సమీక్ష : రైటర్ పద్మభూషణ్ – గుడ్ మెసేజ్ తో సాగే ఎమోషనల్ డ్రామా !

సమీక్ష : రైటర్ పద్మభూషణ్ – గుడ్ మెసేజ్ తో సాగే ఎమోషనల్ డ్రామా !

Published on Feb 4, 2023 3:02 AM IST
Hunt Movie-Review-In-Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 03, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: సుహాస్, టీనా శిల్పారాజ్, గౌరీ ప్రియారెడ్డి, అశిష్ విద్యార్థి, రోహిణి తదితరులు

దర్శకుడు : షణ్ముక్ ప్రశాంత్

నిర్మాతలు: చంద్రు మనోహరన్

సంగీత దర్శకులు: శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్ శాఖమూరి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

సుహాస్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘రైటర్ పద్మభూషణ్’. కామిక్ ఫ్యామిలీ డ్రామా జానర్ లో షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ:

రైటర్ పద్మభూషణ్ (సుహాస్) విజయవాడలో లైబ్రేరియన్ గా జాబ్ చేస్తుంటాడు. పద్మభూషణ్ తండ్రి(ఆశిష్ విద్యార్ధి), తల్లి సరస్వతి(రోహిణి) అతనికి ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. ఐతే, పద్మభూషణ్ మాత్రం గొప్ప రైటర్ కావాలని కలలు కంటూ తొలి అడుగు అని ఒక బుక్ రాస్తాడు. పేరెంట్స్ కి తెలియకుండా అప్పుచేసి మరీ తన బుక్ ని పబ్లిష్ చేయిస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పద్మభూషణ్ లైఫ్ లోకి అతని మరదలు సారిక (టీనా శిల్పారాజ్) వస్తోంది. వీరిద్దరి పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. అసలు సారిక పద్మభూషణ్ ను ఎలా ప్రేమించింది?, ఈ మధ్యలో పద్మభూషణ్ జీవితంలో జరిగిన షాకింగ్ ట్విస్ట్ ఏమిటి ? ఇంతకీ పద్మభూషణ్ కల నెరవేరిందా ? లేదా? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఇంట్లోని ఆడవారికి ఇష్టాలను, అభిరుచులను గౌరవించాలి అనే కోణంలో దర్శకుడు షణ్ముక్ ప్రశాంత్ ఈ సినిమాలో అద్భుతమైన ఎమోషన్ తో పాటు గుడ్ ఫన్ ను కూడా చక్కగా చూపించాడు. మళ్లీ అంతలోనే ప్రధాన పాత్రల మధ్యనే నవ్వులను కన్నీళ్లను మరియు అభిమానాలతో కూడుకున్న ఆత్మాభిమానాలను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. మొత్తానికి సినిమాలో వాస్తవ పరిస్థితులు.. అలాగే సగటు మిడిల్ క్లాస్ భావోద్వేగాలు బాగున్నాయి.

షణ్ముక్ ప్రశాంత్ రాసుకున్న కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా బాగుంది. నటన విషయానికి వస్తే.. హీరోగా నటించిన సుహాస్ తన కామెడీ టైమింగ్ తో అండ్ తన ఎమోషనల్ యాక్టింగ్ తో బాగా నటించాడు. సినిమాలోని కోర్ ఎమోషన్ని సుహాస్ తన హావభావాలతోనే బాగా పలికించాడు. అలాగే హీరోయిన్ టీనా శిల్పారాజ్ కూడా చాలా బాగా నటించింది.

ఇక ఈ చిత్రానికి మరో బలం అశిష్ విద్యార్థి కామెడీ. ఆయన తన టైమింగ్ తో బాగా నవ్వించాడు. అలాగే నటి రోహిణి నటన సినిమాకే హైలైట్. గౌరీ ప్రియారెడ్డితో పాటు మిగిలిన ప్రధాన పాత్రధారులు అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో స్లోగా సాగుతుంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని లవ్ సీన్స కూడా రెగ్యులర్ గానే ఉంటాయి. దీనికితోడు దర్శకుడు కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా సీన్స్ ను రాసుకోవడంతో సినిమా రీచ్ పై కొంత ఎఫెక్ట్ పడొచ్చు.

పైగా కథకు బలం పెంచలేని లవ్ అండ్ ఫ్యామిలీ సీన్స్ ఎక్కువైపోయాయి. అలాగే కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తానికి షణ్ముక్ ప్రశాంత్ తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ను ట్రిమ్ చేసి.. కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఇంకా పెంచి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది.

 

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు షణ్ముక్ ప్రశాంత్ దర్శకుడిగా మంచి కథాంశంతో ఆకట్టుకున్నాడు. అలాగే ఆయన రాసుకున్న క్లైమాక్స్ కూడా బాగుంది. సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

రైటర్ పద్మభూషణ్ అంటూ వచ్చిన ఈ సినిమా.. మంచి మెసేజ్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషనల్ సీన్స్ తో మరియు కొన్ని కుటుంబ భావోద్వేగాలతో బాగానే ఆకట్టుకుంది. అయితే, ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ సీన్స్ బోర్ గా సాగడం, అలాగే కొన్ని చోట్ల ప్లే స్లో సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తోంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు