విడుదల తేదీ : డిసెంబర్ 30, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: ఆది సాయి కుమార్, రియా సుమన్, బ్రహ్మాజీ
దర్శకుడు : శశికాంత్
నిర్మాత: కె.వి.శ్రీధర్ రెడ్డి
సంగీత దర్శకులు: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సంబంధిత లింక్స్: ట్రైలర్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “టాప్ గేర్”. ఈ ఏడాది తాను నటించిన మరో చిత్రం ఇది కాగా ఈ చిత్రం ఈరోజు థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వస్తే..సిద్ధార్థ్(మైమ్ గోపి) ఓ పెద్ద డ్రగ్ డీలర్ కాగా ఈ క్రమంలో తాను సింగపూర్ కి పారిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు. మరి ఈ ప్లానింగ్ లో డీల్ నిమిత్తం హైదరాబాద్ కి వస్తాడు. ఇక మరోపక్క అర్జున్(ఆది సాయికుమార్) అప్పుడే పెళ్లి చేసుకొని ఓ క్యాబ్ డ్రైవర్ గా లైఫ్ లీడ్ చేస్తాడు. అయితే అనూహ్యంగా తాను ఈ డ్రగ్ రాకెట్ లో చిక్కుకోగా నెక్స్ట్ తన భార్య ఆధ్య(రియా సుమన్) ని కాపాడుకోవడం కోసం ఆ క్రిమినల్స్ చెప్పినట్టు చెయ్యాల్సి వస్తుంది. మరి ఈ రాకెట్ నుంచి తాను ఎలా బయటకి వస్తాడు? తన భార్యని కాపాడుకోగలుగుతాడా? ఆ ముఠాని పట్టిస్తాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఆది సాయికుమార్ తన సినిమా సినిమాకి బాగా డెవలప్ అవుతూ వస్తున్నాడని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో కూడా ఓ క్యాబ్ డ్రైవర్ గా, ఓ భర్తగా మంచి ఎమోషన్స్ ని పండించాడు. తన లుక్స్ పరంగా కూడా డీసెంట్ గా కనిపించాడు. అలాగే నటి రియా సుమన్ కూడా మంచి పాత్రలో కనిపించి మెప్పించింది.
ఇక వీరితో పాటలుగా సినిమాలో సత్యం రాజేష్, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో అయితే కొన్ని అంశాల్లో సినిమా ఇంప్రెస్ చేస్తుంది. కొన్ని సీన్స్ మంచి ఇంట్రెస్ట్ గా సాగగా నెక్స్ట్ అయితే కొన్ని అంశాలు డీటెయిల్స్ చూపించడంలో అలాగే ట్విస్ట్ లు బాగున్నాయి. అలాగే డ్రగ్ డీలింగ్ అంశాలు పై సీన్స్ ఆసక్తిగా ఉండగా ఫస్టాఫ్ ఆసక్తిగా సాగుతుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ తరహా కొన్ని థ్రిల్లర్ చిత్రంలో అయితే లాజిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వీటిని బాగా హ్యాండిల్ చేస్తే మరింత ఆసక్తిగా ఉంటుంది కానీ ఈ చిత్రంలో లాజిక్స్ అయితే మిస్ అయ్యాయి. హీరో రోల్ ఓ టైం లో సాయం అందుకునే పరిస్థితి వస్తుంది కానీ దానిని మిస్ చేసారు.
అలాగే క్లైమాక్స్ కూడా అంత ఇంప్రెస్ చేసే రేంజ్ లో అనిపించదు. అలాగే సినిమా కథ కూడా అంత కొత్తగా ఏమీ కనిపించదు. అలాగే మరిన్ని సీన్స్ ని అయితే బెటర్ గా చేయాల్సి ఉంది. వాటిని ఇంకా ఆసక్తిగా కానీ మలచి మంచి డ్రామా క్రియేట్ చేసి ఉంటే బెటర్ థ్రిల్స్ వచ్చి ఉండేవి.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. హర్ష వర్ధన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాలో డీసెంట్ గా ఉంది అలాగే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. అలాగే డైలాగ్స్, ఎడిటింగ్ బాగున్నాయి.
ఇక దర్శకుడు శశికాంత్ విషయానికి వస్తే తాను డీసెంట్ వర్క్ ని అందించారని చెప్పాలి. తన స్టోరీ లైన్ రొటీన్ గానే ఉన్నా చాలా చోట్ల అయితే ఇంట్రెస్టింగ్ నరేషన్ ని తాను చూపించారు. అలాగే కొన్ని మైండ్ గేమ్ సీన్స్ ని బాగా డీల్ చేసారు. అయితే క్లైమాక్స్ పోర్షన్ ని కానీ ఇంకా కొన్ని సీన్స్ ని అయితే బెటర్ గా చేసి ఉంటే బాగుండేది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “టాప్ గేర్” చిత్రం డీసెంట్ థ్రిల్స్ ని అందిస్తుందని చెప్పొచ్చు. ఆది సాయి కుమార్ నటన మరింత మెరుగ్గా ఈ సినిమాలో కనిపించగా పలు సీన్స్ ఆసక్తిగా సాగుతాయి. అయితే దర్శకుడు చిత్రాన్ని ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే మరింత స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకునేది. ఓవరాల్ గా అయితే ఈ చిత్రం ఈ వారాంతానికి డీసెంట్ గా ఆకట్టుకుంటుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team