విడుదల తేదీ : మే 27, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు: టామ్ క్రూయిస్, జెన్నిఫర్ కన్నెల్లీ, మైల్స్ టెల్లర్, జోన్ హామ్, గ్లెన్ పావెల్, వాల్ కిల్మర్, చార్లెస్ పార్నెల్, లూయిస్ పుల్మాన్
దర్శకత్వం : జోసెఫ్ కోసిన్స్కి
నిర్మాత: జెర్రీ బ్రూక్‌హైమర్, టామ్ క్రూజ్, క్రిస్టోఫర్ మెక్‌క్వారీ మరియు డేవిడ్ ఎల్లిసన్
సంగీత దర్శకుడు: హెరాల్డ్ ఫాల్టర్‌మేయర్, లేడీ గాగా, హన్స్ జిమ్మెర్ మరియు లోర్న్ బాల్ఫ్
సినిమాటోగ్రఫీ: క్లాడియో మిరాండా
ఎడిటర్ : ఎడ్డీ హామిల్టన్
హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూయిస్ నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్స్ లో తన సినిమా “టాప్ గన్ మావెరిక్”. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ముఖ్య భాషల్లో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఆడియెన్స్ ని ఎంతవరకు థ్రిల్ చేసిందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వచ్చినట్టు అయితే నావీలో 30 ఏళ్ళకి పైగా అనుభవం సంపాదించుకున్న పీట్ మావెరిక్(టామ్ క్రూయిస్) తన వృత్తిని వదిలి ఇష్టం లేక కావాలనే తనకి వచ్చే ప్రమోషన్స్ అన్నిటినీ వదిలేసుకుంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు సడెన్ గా తన ఫ్రెండ్ నుంచి ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. ఈ కాల్ లో తాను ఒక పెద్ద మిషన్ నిమిత్తం కొంతమంది “టాప్ గన్” అనే గ్రాడ్యుయేట్స్ కి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈ ట్రైనింగ్ ఎందుకు దాని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి? ఈ క్రమంలో పీట్ కి ఎదురైన ఎమోషనల్ బాండింగ్ ఏంటి? ఇంతకీ తన ట్రూప్ తో చేసిన మిషన్ సక్సెస్ అవుతుందా లేదా అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై మిస్సవ్వకుండా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో స్టోరీ లైన్ సింపుల్ గానే ఉంటుంది కానీ దాన్ని అనుసరించి కనిపించే స్క్రీన్ ప్లే గాని యాక్షన్ గాని స్టన్నింగ్ గా వేరే లెవెల్లో ఉంటాయి. ముఖ్యంగా టామ్ క్రూయిస్ ఈ సినిమాలో మంచి యంగ్ గా ఒక బాధ్యతగల ఏవియేటర్ గా సాలిడ్ గా కనిపిస్తాడు.
ఇక తన నుంచి యాక్షన్ అంటే ఎంత ఊహించుకున్నా దానికి మించే టన్నుల్లో అందిస్తాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆడియెన్స్ ని అయితే కదిలిస్తాడు. అలాగే ఈ సినిమాలో టామ్ పై కనిపించే కొన్ని ఇంటెన్స్ సీరియస్ బ్లాక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడియెన్స్ చూపు తిప్పుకోని విధంగా ఉంటాయి.
అలాగే సినిమాలో ప్రతి యాక్షన్ బ్లాక్ విజువల్ ట్రీట్ ఇవ్వడమే కాకుండా ఆడియెన్స్ ని మంచి థ్రిల్ కి లోను చేస్తాయి. అలాగే టామ్ క్రూయిస్ సినిమాలు అంటే అత్యధికంగా యాక్షన్ కోసమే చూస్తారు కానీ ఇందులో వాటిని మించి మంచి ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
మొదట్లో చెప్పుకున్నట్టుగా ఈ సినిమాలో అంత క్లిష్టమైన స్టోరీ లైన్ అయితే కనిపించదు. ఒకవేళ ఒకసారికొత్త కథ సరైన ట్విస్టులు ఆశించి వెళ్లే ఆడియెన్స్ కి అయితే ఈ చిత్రం నిరాశ కలిగించవచ్చు.
అయితే సినిమాలో ఆడియెన్స్ ని కట్టిపడేసే యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి కానీ టామ్ క్రూయిస్ నుంచి కూడా ఆశించే వెళ్తే మరి మళ్ళీ నిరాశ తప్పదు. ఇక్కడ మాత్రం కాస్త అంచనాలు తక్కువ పెట్టుకుంటే మంచిది. అలాగే తన ఫ్రెండ్ నిక్ గూస్ మరో ఫ్రెండ్ నుంచి సన్నివేశాలు బెటర్ గా చూపించాల్సింది.
సాంకేతిక వర్గం :
టామ్ క్రూయిస్ లాంటి స్టార్ హీరో సినిమా అంటే ఇక ఆ సినిమా నిర్మాణ విలువలు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఫ్రేమ్ లో సాలిడ్ విజువల్ గాని సంగీతం కనిపిస్తుంది వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో కూడా నిర్మాతలు ఎక్కడాఅ తగ్గకుండా ఖర్చు పెట్టి చూపించారు. ఇక ఇలాంటి సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలవాల్సింది సినిమాటోగ్రఫీ ఈ వర్క్ ని క్లాడియో మరిండా సాలిడ్ గా చేసి చూపించాడు. అలాగే హెరాల్డ్ ఫాల్టర్‌మేయర్, లేడీ గాగా, హన్స్ జిమ్మెర్ మరియు లోర్న్ బాల్ఫ్ ల మ్యూజికల్ వర్క్ సూపర్బ్ గా వచ్చింది.
ఇక డైరెక్టర్ జోసెఫ్ కోసిన్స్కి విషయానికి వస్తే ఈ సినిమాకి మంచి వర్క్ ని తాను అందించాడని చెప్పాలి. సింపుల్ స్టోరీ లైన్ తాను తీసుకున్నా సాలిడ్ ఎమోషన్స్ మరియు మంచి యాక్షన్ ఎలిమెంట్స్ తో ఫిల్ చేసి ఆడియెన్స్ కి మంచి ట్రీట్ ని అందిస్తాడు. అయితే చిన్న చిన్న లూప్ హొల్స్ కరెక్ట్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా అయితే తన వర్క్ మాత్రం తప్పకుండా ఆడియెన్స్ ని మెప్పిస్తుంది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “టాప్ గన్ మావెరిక్” టామ్ క్రూయిస్ అభిమానులకి అలాగే మంచి యాక్షన్ థ్రిల్లర్స్ లవర్స్ కి గట్టి ట్రీట్ ని ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి గ్రిప్పింగ్ యాక్షన్ సీక్వెన్స్ లు ముఖ్యంగా ఎమోషన్స్ ఈ సినిమాలో ఆకట్టుకుంటాయి. అయితే కాస్త రొటీన్ ప్లాట్ లో ఉండే కథ, కేవలం టామ్ నుంచి యాక్షన్ సీక్వెన్స్ లను ఆశించి వెళ్లే వారికి మాత్రం ఈ సినిమా నిరాశ పరచొచ్చు వీటిని పక్కన పెడితే ఈ వారాంతానికి థియేటర్స్ లో ఈ సినిమా ఆడియెన్స్ కి డెఫినెట్ గా మంచి ట్రీట్ అందిస్తుంది.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team