విడుదల తేదీ : జూన్ 03, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య, కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ తదితరులు
దర్శకత్వం : లోకేష్ కనగ్ రాజ్
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా అలాగే విజయ్ సేతుపతి అలాగే ఫహద్ ఫాజిల్ లు నటించిన సినిమా విక్రమ్. కాగా ఈ చిత్రం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
చెన్నైలో భారీగా డ్రగ్స్ నింపిన కంటైనర్ మిస్ అవుతుంది. ఈ డ్రగ్స్ సంతానం (విజయ్ సేతుపతి)కి చెందినది. కంటైనర్ కోసం అతను చాలా కలత చెందుతాడు. మరోపక్క ఓ గ్యాంగ్ ముసుగులతో ఆఫీసర్స్ ను చంపుతూ ఉంటారు. ఈ కేసును ఛేదించడానికి, అమర్ (ఫహద్ ఫాజిల్) సీన్‌లోకి తీసుకువస్తాడు. ఇంతకీ కర్ణన్ (కమల్ హాసన్) ఎవరు ?, అలాగే విక్రమ్ ఎవరు ? అతని బ్యాక్‌స్టోరీ ఏమిటి ? ఈ గ్యాంగ్ కి విక్రమ్ కి మధ్య కనెక్షన్ ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
కమల్ హాసన్ తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు రెండు వేరియేషన్స్ లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో మరియు తన డైలాగ్ డెలివరీతో కమల్ చాలా బాగా నటించాడు. మరో కీలక పాత్రలో నటించిన విజయ్ సేతుపతి కూడా తన నటనతోనే కాకుండా తన లుక్స్ తో కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు.
ఇక సినిమా ఎండ్ లో కీలకమైన పాత్రలో కనిపించిన సూర్య వైల్డ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఫహద్ ఫాజిల్ లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించారు. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆయన ఆకట్టుకున్నాడు.
అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ప్రతి ఒక్కరు తమ పాత్రలో ఒదిగిపోయారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ రాసుకున్న డ్రగ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ సీన్స్ కొన్ని బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
విక్రమ్ పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. గత తన సినిమాల శైలిలోనే లోకేష్ కనకరాజ్ ఈ సినిమాని కూడా నడిపారు.
పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్ నెస్ కనిపించదు. ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపిన ఆయన సెకెండాఫ్ ని మాత్రం మరీ సాగతీశారు. ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు.
ఇక కథను మలుపు తిప్పే ప్రదాన పాత్రలు అయినా, కమల్, సూర్య పాతలను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. సూర్య పాత్రకి ఇంకా బాగా జస్టిఫికేషన్ వచ్చి ఉండేది. ఓవరాల్ గా నవాబ్ లో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ లో కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వలేదు.
సాంకేతిక విభాగం :
లోకేష్ కనకరాజ్ రచయితగా పర్వాలేదనిపించినా, దర్శకుడిగా మాత్రం ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. సంగీత దర్శకుడు అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. కొన్ని సన్నివేశాల్లో నేపధ్య సంగీతం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ప్రతి సన్నివేశాన్ని కెమెరామెన్ బాగా విజువలైజ్ చేశారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లో కొన్ని సాగతీత సీన్స్ ట్రీమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలోని నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
విక్రమ్ అంటూ భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రంలో కమల్ హాసన్ నటన, సూర్య గెటప్ అండ్ సెటప్, అలాగే కొన్ని యాక్షన్ సీన్స్, మరియు క్లైమాక్స్ బాగున్నాయి. కానీ సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ లో ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వకపోవడంతో, సినిమా ఫలితం దెబ్బతింది. ఓవరాల్ గా కమల్ హాసన్ అభిమానులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team