సమీక్ష : తిమ్మరుసు – పర్వాలేదనిపించే సస్పెన్స్ థ్రిల్లర్ !

Thimmarusu movie review

విడుదల తేదీ : జూలై 30, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  3/5

నటీనటులు : సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ, వైవా హర్ష, రవిబాబు, అంకిత్ మరియు అజయ్

దర్శకుడు: శరణ్ కొప్పిశెట్టి

నిర్మాతలు : మహేష్ కోనేరు, సృజన్ యరబోలు
సంగీత దర్శకుడు : శ్రీచరణ్ పాకాల

ఎడిటర్: తమ్మి రాజు


సత్యదేవ్‌ హీరోగా వచ్చిన కొత్త చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ సినిమా ట్యాగ్‌లైన్‌. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో నిర్మాతలు మహేశ్‌ కోనేరు, సృజన్‌ సి ఈ సినిమాని నిర్మించారు. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ :

అరవింద్ అనే క్యాబ్ డ్రైవర్ (చైతన్య)ను ఎవరో హత్య చేస్తారు. కానీ వాసు అనే కుర్రాడ్ని ఆ హత్యలో ఇరికించి ఎనిమిదేళ్ళు శిక్ష విధిస్తారు. ఆ కేసును లాయర్ రామచంద్ర (సత్యదేవ్) మళ్లీ రీఓపెన్ చేసి.. వాసు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో రామచంద్రకి ఎదురైన సంఘటనలు, సమస్యలు ఏమిటి ? రామచంద్ర వాటిని ఎలా ఎదుర్కొన్నాడు ? ఈ ప్రాసెస్ లో అతని లవర్ లాయర్ అను (ప్రియాంక), సుధాకర్ (బ్రహ్మజీ) అతనికి ఎలాంటి సాయం చేశారు ? ఇంతకీ క్యాబ్ డ్రైవర్ ను హత్య చేసింది ఎవరు ? అసలు క్యాబ్ డ్రైవర్ అరవింద్ కి, రామచంద్రకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సత్యదేవ్ వన్ మ్యాన్ షోతో నడిచిన ఈ సినిమాలో.. సత్యదేవ్ లాయర్ రామచంద్ర పాత్రలో చక్కగా నటించాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో సత్యదేవ్ చాలా బాగా నటించి మెప్పించాడు. ఇక హీరోయిన్ గా నటించిన ప్రియాంకకు పెద్దగా స్కోప్ లేదు. అయితే ఉన్నంతలో ఆమె తన క్యూట్ లుక్స్ లో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది.

కీలక పాత్రల్లో నటించిన అజయ్, చైతన్య, బాగానే నటించారు. అక్కడక్కడా తన కామెడీతో బ్రహ్మజీ ఆకట్టుకున్నాడు. అలాగే వాసు పాత్రలో నటించిన వ్యక్తి, మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ఇక దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని సస్పెన్స్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సస్పెన్స్ సీన్స్ మరియు విలన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ బాగుంది. చివర్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాని ముగించడం కూడా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సినిమా సాగితేనే.. ఆడియన్స్ ను ఆకట్టుకోగలం. అయితే, ఈ సినిమాలో అలాంటి అంశాలు ఉన్నప్పటికీ.. కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. అయితే, దర్శకుడు సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, ఓవరాల్ కొన్ని చోట్ల లాజిక్స్ వదిలేశారు.

దీనికి తోడు మెయిన్ గా సినిమాలో ఇంట్రసింగ్ ప్లేను బిల్డ్ చేయలేకపోయారు. సినిమాలో మెయిన్ క్యారెక్టైజేషన్స్ ఇంకా ఎఫెక్టివ్ రాసుకోవాల్సింది. అలాగే హారోయిన్ క్యారెక్టర్ కూడా సినిమాకి మైనస్ అయింది. పైగా ఆమె ట్రాక్ కూడా బలహీనంగా సాగుతోంది. పైగా కొన్ని సీన్స్ లో నాటకీయత ఎక్కువడంతో ఆ సీన్స్ సహజత్వం లోపించింది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ ఆయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే దర్శకుడు ఆకట్టుకునే ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేది.

తీర్పు :

న్యాయం చేయలేకపోయినా ధర్మాన్ని నిలబెట్టాలి అంటూ వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మరియు సస్పెన్స్ సీన్స్ తో ఆకట్టుకుంది. అయితే, కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, అలాగే కొన్ని సీన్స్ లో ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. అయితే సినిమాలో సత్యదేవ్ నటన, కొన్ని సస్పెన్స్ అంశాలు చాలా బాగున్నాయి. ఓవరాల్ గా సస్పెన్స్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

123telugu.com Rating :  3/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Review

Exit mobile version