సమీక్ష : వైఫ్, ఐ – స్లోగా సాగే బోరింగ్ రొమాంటిక్ డ్రామా !

సమీక్ష : వైఫ్, ఐ – స్లోగా సాగే బోరింగ్ రొమాంటిక్ డ్రామా !

Published on Jan 4, 2020 3:10 AM IST
 Wife,I review

విడుదల తేదీ : జనవరి 03, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

నటీనటులు :  అభిషెక్ రెడ్డి, గుంజన్ తదితరులు.

దర్శకత్వం : జి.ఎస్‌.ఎస్‌.పి.క‌ళ్యాణ్

నిర్మాత‌లు : జి.చ‌రితా రెడ్డి

సంగీతం :  వినోద్ యాజమాన్య

స్క్రీన్ ప్లే : జి.ఎస్‌.ఎస్‌.పి.క‌ళ్యాణ్

ఏడుచేప‌ల క‌థ అనే సినిమా టీజర్ తో యూట్యూబ్ లో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసి టెంప్ట్ రవిగా గుర్తింపు తెచ్చుకున్న అభిషెక్ రెడ్డి హీరోగా, గుంజన్ హీరోయిన్ గా జి.చ‌రితా రెడ్డి నిర్మాతగా ల‌క్ష్మి చ‌రిత ఆర్ట్స్ మ‌రియు జిఎస్ఎస్‌పికె స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో జి.ఎస్‌.ఎస్‌.పి.క‌ళ్యాణ్ ద‌ర్శ‌కుడిగా వచ్చిన చిత్రం “వైఫ్,ఐ”. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

వర్మ (అభిషేక్ రెడ్డి) వృత్తిరీత్యా ఒక ఆర్కిటెక్. అయితే తన భార్య కావ్య తప్పిపోయిన కేసుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని ఊహించిన సంఘటనల అనంతరం వర్మ జీవితం కొన్ని అనుకోని మలుపులు తిరుగుతుంది. ఇంతకీ అతని జీవితంలో జరిగిన సంఘటనలకు కారణం ఎవరు ? వర్మ కుటుంబ జీవితంలో జరిగింది ఏమిటి ? చివరికీ వర్మ తన భార్యతో కలుస్తాడా లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రాన్న చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో హీరోగా నటించిన అభిషేక్ రెడ్డి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మంచి ఈజ్ తో మంచి కామెడీ మాడ్యులేషన్ తో చాల సెటిల్డ్ గా నటించాడు. ప్రథమార్ధంలో పోలీసులకు అతనికి మధ్య వచ్చే సన్నివేశాల్లో కొన్ని ఫన్నీ సంభాషణలు బాగానే ఉన్నాయి. కావ్య పాత్రను పోషించిన హీరోయిన్, వికారమైన భార్యగా బాగా నటించింది. అలాగే హీరో ఫ్రెండ్ గా చేసిన వేణు కూడా మంచి నటనను కనబర్చాడు.

ఇక సెకెండ్ హాఫ్ లో అభిషేక్ మరియు మరో హీరోయిన్ గుంజన్ మధ్య వచ్చే రొమాంటిక్ పాట ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ పాటలో గుంజన్ అందచందాలను ప్రదర్శించడంలో మొహమాటమే లేకుండా శక్తివంచన లేకుండా కృషి చేసింది. ఇక ఇతర నటీనటుల విషయానికి వస్తే వాళ్ళు తమ పాత్ర పరిధి మేరకు నటించడానికి బాగానే ప్రయత్నం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రం ప్రధాన మైనస్ పాయింట్ ఏమిటంటే, కథాకథనాల్లో సరైన స్పష్టతే లేదు. చిత్రంలోని ప్రారంభ సన్నివేశాలు ఆమోదయోగ్యమైనవిగా అనిపించినప్పటికీ అవి కూడా లాజిక్ అండ్ ఇంట్రస్ట్ లేకుండా సాగుతాయి. పైగా గ్లామర్ మరియు స్కిన్ షోను ట్రైలర్ లో చూపించిన స్థాయిలో సినిమాలో కూడా ఆశించి వచ్చే వారు కూడా పూర్తిగా నిరాశ చెందుతారు.

కథనం కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. ఇక అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు గాని, అది ఎంతో కష్టపడి నవ్వించన్నట్టే ఉంటుందిగాని సహజంగా ఉండదు. ముఖ్యంగా దర్శకుడు కథలోని మెయిన్ కాన్ ఫ్లిట్ ను వదిలేసి, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం సినిమా ఫలితాన్ని పూర్తిగా దెబ్బ తీసింది.

అన్నిటికికంటే ముఖ్యంగా బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి సినిమా మీద అసలు ఇంట్రస్ట్ కలగకుండా చేశారు. మొత్తానికి దర్శకుడు సినిమాని ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా విఫలం అయ్యాడు.

 

సాంకేతిక విభాగం:

 

ఈ సినిమాలో సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్ తన కెమెరా పనితనాన్ని బాగానే చూపించాడు. సంగీత దర్శకుడు తన నేపధ్య సంగీతంతో సినిమాని కొంత నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఎడిటర్ సినిమాను ఇంకా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువులు పర్వాలేదు. దర్శకుడు పనితనం గురించి ఎక్కువుగా చెప్పుకోవటానికి ఏమిలేదు.

 

తీర్పు:

 

వైవాహిక జీవితాలు ఎలా నాశ‌నమైపోతున్నాయి.. భార్యాభర్త మధ్య ప్రేమ‌ స్థానంలో అసహనం, అసూయా లాంటివి ఎలా ప్రవేశిస్తున్నాయి.. అనే అంశాన్ని దర్శకుడు ఈ సినిమాలో చెప్పాలనుకున్నాడు అని మనకు మనమే అర్ధం చేసుకోవడం తప్ప.. సినిమాకి థీమ్ అంటూ ఆ థీమ్ కి తగ్గట్టు ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే లాంటివి అంటూ ఏవి ఉండవు. పైగా కథలో మెయిన్ కాన్ ఫ్లిట్ ను వదిలేసి దర్శకుడు అనవసరమైన మరియు ఆసక్తి లేని సీన్స్ తో సినిమాని ఆసాంతం నింపేశాడు. ఓవరాల్ గా ఈ చిత్రం ఏ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోదు.

 

123telugu.com Rating : 1.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు