విడుదల తేదీ : నవంబర్ 04, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, వెన్నెల కిషోర్, ఆమని, కేదార్ శంకర్
దర్శకుడు : రాకేష్ శశి
నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం
సంగీత దర్శకులు: అచ్చు, అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: తన్వీర్ మీర్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
సంబంధిత లింక్స్: ట్రైలర్
అల్లు వారి హీరో అల్లు శిరీష్ నుంచి కాస్త గ్యాప్ తర్వాత రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రం “ఊర్వశివో రాక్షసివో”. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈరోజు డీసెంట్ బజ్ మధ్య అయితే రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వచ్చినట్టు అయితే శ్రీ కుమార్(శిరీష్) ఓ చిన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే మిడిల్ క్లాస్ అబ్బాయి మరో పక్క సిరి(అను ఇమ్మాన్యుయేల్) ఓ పెద్దింటి అమ్మాయి కాగా ఇద్దరూ డిఫరెంట్ ఆలోచనా భావం కలిగిన వాళ్ళు అయితే ఇద్దరి మధ్య పెళ్లి, రిలేషన్ షిప్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ ప్రపోజల్స్ పెట్టుకుంటారు. మరి ఇలాంటి ఇద్దరి మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుంది? అది పెళ్లి వరకు వెళ్తుందా లేక లివ్ ఇన్ రిలేషన్ లోనే ఆగుతుందా? అసలు చివరికి ఇద్దరిలో ఎవరి ఆలోచన సక్సెస్ అవుతుంది? ఇందులో ఫ్యామిలీ డ్రామా ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో మెయిన్ గా ఆకట్టుకునే అంశం అందులోని సినిమాకి బిగ్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది డైరెక్టర్ తీసుకున్న పాయింట్ ని చాలా ఎంగేజింగ్ గా చెప్పడం అని చెప్పాలి. ప్రస్తుత జెనరేషన్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చాలా నీట్ గా మంచి ఎమోషన్స్ మరియు ఫన్ తో మెప్పించే విధంగా నరేట్ చేసాడు. ఇక ఈ చిత్రంలో కనిపించే ప్రతి పాత్ర కూడా తమ నుంచి ది బెస్ట్ ఇచ్చారని చెప్పాలి.
మొదట హీరోయిన్ అను ఇమ్మానుయేల్ చాలా కాలం తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో కనిపించి మంచి నటనతో ఆకట్టుకుంటుంది. తన రోల్ కి ఆమె పర్ఫెక్ట్ గా సెట్టవ్వడమే కాకుండా తన గ్లామ్ సహా నటనతో సినిమాలో మంచి హైలైట్ గా నిలిచింది. ఇక అలాగే నటులు సునీల్ మరియు వెన్నెల కిషోర్ ల నుంచి కామెడీ పరంగా చాలా కాలం కిందట చూసిన వారిని మళ్ళీ ఈ చిత్రంలో చూడొచ్చు. వారి నుంచి కనిపించే సన్నివేశాలు హిలేరియస్ గా మంచి ఫన్ ని జెనరేట్ చేస్తూ ఆసక్తిగా ఉంటాయి. అలాగే ఆమని, కేదార్ శంకర్ లు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు.
ఇక చివరగా సినిమాలో మెయిన్ హైలైట్ శిరీష్ ఇచ్చిన పెర్ఫామెన్స్ అని చెప్పాలి. తన గత చిత్రాలని ఈ చిత్రంతో పోలిస్తే తన నటనలో చాలా పరిణితి కనిపిస్తుంది. ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ కూడా మంచి ఇంప్రూవ్ కాగా కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ లో అయితే సిరీస్ చాలా బాగా నటించాడు. అలాగే హీరోయిన్ తో కెమిస్ట్రీ సీన్స్ కూడా సినిమాలో బాగున్నాయి.
రెండు డిఫరెంట్ అంశాల్లో స్ట్రగుల్ అయ్యే మిడిల్ క్లాస్ అబ్బాయిగా తాను మాత్రం చాలా క్లాస్ పెర్ఫామెన్స్ ని అయితే ఇచ్చేసాడు. ఈ సినిమాలో తన రోల్ అయితే తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇంకా సినిమాలో విజువల్ గా సాంగ్స్, ఎంటర్టైనింగ్ గా సాగే కథనంలు ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో థీమ్ మరీ కొత్తదానిలా అనిపించదు కానీ దాదాపు తెలిసినట్టుగానే ఉంటుంది. అలాగే చాలా సీన్స్ ని అయితే మరింత బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే ఇంకా వాటి తాలూకా ఇంపాక్ట్ మరింత అందంగా వచ్చి ఉండేది. అలాగే పలు సీన్స్ లో అయితే లవ్ స్టోరీ ని కామెడీ ట్రీట్మెంట్ పక్కదారి పట్టించినట్టు అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో అక్కడక్కడ కథనం అంత ఎంగేజింగ్ గా అనిపించదు. అలాగే మెయిన్ లీడ్ మధ్య కొన్ని కీలక సీన్స్ ని కూడా మరింత ఆసక్తిగా మలచి ఉంటే బాగుండేది.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సాంగ్స్ సహా సినిమా అంతా మంచి విజువల్స్, సెటప్ తో కనిపిస్తాయి. ఇక సంగీత దర్శకులు అచ్చు – అనూప్ రూబెన్స్ ల ఇచ్చిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు బాగున్నాయి. అలాగే డైలాగ్స్ మాత్రం బాగా వర్క్ అయ్యాయి. కామెడీ సహా ఎమోషనల్ డైలాగ్స్ కూడా సినిమాలో ఎఫెక్టీవ్ గా అనిపిస్తాయి.తన్వీర్ మీర్ సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్ గా ఉంది. అలాగే కార్తీక్ ఎడిటింగ్ నీట్ గా ఉంది.
ఇక దర్శకుడు రాకేష్ విషయానికి వస్తే ఈ సినిమా విషయంలో తాను డెఫినెట్ గా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ప్రెజెంట్ జెనరేషన్ లో ఓ కీలక పాయింట్ ని పట్టుకొని కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ని చాలా వరకు బ్యాలన్స్ చేస్తూ నరేట్ చేసిన విధానం బాగుంది. అయితే మరికొన్ని సీన్స్ పై కొద్దిగా జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా అయితే ఈ చిత్రం ఫలితంలో దర్శకుడుకి మంచి క్రెడిట్ ఇవ్వాలి.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే “ఊర్వశివో రాక్షసివో” అనే ఈ చిత్రం సైలెంట్ గానే అనౌన్స్ అయ్యి రిలీజ్ కి వచ్చినా చిత్రంలో అయితే మంచి కంటెంట్ ఉందని చెప్పొచ్చు. ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగే కథనం, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి. అలాగే శిరీష్ నుంచి బెస్ట్ పెర్ఫామెన్స్, అను నటన, సునీల్ – వెన్నెల కిషోర్ లాంటి నటులు నుంచి చాలా కాలం తర్వాత మంచి సీన్స్ తో ఆకట్టుకునే నరేషన్ తో ఈ రోమ్ కామ్ ఎంటర్టైనర్ నడుస్తుంది. సెకండాఫ్ లో అక్కడక్కడా కొన్ని అంశాలు మినహాయిస్తే దర్శకుడు రాకేష్ వర్క్ ని ఈ వారాంతానికి థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team