సమీక్ష : విద్యా బాలన్ “షెర్ని” – హిందీ చిత్రం ప్రైమ్ వీడియోలో

సమీక్ష : విద్యా బాలన్ “షెర్ని” – హిందీ చిత్రం ప్రైమ్ వీడియోలో

Published on Jun 20, 2021 12:50 PM IST
 Sherni Movie Review

విడుదల తేదీ : జూన్ 19,2021
123telugu.com Rating : 2.75/5

నటీనటులు : విద్యాబాలన్, ముకుల్ చద్దా, విజయ్ రాజ్, నీరజ్ కబీ, రాజేష్ బోనిక్

దర్శకుడు : అమిత్ మసర్కర్

నిర్మాత : జైద్ అలీ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా

సినిమాటోగ్రఫీ : రాకేశ్ హరిదాస్

సంగీతం : ఉత్కర్ష్ ఉమేష్ ధోటేకర్

ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు వెబ్ షోస్ మరియు డైరెక్ట్ డిజిటల్ సినిమాల రిలీజ్ రివ్యూల పరంపరలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం ”షెర్ని”. విద్యాబాలన్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ చిత్రం దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో తాజాగా డైరెక్ట్ రిలీజ్ అయ్యింది. మరి ఎలా ఉందో ఇపుడు సమీక్షలో తెలుసుకుందాం రండి..

 

కథ :

 

ఇక ఈ చిత్రం కథలోకి వెళ్తే బిజాస్ పూర్ అనే అడవి ప్రాంతంలో అటవీ వాసులు ఓ పులి మూలాన భయబ్రాంతులకు లోనవుతారు అప్పటికే ఒకరిని పులి చంపేస్తుంది. దీనితో దాని బారి నుంచి వారిని కాపాడాలని పులిని మచ్చిక చేసుకునేందుకు ఫారెస్ట్ ఆఫీసర్ గా విద్యా బాలన్(విద్యా విన్సెట్) నియమించబడుతుంది. అలాగే మరోపక్క అదే ప్రాంతానికి లోకల్ పొలిటీషియన్ కూడా ఎన్నికల్లో తనని గెలిపిస్తే ఆ పులి నుంచి వారిని ఆ గ్రామాన్ని కాపాడుతానని మాటిస్తాడు. కానీ అక్కడ నుంచే విద్యకి కూడా పరిణామాల చేత అనేక సమస్యలు స్టార్ట్ అవుతాయి. మరి వాటిని ఆమె ఎలా అధిగమిస్తుంది? ఇంతకీ ఆ పులి బారి నుంచి ఎవరు కాపాడుతారు అన్నవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

మొదటగా విద్యా బాలన్ వర్క్ చాలా ఇంప్రెస్ చేస్తుంది అని చెప్పాలి. ఇది వరకు తాను చేసిన గ్లామరస్ అండ్ బోల్డ్ రోల్స్ కి అతీతంగా ఇది మరింత కొత్తగా అనిపిస్తుంది. అలాగే ఈ ఫారెస్ట్ డ్రామాలో ఓ ఆఫీసర్ గా కూడా మంచి ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ను కనబరిచింది.

అలాగే ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నటించిన విజయ్ రాజ్ రోల్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీరితో పాటుగా సీనియర్ నటుడు శరత్ సక్సేనా రోల్ కూడా నీట్ గా ఉంది. వీరితో పాటుగా ఇతర పాత్రల్లో నటించిన వారు తమ పాత్రలకు తగ్గట్టుగా మంచి నటన కనబరిచారు.

ఇక వీటితో పాటుగా ఈ చిత్రంలో సెటప్ చేసిన ఫారెస్ట్ డ్రామా అందులో పొలిటికల్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అయితే స్టార్టింగ్ నరేషన్ కాస్త స్లో అనిపించినా తర్వాత మాత్రం గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో పెద్ద డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే అది ఇందులో నరేష్ అని చెప్పాలి. అక్కడక్కడా పర్లేదు కానీ ఓవరాల్ గా మాత్రం సినిమా బాగా స్లో ఉన్న భావన అనిపిస్తుంది. అలాగే సినిమా టైటిల్ కి తగ్గట్టుగా కథలోని కథనంతో జస్టిఫికేషన్ ఇవ్వడానికి కూడా చాలా సమయమే తీసుకుంటుంది దీనితో ఇది కూడా మరో మైనస్ గానే అనిపిస్తుంది.

ఇక అలాగే విద్యా బాలన్ రోల్ కూడా అంట ఇంట్రెస్ట్ గా సాగినట్టు ఓవరాల్ గా అనిపించదు. మరి ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు కాస్త రొటీన్ గానే అనిపిస్తాయి. సెకండాఫ్ కూడా అంత ఎఫెక్టీవ్ గా అనిపించదు, దీనితో ఓ సినిమా భావన కన్నా ఏదో డాక్యుమెంటరీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఎమోషన్స్ కూడా పెద్దగా అనిపించవు.

 

సాంకేతిక విభాగం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు నాచురల్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా టెక్నీకల్ టీం లో అయితే కెమెరా వర్క్ కి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. ఈ డ్రామాకి తగ్గట్టుగా మంచి విజువల్స్, లొకేషన్స్ కనిపిస్తాయి. కానీ ఈ చిత్రంలో మ్యూజిక్ మాత్రం అంత ఇంప్రెస్ చెయ్యదు. ఎడిటింగ్ కూడా ఇంకా బెటర్ గా ఉంటే బాగున్ను.

ఇక డైరెక్టర్ అమిత్ విషయానికి వస్తే తన వర్క్ అక్కడకక్కడ పర్వాలేదనిపిస్తుంది. తాను ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ బాగున్నా చాలా చోట్ల స్లో నరేషన్ తో నడిపారు. అలాగే మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కనుక జోడించి ఉంటే ఈ చిత్రం మరింత ఎఫెక్టీవ్ గా ఉండి ఉండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “షెర్ని” చిత్రంలో విద్యా బాలన్ సహా ఇతర నటీనటుల పెర్ఫామెన్స్ లు బాగుంటాయి అలాగే ఇందులో కనిపించే బ్యాక్ డ్రాప్ కూడా ఇంట్రెస్టింగ్ గా అక్కడక్కడా కూడా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ బాగా స్లోగా సాగే నరేషన్, పెద్దగా కనిపించని ఎమోషన్స్ నిరాశపరుస్తాయి. కానీ ఇలాంటి తరహా కాన్సెప్ట్ సినిమాలను చూడాలి స్లో గా ఉన్నా పర్వాలేదు అనుకునే వారు మాత్రం ఓసారి చూడొచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు