సమీక్ష : వీర సింహారెడ్డి – ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్!

సమీక్ష : వీర సింహారెడ్డి – ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్!

Published on Jan 15, 2023 3:02 AM IST
Veera Simha Reddy Movie-Review-In-Telugu

విడుదల తేదీ : జనవరి 12, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్, నవీన్ చంద్ర, లాల్, అజయ్ ఘోష్ తదితరులు

దర్శకుడు : గోపీచంద్ మలినేని

నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్

సంగీత దర్శకులు: థమన్ ఎస్

సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ

ఎడిటర్: నవీన్ నూలి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘వీర సింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

వీర సింహా రెడ్డి (సీనియర్ బాలయ్య) రాయలసీమకి దేవుడు లాంటి మనిషి. పులిచర్ల ప్రాంతానికి అండగా నిలబడుతూ.. సీమ మంచి కోసం అనుక్షణం తప్పిస్తూ ఉంటాడు. అయితే, వీర సింహారెడ్డికి సవతి చెల్లి భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) అంటే ప్రాణం. ఆమె కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తాడు. కానీ భానుమతి మాత్రం వీర సింహారెడ్డి చావు కోసం ముప్పై ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు.. ఇస్తాంబుల్‌లో జయసింహా రెడ్డి (జూనియర్ బాలయ్య) తన తల్లి మీనాక్షి (హనీ రోజ్)తో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈషా (శ్రుతి హాసన్‌)తో జయసింహా ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో జయసింహాకి తన తండ్రి వీర సింహారెడ్డి గురించి తెలుస్తోంది. అసలు తండ్రి కొడుకులు ఎందుకు దూరం అయ్యారు ?, ప్రాణంగా ప్రేమిస్తే.. చెల్లి మీనాక్షి, వీరసింహా రెడ్డిని ఎందుకు చంపాలి అనుకుంటుంది?, చివరకు వీర సింహారెడ్డి కథ ఎలా ముగుస్తుంది ?, జయసింహా రెడ్డి తన తండ్రి కోసం ఏం చేశాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో నటించిన బాలయ్య బాబు ఎప్పటిలాగే తన నటనతో తన మాస్ యాక్టింగ్ తో ఈ సినిమాలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ లాంటి కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో తీవ్రమైన భావోద్వేగాలను పండించిన బాలయ్య నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. హీరోయిన్ గా నటించిన శ్రుతి హాసన్ తన గ్లామర్ తో తన పాత్రకు న్యాయం చేసింది.

హనీ రోజ్ నటన చాలా బాగుంది. ఆమె మంచి నటి అని ఈ సినిమా నిరూపించింది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో కీలకమైన తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ ముఖ్యమైన సీన్ లో ఆమె నటన చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన దునియా విజయ్ తన వైల్డ్ నటనతో మెప్పించాడు. ముఖ్యంగా తన నిజ స్వరూపం గురించి వరలక్ష్మి శరత్ కుమార్ కు చెప్పే సన్నివేశంలో దునియా విజయ్ నటన చాలా బాగుంది.

మరో కీలక పాత్రలో నటించిన నవీన్ చంద్ర కూడా ఆకట్టుకున్నాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. మొత్తమ్మీద బాలయ్య మాస్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాడు. బాలయ్య డ్యాన్స్ కూడా అదిరిపోయింది.

 

మైనస్ పాయింట్స్ :

 

గోపీచంద్ మలినేని మంచి మాస్ థీమ్ తీసుకున్నప్పటికీ.. స్లో నేరేషన్ తో, కొన్ని చోట్ల ఈ పవర్ ఫుల్ మాస్ డ్రామాను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. అయితే కొన్ని యాక్షన్ సన్నివేశాలతో దర్శకుడు ఆకట్టకునే ప్రయత్నం చేసినప్పటికీ.. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు.

ఇక కంటెంట్ మరియు ఆర్టిస్ట్ ల పరంగా చూసుకుంటే సినిమా మీద ప్రేక్షకుడికి పూర్తి స్థాయిలో ఇంట్రస్ట్ పుట్టించే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు మలినేని గోపీచంద్ ఆ ఎలిమెంట్స్ ను వదిలేసి అనవసరమైన సన్నివేశాలతో సినిమా రేంజ్ ను కొంత తగ్గించాడు. మొత్తానికి సినిమా నిండా యాక్షన్ ఉన్నా.. ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యే విధంగా మాత్రం, ఆ యాక్షన్ ఉపయోగపడలేదు. అలాగే, కథలోని మెయిన్ ఎమోషన్ కూడా సరిగ్గా ఎలివేట్ కాలేదు.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ మాత్రం బాగుంది. అయితే, ఆయన రాసిన స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల బాగాలేదు. సంగీత దర్శకుడు థమన్ ఎస్ అందించిన సంగీతం పర్వాలేదు. ఐతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో అక్కట్టుకునేలా ఉంది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

వీర సింహారెడ్డి అంటూ వచ్చిన ఈ పవర్ ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా బాగానే ఆకట్టుకుంది. నటసింహం బాలయ్య తన నటనతో సినిమా స్థాయిని పెంచారు. శ్రుతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్ ఈ సినిమాకి ప్లస్ అయ్యారు. కానీ, కొన్ని చోట్ల స్లో నేరేషన్, బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాలో యాక్షన్ అండ్ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. బాలయ్య ఫ్యాన్స్ కి ఈ సినిమా ఫుల్ మాస్ మీల్స్ లాంటిది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు