప్లే మాత్రం ఇంట్రస్టింగ్ గా సాగలేదు. అయితే, దర్శకుడు తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మరియు సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో స్లోగా సాగుతూ బోర్ కొడుతొంది. ముఖ్యంగా సెటప్, సీన్స్ మరియు స్క్రీన్ ప్లే అన్నీ పక్కా రొటీన్ గానే సాగుతాయి. ఇక హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని లవ్ సీన్స కూడా పూర్తిగా ఆకట్టుకోవు. పైగా కథకు బలం పెంచలేని లవ్ అండ్ అవసరం లేని సీన్స్ ఎక్కువైపోయాయి.

అలాగే అజయ్ మేక పిల్లను పెళ్లి చేసుకునే సీన్ లాంటి కొన్ని సిల్లీ సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారు. సెకెండ్ హాఫ్ లో చాల సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ప్లస్ అయ్యేది. మెయిన్ గా స్లో నెరేషన్ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ గా నిలుస్తోంది.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడిగా మణికాంత్ పర్వాలేదనిపించినా పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు. అలాగే ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే పై కూడా బాగా వర్క్ చెయ్యాల్సింది. చాల ల్యాగ్ సీన్స్ తగ్గేవి. సంగీత దర్శకుడు భైరవ అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాల వరకు బోర్ తగ్గేది. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

 

‘తెల్లవారితే గురువారం’ అంటూ వచ్చిన ఈ సినిమా కొన్ని చోట్ల బాగానే పర్వాలేదనిపిస్తోంది. ముఖ్యంగా సత్య తన కామెడీతో ఆకట్టుకున్నాడు. అయితే కథనం ఆకట్టుకోకపోవడం, ఆసక్తిగా సాగని ప్రేమ సన్నివేశాలు మరియు బలమైన సంఘర్షణ లేని ఫ్యామిలీ సీన్స్ మరియు రొటీన్ డ్రామా.. వంటి అంశాలు ఈ సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. మొత్తం మీద ఈ సినిమా ఏ వర్గం ప్రేక్షకులను బలంగా ఆకట్టుకోదు.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు