సమీక్ష : ‘ఉనికి’ – స్లోగా సాగే బోరింగ్ ఎమోషనల్ డ్రామా !

సమీక్ష : ‘ఉనికి’ – స్లోగా సాగే బోరింగ్ ఎమోషనల్ డ్రామా !

Published on Jan 22, 2022 2:02 AM IST
Uniki Review In Telugu

విడుదల తేదీ : జనవరి 21, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: ఆశిష్ గాంధీ, చిత్రా శుక్లా, టీఎన్ఆర్, ‘రంగస్థలం’ నాగ మహేష్, అప్పాజీ అంబరీష, ప్రభావతి, టిక్ టాక్ దుర్గారావు తదితరులు

దర్శకత్వం : రాజ్‌కుమార్ బాబీ

నిర్మాత‌లు: బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి

సంగీత దర్శకుడు: పి. ఆర్ (పెద్దపల్లి రోహిత్)

ఛాయాగ్రహణం-కూర్పు: హరికృష్ణ

‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రా శుక్లా కాంబినేష‌న్‌లో ఎవర్‌గ్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందిన సినిమా ‘ఉనికి’. రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులును ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన సుబ్బ లక్ష్మి (చిత్రా శుక్లా) చిన్నప్పటి నుంచి కష్టపడి ఐఏఎస్ అవుతుంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా వస్తోంది. సమాజానికి, పేదవారికి సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చిన సుబ్బ లక్ష్మికి లోకల్ రౌడీలతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంతకీ ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏమిటి ? వాటిని ఆమె ఎలా అధిగమించింది ? అయితే, ఈ క్రమంలో ఆమె పై అటాక్ చేస్తారు. అసలు ఆమె ప్రాణాలు తీయాలని ప్లాన్ చేసింది ఎవరు ? మధ్యలో సుబ్బ లక్ష్మి (చిత్రా శుక్లా) కోసం అభి (ఆశిష్ గాంధీ) ఎందుకు ఎమోషనల్ అవుతుంటాడు ? ఆమెకు అభికి ఉన్న సంబంధం ఏమిటి ? చివరకు సుబ్బ లక్ష్మి తాను అనుకున్నది సాధించిందా ? లేదా ? అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ లో టీఎన్ఆర్ పాత్ర ద్వారా రివీల్ అయ్యే ట్విస్ట్ కూడా బాగుంది. ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. ఆశిష్ గాంధీ, చిత్రా శుక్లా, టీఎన్ఆర్, నాగ మహేష్ ఇలా అందరూ బాగానే నటించారు. ఆశిష్ గాంధీ, తన సీరియస్ లుక్ తో కొన్ని సన్నివేశాల్లో తన ముద్ర కనబరుస్తూ కొన్నిచోట్ల బాగానే సీరియస్ నెస్ క్రియేట్ చేశాడు.

ఈ సినిమాలో హీరోగా నటించిన ఆశిష్ గాంధీ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సినిమాలోనే మెయిన్ లీడ్ గా నటించిన చిత్రా శుక్లా తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది. ఆమె లుక్ కూడా చాలా బాగుంది. ఇక టీఎన్ఆర్, ‘రంగస్థలం’ నాగ మహేష్, అప్పాజీ అంబరీష, ప్రభావతి, టిక్ టాక్ దుర్గారావు మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్ గురించి. కొన్ని డైలాగ్స్ బాగా పేలాయి.

 

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలోని కొన్ని సీన్స్ సాధారణ ప్రేక్షకులకు కొంత వరకు ఆసక్తి కలిగించొచ్చు కానీ.. మిగిలిన వర్గాల వారితో పాటు సగటు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా రుచించదు. సినిమా నిండా సిల్లీ మెలో డ్రామాను మోతాదుకు మించి పెట్టి విసిగించారు. పైగా సినిమాలో చాలా సన్నివేశాలు పూర్తి సినిమాటిక్ గా అసలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ కలిగించకుండా సాగుతాయి. అసలు వాస్తవానికి పూర్తి దూరంగా సాగే ప్లేలో ఇక ఇన్ వాల్వ్ అయ్యే విధంగా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఎలా వస్తాయి.

కథనంలోని ప్రతి సన్నివేశం స్లోగా సాగుతూ అసలు కన్వీన్స్ కానీ విధంగా ముగుస్తోంది. దానికి తోడు ట్రీట్మెంట్ కూడా బోరింగ్ ప్లేతో సాగుతూ సినిమాలోని ఇంట్రెస్టింగ్ ను చంపేసింది. హీరో పాత్రకు సంబంధించిన ప్లాష్ బ్యాక్ ట్రాక్ కూడా అసలు బాగాలేదు.

అలాగే సినిమాలో సరైన ప్లో కూడా లేకపోవడం, మెయిన్ ట్రీట్మెంట్ లోని కంటెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, మరియు ప్రీ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం వంటి అంశాలు సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, కథాకథనాలను ఆకట్టుకునే విధంగా రాసుకోలేకపోయారు. ఇక సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఎడిటర్ పర్వాలేదు. నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

‘ఉనికి’ అంటూ స్ఫూర్తి కలిగించే ఓ మహిళా కలెక్టర్ కథతో మొదలైన ఈ సినిమా అంతిమంగా నిరాశపరిచింది. సినిమా ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, సినిమా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం, బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కానీ, కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. అలాగే కొన్ని సీన్స్, నటీనటుల పనితీరు పర్వాలేదు. ఐతే, ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం నిరుత్సాహ పరుస్తోంది

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

 

Click Here English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు