సమీక్ష : వలస – అక్కడక్కడా ఆకట్టుకునే వలస కథలు !

సమీక్ష : వలస – అక్కడక్కడా ఆకట్టుకునే వలస కథలు !

Published on Jan 9, 2021 6:21 PM IST
Valasa movie review

విడుదల తేదీ : జనవరి 09, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.5/5

నటీనటులు : మనోజ్‌నందం, తేజు అనుపోజు, వినయ్‌ మహదేవ్‌, గౌరీ తదితరులు

దర్శకత్వం : పి సునీల్ కుమార్ రెడ్డి

నిర్మాత‌లు : యెక్కలి రవీంద్ర బాబు

సంగీతం : ప్రవీణ్‌ ఇమ్మడి

ఎడిట‌ర్‌ : నరేష్ కుమార్

కరోనా కారణంగాగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో వలస కార్మికుల జీవితాల ఎంతలా ఇబ్బంది పడ్డాయో మాటల్లో చెప్పలేము. చావైనా, బ్రతుకైనా సొంత ఊరే అనే ఆశతో ఇంటి దారి పట్టిన ఆ వలస బతుకులు బాధలు వ్యథలే ఈ సినిమా. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

 

కరోనా అల్లకల్లోలంలో లాక్ డౌన్ కారణంగా పక్క రాష్ట్రాల నుంచి పలు కుటుంబాలు తమ సొంత ఊళ్లకు ప్రయాణం మొదలుపెడతారు. ఈ క్రమంలో వాళ్లు దారి పొడుగున వారు అనుభవించిన కష్టాలు ఏమిటి ? అలాగే ఈ ‘ప్రయాణంలో ప్రేమజంట రజినీకాంత్ (మనోజ్ నందం) సావిత్రి (గౌరీ) మధ్య ఎలాంటి ప్రేమ నడిచింది ? చివరకు వీరి ప్రేమ ఎలా ముగిసింది ? మరియు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్న కుటుంబం చివరకు ఏమైపోతుంది ? లాంటి విషయాలు ఈ సినిమా.

 

ప్లస్ పాయింట్స్:

 

రియల్ స్టోరీల ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ ఎలిమెంట్స్ తో కొన్ని సన్నివేశాల్లో ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే సినిమాలో ప్రధానంగా లాక్ డౌన్ పరిస్థితులు… ఆ పరిస్థితుల తాలూకు సమస్యలు.. ఆ సమస్యలకు సంబంధించిన ట్రాక్స్.. అలాగే లాక్ డౌన్ తో ముడి పడిన సీన్స్ మరియు మిగిలిన ప్రధాన పాత్రలు.. అలాగే సినిమాలో కొన్ని ఎమోషనల్ గా నిలిచే సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకే ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

ఇక నిండు నెలల గర్భంతో గూడు చేరుకోవడానికి ఆరాటపడుతున్న పాత్ర, ప్రియుడితో మాట్లాడ్డానికి ఫోన్‌ దొరక్క తల్లడిల్లే ఓ ప్రేయసి పాత్ర, బతుకలేక చనిపోయే ఓ కుటుంబ కన్నీటి కష్టాలు ఇలా ఎన్నో కథలు, ఎన్నో బాధలు ఈ సినిమా. ఇక సినిమాలో హీరోగా నటించిన మనోజ్‌నందం బాగానే నటించాడు. అలాగే తేజు అనుపోజు, వినయ్‌ మహదేవ్‌, గౌరీ ఇంకా ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఎమోషనల్ సీన్లలో వీరి నటన చాలా బాగుంది.

 

మైనస్ పాయింట్స్:

 

కరోనా సమయంలో లాక్ డౌన్ సంఘటనల ఆధారంగా స్క్రిప్ట్ రాసుకుంటూ.. మళ్లీ ఆ నిజ జీవితాలన్ని రెండు గంటల సినిమా కథగా చెప్పాలి అంటే.. ఆ పరిస్థితులను, అప్పుడు ఇబ్బంది పడ్డ ఆ వ్యక్తుల తాలూకు మొత్తం ఆలోచనా విధానాన్ని ఇలా సమగ్రంగా అర్ధం చేసుకోవాలి. అలా అర్ధం చేసుకోవడం అంత తెలికేం కాదు. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయినా.. ఆ ఎమోషన్స్ ను తెర మీదకు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు.

అయితే దర్శకుడు రాసుకున్న స్క్రిప్ట్ మరియు కొన్ని కీలక సన్నివేశాలు బాగున్నప్పటికీ.. ఆ స్క్రిప్ట్ కి తగట్లు సరైన ఇంట్రస్టింగ్ ట్రీట్మెంట్ ను రాసుకోవడంలో సునీల్ కుమార్ రెడ్డి విఫలమయ్యారు. ఇక సినిమాలో అక్కడక్కడా స్లోగా సాగడం, సినిమాలో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, కొన్ని చోట్ల పేలవమైన కథనం, వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. వీటికి తోడు సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువైంది.

 

సాంకేతిక విభాగం:

 

సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. అలాగే నిర్మాణ విలువులు కూడా అసలు బాగాలేదు. సినిమాటోగ్రాఫర్ నరేష్ కుమార్ మడి వర్క్ పర్వాలేదు. అయితే అతని ఎడిటింగ్ మాత్రం ఆకట్టుకోలేదు. ప్రవీణ్ ఇమ్మడి సంగీతం కథ, కథనాలకు సంబంధం లేకుండా సాగింది. బావోద్వేగాలను మరో లెవెల్ తీసుకెళ్లడంతో అయన విఫలం అయ్యాడు. దర్శకుడిగా పీ సునీల్ కుమార్ రెడ్డి వలస చిత్రంతో మెప్పించలేదు.

 

తీర్పు:

 

ప్రభుత్వాల అంక్షల కారణంగా కరోనా కాలంలో వలస కార్మికుల కన్నీటి కష్టాలు కళ్లకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి సక్సెస్ అయినా.. ఒక సినిమా పరంగా చూసుకుంటే మాత్రం ఈ సినిమా ఆకట్టుకోదు. అయితే పలు మానవీయ కోణాలను తెరమీద ఆవిష్కరించే ప్రయత్నం అయితే దర్శకుడు చేశాడు. ఓవరాల్ గా ఒక సినిమాగా మాత్రం, ఈ సినిమా ఆకట్టుకోదు. కాకపోతే ఎమోషనల్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ నచ్చుతాయి.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు