సమీక్ష : వీర భోగ వసంత రాయలు – ఆకట్టుకోని సస్పెన్స్ థ్రిల్లర్

సమీక్ష : వీర భోగ వసంత రాయలు – ఆకట్టుకోని సస్పెన్స్ థ్రిల్లర్

Published on Oct 27, 2018 3:17 AM IST
 Veera Bhoga Vasantha Rayalu movie review

విడుదల తేదీ : అక్టోబర్ 26, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : నారా రోహిత్ , సుధీర్ బాబు , శ్రీ విష్ణు , శ్రీయ శరన్

దర్శకత్వం : ఇంద్రసేన

నిర్మాతలు : అప్పారావు బెల్లన

సంగీతం : మార్క్ కె రాబిన్

సినిమాటోగ్రఫర్ : నవీన్ యాదవ్

ఎడిటర్ : శశాంక్ మల్లి

నారా రోహిత్ , సుధీర్ బాబు , శ్రీ విష్ణు ,శ్రీయ శరన్ ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు ఇంద్రసేన తెరకెక్కించిన చిత్రం వీర భోగ వసంత రాయలు. ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..

 

కథ :

నారా రోహిత్ , సుధీర్ బాబు , శ్రీయ ముగ్గరు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ . ఈ ముగ్గరు డిఫ్రెంట్ మిస్టరీ కేసులను డీల్ చేస్తారు . అందులో ఒకటి ఇల్లు మిస్సైయినా కేసు మరొకటి క్రికెటర్లు ప్రయాణిస్తున్న ప్లేన్ హైజాక్ అయిన కేసు అలాగే మూడోవది కిడ్నాపింగ్ కేసు వీటిన్నింటికి కామన్ గా ఏమైనా సంబంధం వుంటుందా ? ఈ కేసులను ఈ ముగ్గురు చెందిచారా ? అసలు ఈ చిత్రం లో శ్రీ విష్ణు పాత్ర ఏంటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించిన నారా రోహిత్ ఆ పాత్రకు న్యాయం చేశారు. తన డీసెంట్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక నారా రోహిత్ కి సపోర్ట్ చేసే పాత్రలో నటించిన శ్రీయా కూడా తన పాత్ర పరిధి మేర బాగానే చేసింది. ఎస్ ఐ వినయ్ పాత్రలో నటించిన సుధీర్ బాబు తన నటనతో ఆ పాత్రను రక్తికట్టించాడు. కొత్త మేకర్ ఓవర్ లో కనిపించిన శ్రీ విష్ణు మంచి నటనను కనబరిచాడు.

ఇక దర్శకుడు ఇంద్రసేన రాసుకున్న పాయింట్ బాగుంది కానీ దాన్ని తెర మీద కు తీసుకరావడంలో పూర్తిగా విఫలం చెందాడు. ఇక చివరి 15 నిముషాల్లో వచ్చే సన్నీ వేషాలు ఆసక్తికరంగా వుంటూ ప్రేక్షుకులను ఎంగేజ్ చేయగలిగాయి.

 

మైనస్ పాయింట్స్ :

చిత్రాన్ని ఆసక్తికరంగా మొదలు పెట్టిన దర్శకుడు ఇంద్రసేనా ఆ తరువాత బోర్ కొట్టించడానికి కూడా ఎంతో సమయం తీసుకోలేదు. ఇక శ్రీ విష్ణు పాత్ర కూడా కొన్ని సందర్బాల్లో పరుదులు దాటి ప్రేక్షుకుడిని చికాకుకు గురిచేస్తుంది. చాలా చోట్ల లాజిక్ లేకుండా ఇష్టానుసారం వచ్చే సన్నివేశాలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది ఈచిత్రం.

ఇక ఈచిత్రానికి చూసిన తరువాత అసలు ఏం చూసి ఈసినిమా ను నారా రోహిత్ ,సుదీర్ బాబు లు ఒప్పుకొన్నారో అనే డౌట్ రాక మానదు. ఇక ఈ చిత్రానికి మరో మైనస్ ప్రొడక్షన్ వాల్యూస్. అతి తక్కువ బడ్జెట్లో లో క్వాలిటీతో తీసిన ఈ చిత్రం విజువల్స్ పరంగా కూడా త్రీవంగా నిరాశ పరుస్తుంది.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు ఇంద్రసేన మంచి పాయింట్ ను తీసుకున్న దాన్ని తెరమీదకు తీసుకురావడంలో పూర్తిగా తడపడ్డాడు. క్రైమ్ జోనర్ లో వచ్చిన ఇలాంటి చిత్రానికి ఆసక్తికర ట్విస్ట్ లతో పాటు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే చాల అవసరం. ఈ రెండు విషయాల్లో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. మార్క్ కే రాబిన్సన్ అందించిన సంగీతం ఆర్డినరీ గా వున్నా నేపథ్య సంగీతం తో ఆకట్టుకున్నాడు.

ఇక ఎడిటింగ్ కూడా అంతంతమాత్రంగానే వుంది. అనవసరమైన సన్నివేశాలను తొలిగిస్తే కొంచమైనా బాగుండేదేమో. ఛాయాగ్రహణం కొన్ని చోట్ల పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు మరి తీసికట్టుగా మారి చిత్రం యొక్క అవుట్ ఫుట్ ను ప్రభావితం చేసింది.

 

తీర్పు :

క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ వీర భోగ వసంత రాయలు ప్రేక్షకుడిని చాలా వరకు నిరాశకు గురిచేసి సహనాన్ని పరీక్షిస్తుంది. స్టార్ క్యాస్ట్ ఈ చిత్రాన్ని కాపాడాలని ప్రయత్నం చేసిన ఎంగేజింగ్ గా లేని కథనం దానికి తోడు అతి తక్కువ బడ్జెట్ చిత్రం కావడంతో వారి శ్రమ వృధా అయ్యింది. ఎంత మాత్రం మెప్పించని ఈ చిత్రానికి ఈ చిత్రానికి దూరంగా ఉంటేనే మంచిది.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు