విడుదల తేదీ : నవంబర్ 25, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: వరుణ్ ధావన్, కృతి సనన్, అభిషేక్ బెనర్జీ, దీపక్ డోబ్రియాల్ మరియు పాలిన్ కబక్
దర్శకుడు : అమర్ కౌశిక్
నిర్మాత: దినేష్ విజయన్
సంగీత దర్శకులు: సచిన్-జిగర్
సినిమాటోగ్రఫీ: జిషు
ఎడిటర్: సంయుక్త కాజా
సంబంధిత లింక్స్: ట్రైలర్
లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా నుంచి మంచి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి మరో సినిమా “తోడేలు”. బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి ప్రమోషన్స్ తో రిలీజ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వస్తే.. భాస్కర్(వరుణ్ ధావన్) ఓ సివిల్ ఇంజనీర్ కాగా ఓ రోడ్ ప్రాజెక్ట్ కోసం అరుణాచల్ ప్రదేశ్ వెళ్లాల్సి వస్తుంది. అయితే అక్కడ అనుకోని రీతిలో కొన్ని సంఘటనల తర్వాత ఓ తోడేలు కాటుకి గురవుతాడు. అయితే దీని తర్వాత నెమ్మదిగా అతడిలో కూడా ఆ తోడేలు లక్షణాలు కనిపించడం మొదలై తాను కూడా తోడేలులా మారిపోతాడు. అయితే దీనికి ట్రీట్మెంట్ కోసం వెటర్నరీ డాక్టర్ అంకిత(కృతి సనన్) దగ్గరకి అతన్ని తీసుకెళ్లగా.. ఇక ఇక్కడ నుంచి సినిమా ఎలా ఉంటుంది? మళ్ళీ తాను మనిషిలా మారగలడా? ఈ లక్షణాలు తనలో ఉండడం వల్ల తనకి ఎదురయ్యే సవాళ్లు ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో మొదటగా ఇంప్రెస్ చేసేది సినిమా కాన్సెప్ట్ అని చెప్పాలి. ఈ తరహా జానర్ లో మన ఇండియన్ సినిమా నుంచి చాలా తక్కువ సినిమాలే వచ్చినా ఇది డెఫినెట్ గా మంచి ప్రయత్నంగా నిలుస్తుందని చెప్పి తీరాలి. మరి ఈ చిత్రంలో ఈ యూనిక్ రోల్ ని ఎంచుకున్న వరుణ్ ధావన్ తన సాలిడ్ గా రక్తి కట్టించాడు. భాస్కర్ పాత్రలో నుంచి షేడ్స్ తో కనిపిస్తాడు.
ఓ పక్క ఆ పాత్రలో మంచి హ్యూమర్ పండిస్తూనే ఇంకోపక్క తోడేలు గా మారిన వ్యక్తిగా ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ని తాను కనబరిచాడు. డెఫినెట్ గా తన వర్క్ అయితే సినిమాలో మెప్పించి తీరుతుంది. అలాగే హీరోయిన్ గా వెటర్నరీ డాక్ గా కనిపించిన కృతి సనన్ క్యూట్ లుక్స్ తో మరియు డీసెంట్ నటనతో ఆకట్టుకుంటుంది.
అలాగే నటుడు అభిషేక్ బెనర్జీ మరో స్పెషల్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంటాడు. ఇలా నటీనటులు అయితే తమ బెస్ట్ ని అందించగా సినిమాలో మరికొన్ని హైలైట్స్ కోసం చెప్పుకున్నట్టు అయితే.. ఈ చిత్రంలో మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో పాటుగా ఫన్ కూడా ఆసక్తిగా సాగుతుంది. దీనితో అయితే ఆల్ మోస్ట్ సినిమా మంచి ఎంగేజింగ్ గా సాగుతుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో కొన్ని అంశాలు బాగా థ్రిల్ చేసినప్పటికీ పూర్తి సినిమా అదే విధంగా అయితే లేదని చెప్పి తీరాలి. చాలా చోట్ల సినిమా కాస్త స్లోగా బోరింగ్ గా కూడా అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో కాస్త నెమ్మదించినట్టు ఎక్కువగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ వరకు బాగానే అనిపిస్తుంది కానీ ఆ తర్వాత నుంచే నరేషన్ అంత ఇంట్రెస్టింగ్ గా కనిపించదు.
అలాగే చాలా చోట్ల నరేషన్ కూడా ఊహించే రేంజ్ లోనే అనిపిస్తుంది. అలాగే ఇలా కథనం నడుస్తున్న కొద్దీ ఆసక్తి మరింత సన్నగిల్లుతుంది. అలాగే వైలెన్స్ సీన్స్ కూడా కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ఇది అన్ని వర్గాల ఆడియెన్స్ కి నచ్చకపోవచ్చు.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో మంచి నిర్మాణ విలువలు కనిపిస్తాయని చెప్పొచ్చు. ఈ తరహా చిత్రాలకి మెయిన్ అయినటువంటి వి ఎఫ్ ఎక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే 3డి వెర్షన్ లో ఎఫెక్ట్స్ బాగున్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ మంచి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎడిటింగ్ అయితే ఇంకా బెటర్ గా చేయాల్సి ఉంది. కానీ తెలుగు డబ్బింగ్ నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.
ఇక దర్శకుడు అమర్ కౌశిక్ విషయానికి వస్తే.. తన వర్క్ పర్లేదని చెప్పొచ్చు. మంచి కాన్సెప్ట్ ని తీస్కొని ఆల్ మోస్ట్ ఎంగేజింగ్ నరేషన్ తో సినిమాని తనకు నడిపించాడు. అయితే తాను చెప్పాలి అనుకున్న మెసేజ్ బాగానే కన్వే అయ్యింది కానీ సెకండాఫ్ లో మాత్రం ఇంకా ఎక్కువ జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “తోడేలు” చిత్రం ఇటీవల కాలంలో ఓ మంచి కాన్సెప్ట్ తో కూడిన అటెంప్ట్ సినిమా నుంచి అయితే ఇది ఇంప్రెస్ చేసేలా ఉంటుంది. అలాగే వరుణ్ ధావన్ సాలిడ్ పెర్ఫామెన్స్ కొన్ని థ్రిల్ అంశాలు, ఎంటర్టైన్మెంట్ తో కూడిన నరేషన్ బాగుంటాయి. కాకపోతే సెకండాఫ్ లో అక్కడక్కడా నరేషన్ మినహాయిస్తే థియేటర్స్ లో ఈ చిత్రం ఈ వారాంతానికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team