” ఊ కొడతారా ఉలిక్కి పడతారా ” చిత్రంలోని పాటలు పేరుకి తగ్గట్టే ఉలిక్కి పడేలా ఉన్నాయి. గత వారం రోజులుగా ఈ చిత్రం గురించి ఒక్కొక్క ఆశర్యపరిచే విషయాలు విడుదల చేస్తున్నారు. మొదట సినిమా కోసం వేసిన గందర్వమహల్ సెట్ మేకింగ్ విడుదల చేసి ఆశ్చర్యానికి గురిచేసారు. ఈ చిత్రం నిన్న శిల్ప కళా వేదికలో ఆడియో విడుదల కార్యక్రమం జరుపుకున్నది,బొబో శశి సంగీతం అందించారు. నందమూరి బాలకృష్ణ మరియు మంచు మనోజ్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మి మంచు నిర్మించారు. ఈ చిత్రం ఆడియో ఆల్బమ్ లో 4 పాటలు మరియు ఒక ఇన్ స్ట్రుమెంటల్ ట్రాక్ ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రం లోని ఒక్కొక్క పాట ఎలా ఉన్నాయో చూద్దాం.
1. పాట : అనురాగమె హారతులైతె
పాడినవారు: కార్తీక్, అన్వేష
రచయిత : ఆర్. రాము
2. పాట : అబ్బబ్బా అబ్బబ్బా
పాడినవారు: జనని, న్రిత్య,రామీ,రమ్య ఎన్.ఎస్.కే, రీఠ
రచయిత : ఆర్. రాము
బొబో శశి స్వరపరిచిన అబ్బబ్బా అబ్బబ్బా అనే ఈ పాట యువతని చాలా ఆకట్టుకుంటుంది.
3 . పాట : హాయ్ రే హాయ్
పాడినవారు: దీప,కార్తీక్,రమ్య, రంజిత్, శాం, సెంథిల్, సోర్ముఖి
రచయిత : ఆర్. రాము
4 . పాట : అది అని ఇది అని
పాడినవారు: హరిచరణ్, ప్రశాంతిని
రచయిత : ఆర్. రాము
ఈ పాట ఈ చిత్రంలో హైలైట్ పాట అవుతుంది అనడంలో ఎ మాత్రం అనుమానం లేదు, ఈ మధ్య కాలంలో ఇలా విని ఆనందించగల పాట రాలేదు.
5. పాట: ప్రతి క్షణం నరకమే
పాడినవారు: రామీ,తుపకేఎస్, జి- అరుల్జ్
రచయిత : ఆర్. రాము
తీర్పు:
మనోజ్ ఎప్పడూ ధైర్యంతో కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు,ప్రతి చిత్రం లో ఏదో ఒక కొత్తదనం కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఆయన వేషధారణ మరియు చిత్రం పేరు కూడా జనం లో ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. బోబో శశి అందించిన సంగీతం చాలా బాగా వచ్చింది. “అబ్బబ్బ అబ్బబ్బ” మరియు “అది అని ఇది అని” పాటలు యువతను చాలా బాగా ఆకట్టుకోనున్నాయి. విద్య సాగర్ స్వరపరచిన “అనురాగమే హారతులాయే” చిత్రంలో మరో మెలోడి. ఈ చిత్ర ఆడియో నాకు చాలా బాగా నచ్చింది చిత్రం కోసం మరింత ఆత్రుతగా వేచి చూసేలా చేసింది.
అనువాదం : రాఘవ