ఓటిటి సమీక్ష : విక్రమార్కుడు ( ఆహాలో తెలుగు డబ్బింగ్ సినిమా)

ఓటిటి సమీక్ష : విక్రమార్కుడు ( ఆహాలో తెలుగు డబ్బింగ్ సినిమా)

Published on Jul 11, 2021 10:29 PM IST
The-Tomorrow-War Movie Review

విడుదల తేదీ : జూలై 09,2021
123telugu.com Rating : 2.75/5

నటీనటులు : విజయ్ సేతుపతి, సాయేశా, మడోన్నా సెబాస్టియన్, సురేష్ చంద్ర మీనన్

దర్శకుడు : గోకుల్

నిర్మాతలు : కాకర్లముడి రవీంద్ర కళ్యాణ్, డా. అప్పసాని సాంబశివరావు

సంగీత దర్శకుడు : సిద్ధార్ద్ విపిన్

విజయ్ సేతుపతి నటించిన జుంగా చిత్రం తమిళం లో 2018 లో విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తెలుగు లో తాజాగా విడుదల అయింది. ఈ చిత్రం విక్రమార్కుడు గా విడుదల అయింది. ఈ చిత్రానికి సంబంధించిన సమీక్ష ను ఇప్పుడు చూద్దాం.

 

కథ

విజయ్ సేతుపతి (జుంగా) స్తానిక బస్సు సర్వీసులో టికెట్ కలెక్టర్ గా పని చేస్తున్నారు. అయితే తన తండ్రి మరియు తాత గ్యాంగ్ స్టర్లు అని తెలిసిన తర్వాత విజయ్ సేతుపతి కూడా గ్యాంగ్ స్టర్ లా మారడానికి బయలు దేరుతాడు. అయితే ఈ క్రమం లో విజయ్ సేతుపతి ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు అతను ప్రవర్తించిన తీరు వెనుక ఉన్న కథాంశం మిగిలిన కథ అని చెప్పాలి.

 

ప్లస్ పాయింట్స్:

విజయ్ సేతుపతి సౌత్ ఇండియా సినిమాల్లో ప్రశంసలు పొందిన నటుల్లో ఒకరు. అయితే చమత్కారం అయిన బస్ కండక్టర్ గా మాత్రమే కాకుండా, అసాధారణం అయిన గ్యాంగ్ స్టర్ గా కూడా రాణించాడు అని చెప్పాలి. అయితే తన కామెడీ టైమింగ్ తో చేసిన కామెడీ చాలా బావుంది అని చెప్పాలి. అయితే రెండవ సగం ప్రారంభం కంటే బావుంది అని చెప్పాలి. అయితే పారిస్ అండర్ వరల్డ్ లోని హీరో సాహసాలు తర్వాతి భాగంలో కీలకం గా ఉంటాయి అని చెప్పాలి.

 

మైనస్ పాయింట్స్:

విజయ్ సేతుపతి నటించిన విక్రమార్కుడు చిత్రం తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించదు అని చెప్పాలి. తమిళ ఫ్లేవర్ ఉందని చెప్పాలి. ఇది స్థానిక ప్రేక్షకుల సున్నితత్వాలకు సరిపోదని చెప్పాలి. అయితే సీరియస్ గా ఉండాల్సిన కొన్ని సన్నివేశాలు చాలా కామెడీ తెప్పించేలా ఉన్నాయి. అయితే ఇది కథనాన్ని దెబ్బ తీస్తుంది అని చెప్పాలి. అయితే తెలుగు డబ్బింగ్ బావున్నప్పటికి, పాటలు సాహిత్యం చాలా తక్కువగా ఉందని చెప్పాలి. ఈ చిత్రం కామెడీ డ్రామా గా ఉందని చెప్పాలి.

 

సాంకేతికత:

దర్శకుడు గోకుల్ రాసిన కథలో తాజా కథనం ఉందని చెప్పాలి. కానీ అతని హాస్య విధానం స్పాయిల్ చేసింది అని చెప్పాలి. అయితే ఈ చిత్రం ప్రధాన సంఘర్షణ చాలా సిల్లీగా ఉందని చెప్పాలి. పాటల డబ్బింగ్ లో నాణ్యత తక్కువ గా ఉంది. సినిమాటోగ్రఫీ బావుంది అని చెప్పాలి.

 

తీర్పు:

విక్రమార్కుడు విజయ్ సేతుపతి నుండి చక్కని నటన తో కనబడే కామెడీ డ్రామా అని చెప్పాలి. అయితే కామెడీ ముక్కలు ముక్కలు గా ఉన్నదని చెప్పాలి. ఒక పాయింట్ తర్వాత మరొక్కటి మార్పు లేనిది గా ఉందని చెప్పాలి. అయితే ఈ చిత్రం కావాలని చూడటం కంటే, ఒక్కసారి గా టైమ్ ఉంటే చూడవచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు