సమీక్ష: తూ ఝూటి మెయిన్ మక్కర్ – ఆకట్టుకొనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్

సమీక్ష: తూ ఝూటి మెయిన్ మక్కర్ – ఆకట్టుకొనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్

Published on Mar 9, 2023 1:02 AM IST
Tu Jhoothi Main Makkar Hindi Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 03, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్, అనుభవ్ సింగ్ బస్సీ, డింపుల్ కపాడియా, బోనీ కపూర్, మోనికా చౌదరి, హస్లీన్ కౌర్

దర్శకుడు : లవ్ రంజన్

నిర్మాతలు: లవ్ రంజన్, అంకుర్ గార్గ్

సంగీత దర్శకులు: ప్రీతమ్

సినిమాటోగ్రఫీ: సంతాన కృష్ణన్ రవిచంద్రన్

సినిమాటోగ్రఫీ: అకివ్ అలీ, చేతన్ సోలంకి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, ఈ హోలీ సీజన్‌లో తూ ఝూటి మెయిన్ మక్కర్ అనే మరో రొమాంటిక్ కామెడీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లవ్ రంజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ కథానాయిక గా నటించింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

మిక్కీ(రణబీర్ కపూర్) ఢిల్లీలోని తన ఫ్యామిలీ బిజినెస్ ను చూసుకుంటాడు. అంతేకాక తన స్నేహితుడు మను డబ్బాస్ (అనుభవ్ సింగ్ బస్సీ) సపోర్ట్ తో సీక్రెట్ గా బ్రేకప్ బిజినెస్ ను కూడా నడుపుతున్నాడు. తన స్నేహితురాలు కించి (మోనికా చౌదరి)ని పెళ్లి చేసుకోబోతున్న మను దబ్బాస్, తన బ్రేకప్‌ కు సహాయం చేయమని మిక్కీని రిక్వెస్ట్ చేస్తాడు. మను మరియు కించి బ్యాచిలర్ పార్టీ కోసం మిక్కీ మరియు మను డబ్బాస్ స్పెయిన్‌కు బయలు దేరారు. ఈ పర్యటనలో, మిక్కీ కించి స్నేహితురాలైన టిన్ని (శ్రద్ధా కపూర్)ని కలుస్తాడు. చూసిన వెంటనే ప్రేమలో పడతాడు. టిన్ని మొదట్లో అయిష్టంగా ఉన్నప్పటికీ, నెమ్మదిగా మిక్కీని ప్రేమించడం ప్రారంభిస్తుంది. మిక్కీ మరియు టిన్ని పెళ్లి కోసం వారి కుటుంబాల నుండి ఆమోదం కూడా పొందారు. వీరిద్దరి మధ్య అకస్మాత్తుగా సమస్యలు తలెత్తుతాయి మరియు పెళ్లి కాన్సిల్ అవుతుంది. ఆ సమస్యలు ఏమిటి? వారిని ఆ సమస్యలు ఎలా ప్రభావితం చేశాయి? మిక్కీ మరియు టిన్ని వారి సమస్యలను పరిష్కరించారా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

తూ ఝూటి మెయిన్ మక్కర్‌ లో ఎంటర్టైనింగ్ పార్ట్ ఫ్యామిలీ డ్రామా. టైటిల్ కి తగ్గట్లుగా సినిమాలో లవ్ ట్రాక్ నడుస్తూనే, బ్యాక్ గ్రౌండ్ లో ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. సెకండాఫ్‌లో ఈ రెండు ఎలిమెంట్స్ చక్కగా బ్యాలెన్స్ చేయబడ్డాయి. సెకండ్ హాఫ్ చాలా వేగంగా నడుస్తుంది. ప్రధాన జంట మధ్య గొడవకి గల కారణం చాలా బాగుంది. ఆధునిక సంబంధాలపై ప్రభావం ను చూపిస్తుంది. సినిమా ప్రేక్షకులను అలరిస్తూనే, ప్రస్తుత సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో సన్నివేశాల్లో ప్రతిబింబిస్తుంది.

ఒక బాలీవుడ్ సినిమా సరైన చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ తో వచ్చి చాలా కాలం అయ్యింది. తూ ఝూటి మెయిన్ మక్కర్ ఆ శూన్యతను పూరించింది అని చెప్పాలి. ప్రతి పాటను అందంగా తెరకెక్కించారు. ఈ పాటలు సినిమా రేంజ్‌ని పెంచుతాయి. చూడటానికి అందంగా మాత్రమే కాకుండా, ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. రణబీర్ మరియు అతని ఫ్యామిలీ పాల్గొన్న క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. థియేటర్ల లో నుండి బయటికి వచ్చేప్పుడు ప్రేక్షకులు పెద్ద స్మైల్ తో బయటికి వస్తారు.

కథనం స్పెయిన్ నుండి ఇండియాకి మారినప్పటి నుండి, సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అప్పటి నుండి సినిమా వినోదాత్మకంగా మారుతుంది. ప్రేక్షకులను అలరించే, సర్ ప్రైజ్ చేసే అంశాలు సినిమాలో ఉన్నాయి. శ్రద్ధా కపూర్ నటన చాలా బాగుంది. కేవలం గ్లామర్ సన్నివేశాలకే పరిమితం కాకుండా తాను చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఆమె పర్ఫార్మెన్స్ మరియు డాన్స్ పరంగా రణబీర్‌తో పోటీ పడింది. ప్రధాన జంట.మధ్య కెమిస్ట్రీ బాగుంది.

ప్రస్తుత తరం హీరోలలో రొమాంటిక్ కామెడీ లకు బాగా సరిపోయే నటుడిగా రణబీర్ ప్రశంసించబడటానికి ఒక కారణం ఉంది. తూ ఝూటి మెయిన్ మక్కర్ సినిమా అందుకు నిదర్శనం. రణబీర్ కపూర్ ను వెండితెర పై చూడటం చాలా బాగుంది. అతని మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, లుక్స్, డ్యాన్స్ స్కిల్స్‌ని డైరెక్టర్ చాలా బాగా ఉపయోగించాడు. సాధారణంగా, రణబీర్ నటన చాలా ఈజ్ మోడ్ లో ఉంటుంది. రొమాంటిక్ కామెడీ ల విషయానికి వస్తే, రణబీర్ పీక్స్ లో పర్ఫాం చేస్తాడు. నటుడు నటన, ఎమోషనల్ మరియు ఫన్నీ సన్నివేశాలలో చాలా బాగా చేశాడు.

 

మైనస్ పాయింట్స్:

మొదటి గంట అనవసరం గా పొడిగించబడింది. మొత్తం స్పెయిన్ భాగం చాలా బోరింగ్‌గా ఉంది. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లోని కథనం ఏమాత్రం ఆకట్టుకోదు. ఇక్కడ స్క్రీన్ ప్లే మరింత మెరుగ్గా ఉండి ఉంటే, సినిమాని మరింత ఆసక్తికరంగా మార్చగలిగేది.

సినిమాలో లీడ్ పెయిర్ మధ్య ఒకటి కాదు చాలా మోనోలాగ్ సంభాషణలు ఉన్నాయి. ఈ సంభాషణలు కొన్ని చోట్ల బాగానే ఉన్నాయి, కానీ అవి కొంత సమయం తర్వాత చికాకు కలిగిస్తాయి. ఫస్ట్ హాఫ్ ఇంకాస్త క్రిస్పీగా ఉండొచ్చు.

 

 

సాంకేతిక విభాగం:

ప్రీతమ్ పాటలు అద్భుతంగా ఉన్నాయి. సినిమాకు మంచి వైబ్ ను కలిగిస్తాయి. ముఖ్యంగా తేరే ప్యార్ మెయిన్ మరియు తుమ్కా పాటలు పెద్ద స్క్రీన్‌పై చూడటానికి చాలా అందంగా ఉంటాయి. హితేష్ సోనిక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంతాన కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమా అంతా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి, పాటలను చాలా రిచ్ గా చిత్రీకరించారు. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది.

దర్శకుడు లవ్ రంజన్ విషయానికి వస్తే, అతను తు ఝూతి మైన్ మక్కర్‌తో రణబీర్ ను చూపించిన విధానం బాగుంది. కానీ, ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, అతను యూత్ లవ్ స్టోరీ మధ్య ఫ్యామిలీ డ్రామాని చొప్పించిన విధానం. తద్వారా చిత్రానికి మంచి డెప్త్ ఇచ్చింది. ఈ చిత్రంలో రణబీర్ మరియు శ్రద్ధా కపూర్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ఉన్నందున అవుట్‌పుట్ బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్ కి భారీ కరెక్షన్స్ అవసరం. అలాగే, మేకర్స్ సుదీర్ఘ సంభాషణలను తగ్గించడం పై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇది సినిమా మొత్తం పై ప్రభావితం చేసింది.

 

తీర్పు:

మొత్తం మీద, తూ ఝూటి మెయిన్ మక్కర్ చక్కటి ఎమోషన్స్ ను కలిగి ఉన్న ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ప్రేక్షకులను అలరించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. సినిమాలోని ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకుంటుంది. రణబీర్ మరియు శ్రద్ధా కపూర్ ల నటన ఆకట్టుకుంటుంది. ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ బాగుంది. అయితే స్లోగా సాగే ఫస్ట్ హాఫ్ ను మినహాయిస్తే, ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను థియేటర్లలో చూడవచ్చు.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు