విడుదల తేదీ : జూన్ 08, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: ఆంథోనీ రామోస్, డొమినిక్ ఫిష్‌బ్యాక్ మరియు ఇతరులు
దర్శకులు : స్టీవెన్ కాపెల్ జూనియర్
నిర్మాతలు: డాన్ మర్ఫీ, టామ్ డిసాంటో, లోరెంజో డి బొనావెంచురా, మైఖేల్ బే, మార్క్ వహ్రాడియన్ మరియు డంకన్ హెండర్సన్
సంగీత దర్శకులు: జోంగ్నిక్ బోంటెంప్స్
సినిమాటోగ్రఫీ: ఎన్రిక్ చెడియాక్
ఎడిటర్: జోయెల్ నెగ్రోన్ మరియు విలియం గోల్డెన్‌బర్గ్
సంబంధిత లింక్స్: ట్రైలర్
హాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న సెన్సేషనల్ ఫ్రాంచైజ్ లలో ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ కూడా ఒకటి. మరి ఈ ఫ్రాంచైజ్ నుంచి అవైటెడ్ గా వచ్చిన లేటెస్ట్ సినిమానే “ట్రాన్స్ఫార్మర్స్ – రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ “. ఇక ఇండియా లోనే కూడా మంచి బజ్ తో ఉన్న ఈ సినిమా ఎలా ఉందో అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం రండి.
కథ :
ఇక ఈ పార్ట్ స్టోరీ లైన్ లోకి వస్తే..యూనికాన్ అనే ఓ డార్క్ డెవిల్ స్పేస్ లో కాలం గుండా ప్రయాణించే ఓ ట్రాన్స్ వార్ప్ కీ కావాలని కోరుకుంటాడు. అయితే ఈ కీ ని కొన్ని భాగాలుగా విభజించి భూమిపై మాగ్జిమల్స్ అనే కొన్ని రోబోటిక్ బీస్ట్ ట్రాన్స్ఫార్మర్ లు దాచి కాపాడుతూ ఉంటాయి. మరి ఈ కీ విషయంలో యూనికాన్ చేరుకుంటాడా లేదా? ఈ కీ కోసం ఇంకా వేరే వాళ్ళు కూడా ఏమన్నా వెతుకుతున్నారా లేదా? ఈ క్రమంలో ఆప్టిమస్ ప్రైమ్ మరియు తన ఆటో బాట్స్ పాత్ర ఎలా ఉంటుంది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమా సిరీస్ లవర్స్ ఈ పర్టిక్యులర్ పార్ట్ కి బాగా ఎగ్జైట్ అయ్యారు. మెయిన్ గా గత ట్రాన్స్ఫార్మర్స్ సినిమాల్లో కంటే కొత్తగా బీస్ట్ ట్రాన్స్ఫార్మర్ బాగా ఎగ్జైట్ చేసాయి. మరి వీటిపై సీక్వెన్స్ లు గాని అలాగే వాటితో పాటుగా ఆటోబాట్స్ పై సీక్వెన్స్ లు ట్రీట్ ఇస్తాయి. అలాగే ఈ సిరీస్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లను యూనిక్ వే ప్రెజెంటేషన్ కోసం వెళ్లే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు మరి మరి వారిని కూడా ఈ చిత్రం డిజప్పాయింట్ చేయదు.
మెయిన్ గా సెకండాఫ్ లో ఆప్టిమస్ ప్రైమ్ పై సాలిడ్ సీక్వెన్స్ లు బాగుంటాయి. ఇక వీటితో పాటుగా సినిమాలో స్టన్నింగ్ విజువల్స్ స్లో మోషన్స్ సహా మ్యూజిక్ మిక్సింగ్ కూడా మంచి ఫీస్ట్ గా ఆడియెన్స్ కి అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రంలో ఆటో బాట్ మిరేజ్ ఆసక్తికర రోల్ కనిపిస్తుంది, తన కామెడీ టైమింగ్ గాని తనపై కొన్ని ఎమోషనల్ సీన్స్ గాని బాగున్నాయి.
నోహ ఎలెనా వాలెస్ తదితరులు మంచి పాత్రల్లో నటించారు. ఇక మరి బిగ్గెస్ట్ హైలైట్ ఏమిటంటే ఈ చిత్రంలో ఓ క్రెడిట్ సీన్ మరో యాక్షన్ ఫ్రాంచైజ్ కి కనెక్ట్ అయ్యి ఉందని చూపే హింట్ ఈ ఫ్రాంచైజ్ లవర్స్ కి అయితే వావ్ అనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో అనే కాకుండా ఆల్ మోస్ట్ ఈ తరహా ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్స్ అన్నీ కూడా భూమిని కాపాడాలనే కాన్సెప్ట్ లోనే ఉంటాయి. మరి ఇది కూడా అదే కోణంలో కనిపిస్తుంది. సో కొత్త పాయింట్ ఎప్పటిలానే లేదు. అలాగే సినిమా ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ బాగా బెటర్ గా ఉన్నట్టు అనిపిస్తుంది.
దీనితో మేకర్స్ ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే కూడ మరింత దృష్టి పెట్టి ఉంటే ఇంకాస్త ఎంగేజింగ్ గా సినిమా ఉంటుంది అని చెప్పాలి. అలాగే గత సినిమాలతో పోలిస్తే యాక్షన్ సీక్వెన్స్ లు మరీ అంత ఎక్కువ అయితే ఇందులో ఉండవు సో ఇదో చిన్న డిజప్పాయింట్మెంట్ అని చెప్పాలి.
ఇంకా ముందు సినిమాల్లో కనిపించిన కొన్ని బలమైన ఎమోషన్స్ కూడా ఇందులో తక్కువే ఉన్నాయి అనిపిస్తుంది. ఇక మరో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ట్రాన్స్ఫార్మర్స్ సిరీస్ లో ఆప్టిమస్ ప్రైమ్ కి ఏ లెవెల్ క్రేజ్ ఉందో అదే విధంగా మరో ఆటోబాట్ బంబుల్ బీ కి కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే దానిపై ఈ సినిమాలో సీక్వెన్స్ లు స్క్రీన్ స్పేస్ తక్కువే కనిపిస్తుంది. దీనితో ఫ్యాన్స్ ఈ విషయంలో డిజప్పాయింట్ కావచ్చు.
సాంకేతిక విభాగం :
ఈ సెన్సేషనల్ ఫ్రాంచైజ్ లో నిర్మాణ విలువలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ లో ప్రతి సినిమా కూడా ఎంత స్టన్నింగ్ విజువల్స్ అండ్ సౌండ్ మిక్సింగ్ లతో ఉంటాయో అదే రీతిలో అదిరే నిర్మాణ విలువలను ఈ సినిమా కలిగి ఉంది. ఇక దీనితో పాటుగా తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ బాగున్నాయి.
ఇక దర్శకుడు స్టీవెన్ కాపెల్ జూనియర్ విషయానికి వస్తే తన వర్క్ బాగుంది. కాకపోతే ఇంకా మంచి ఎమోషన్స్ గాని అలాగే యాక్షన్ ని దట్టించి ఉంటే ఈ చిత్రం మరో లెవెల్లో అనిపించేది. ఇప్పటికీ కూడా బాగాలేదు అని కాదు కానీ ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ అవైటెడ్ “ట్రాన్స్ఫార్మర్స్ – రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ ” ఈ ఫ్రాంచైజ్ మూవీ లవర్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంది. కొన్ని రొటీన్ ఫ్లాస్ మినహాయిస్తే ఈ సినిమా లవర్స్ సహా మంచి సై ఫై యాక్షన్ ఎలిమెంట్స్ కోరుకునేవారికి ఈ వారాంతంకి ఓసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team