పాటల సమీక్ష : V (నాని, సుధీర్ బాబు)

పాటల సమీక్ష : V (నాని, సుధీర్ బాబు)

Published on Sep 3, 2020 11:26 PM IST

మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో తెరకెక్కిన “వి” చిత్రం యొక్క ఆడియో మొత్తం బయటికి వచ్చేసింది. అయితే అమిత్ త్రివేది స్వరపరిచిన ఈ ఆల్బమ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

 

పాట : వస్తున్నా వచ్చేస్తున్నా

విశ్లేషణ: మొదటి పాట వస్తున్నా వచ్చేస్తున్నా, ఇది మీరు విన్న మరు క్షణం మీ మనస్సుకు హత్తుకునేలా ఉంటుంది. ఈ పాటలో వెంటాడే థీమ్ ఉంది, అమిత్ త్రివేది చేత ఈ పాట చక్కగా కంపోజ్ చేయబడింది. శ్రేయా ఘోషల్ రాగం ఈ పాటకి హైలెట్ అని చెప్పాలి. ఆమె పాడిన విధానం లో శృంగారం, కోరిక మరియు చాలా భావోద్వేగాలను చక్కగా తన గొంటుతో పలికించారు. ఈ పాట ఆర్కెస్ట్రా చాలా బావుంది, విన్న వెంటనే కిక్ ఇస్తుంది. ఈ చిత్రం విడుదల అయిన అనంతరం పెద్ద హిట్ అవుతుంది.


పాట : రంగా రంగేలి

విశ్లేషణ: ఆల్బమ్ లోని రెండవ పాట యాసిన్ నీజర్ మరియు నికితా గాంధీ పాడిన రంగా రంగేలి. ఈ పాట బీట్స్ మరియు శక్తివంతమైన గానం ఉన్న వేగవంతమైన పాట. నికితా గాంధీ గానం కాకుండా పెద్దగా మాట్లాడటానికి ఏమి లేదు. అయితే తెర పై విజువల్స్ చూసిన తర్వాత ఈ పాటకి ఎక్కువగా ఆదరణ రావొచ్చు.

పాట : మనసు మరి

విశ్లేషణ: ఆల్బమ్ లోని మూడవ పాట మనసు మరి, ఇది చాలా ఉత్తమ మైన పాట. టెక్నో బీట్స్ తో కూడిన రొమాంటిక్ ట్రాక్, ఈ పాట వినగానే మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అమిత్ త్రివేది వాయిస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది నూతనంగా, కవితాత్మకంగా అదే సమయం లో వెంటాడే విధంగా ఉంటుంది. ఈ పాట విజువల్స్ బాగుంటే మరొక స్థాయికి చేరుతుంది.


పాట : టచ్ మీ నౌ

విశ్లేషణ: ఈ ఆల్బమ్ లో నాల్గవ మరియు చివరి పాట టచ్ మి నౌ. అమిత్ త్రివేది ఈ పాటకి హై లెవెల్ లో బీట్స్ ఇచ్చాడు. అంతేకాక శార్వి యాదవ్ పడే ఎనర్జిటిక్ గానం సూపర్ అని చెప్పాలి.ఈ పాట డిస్కో అనుభూతిని కలిగి ఉంది. హుషారు రేకెత్తించే విధంగా ఈ పాట ఉంది. హుకప్ లైన్, టచ్ మి నౌ బాగా బ్యాలన్స్ గా, ప్రోగ్రామింగ్ కూడా చాలా బాగుంది. వినడానికి ఈ పాట మనోహరం గా ఉంటుంది.

 

తీర్పు:

మొత్తం మీద, V ఆల్బమ్ చాలా కొత్తగా, క్లాసికల్ టచ్ తో అద్భుతంగా ఉంది. ఈ చిత్రం యొక్క ఎమోషన్స్ మరియు మూడ్ పాటల ద్వారా తీసుకెళ్తుంది అని చెప్పాలి. అమిత్ త్రివేది అద్భుత సంగీతం అందించారు. ముఖ్యంగా మనసు మరి మరి వస్తున్నా వచ్చేస్తున్నా ఇప్పటికే హిట్ టాక్ సొంత చేసుకున్నాయి.అయితే ఇతర పాటలు కూడా ఇది ఫుట్ ట్యాపింగ్ ఆల్బమ్ అని చెప్పాలి. సినిమా ముగిసిన అనంతరం ఈ చిత్రం లోని పాటలను మరింత గా ఇష్టపడతారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు