సమీక్ష : “యశోద” – మెప్పించే ఎమోషనల్ సస్పెన్స్ డ్రామా !

Yashoda Movie-Review-In-Telugu

విడుదల తేదీ : నవంబర్ 11, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: సమంత, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ తదితరులు

దర్శకుడు : హరి – హరీష్

నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్

సంగీత దర్శకులు: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: ఎం. సుకుమార్

ఎడిటర్: మార్తాండ్. కె. వెంకటేష్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

సమంత ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం యశోద. హరి హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. నేడు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

సమంత (యశోద) తన చెల్లి ఆపరేషన్ కోసం సరోగసికి ఒప్పుకుంటుంది. ఆర్ధిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్న పేద అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి సరోగసి తల్లిగా మారడానికి మధు (వరలక్ష్మి శరత్ కుమార్ ) అండ్ గౌతమ్ (ఉన్ని ముకుందన్) ఒప్పిస్తారు. ఈ క్రమంలోనే యశోద కూడా బిడ్డను కని ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. అయితే, దీని వెనుక ఏదో కుట్ర ఉంది అని యశోదకు అర్థం అవుతుంది. సరోగసి పేరుతో జరుగుతున్న అకృత్యాలు ఏమిటి ? అని తెలుసుకోవడానికి యశోద ఏం చేసింది ?, అసలు యశోద ఎవరు?, ఎందుకు ఇదంతా చేస్తోంది?, చివరకు సరోగసి పేరు మీద జరుగుతున్న అక్రమ వ్యాపారాన్ని ఎలా అరికట్టింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో యశోద పాత్ర‌లో నటించిన సమంత తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. తన పాత్రకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ చాలా బాగా నటించింది. ఫస్ట్ హాఫ్ లో అమాయక యువతిగా.. సెకండ్ హాఫ్ లో అగ్రెసీవ్ బాడీ లాంగ్వేజ్, డామినేట్ చేసే ఆమె యాక్షన్.. ఆమె పాత్రకు ఫర్ఫెక్ట్ గా సరిపోయాయి. పైగా చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తోనే సమంత కొన్ని భావోద్వేగ సన్నివేశాలను చాలా చక్కగా పడించింది.

ఇక విలన్ పాత్రలో కనిపించిన ఉన్ని ముకుందన్ తన పాత్రకు తగ్గట్లే తన లుక్స్ ను తన ఫిజిక్ ను చాలా బాగా మార్చుకున్నాడు. అలాగే మరో ప్రధాన పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచింది.

రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు తమ నటనతో మెప్పించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకులు హరి – హరీష్ రాసిన ఈ చిత్ర కథ కూడా బాగుంది. సినిమాలోని కొన్ని సంఘటనలు సమాజంలో జరుగుతున్న కొన్ని అక్రమాలను ఎత్తి చూపాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

వైవిధ్యమైన పాయింట్ తో దర్శకులు హరి – హరీష్ ఈ కథను రాసుకున్నప్పటికీ ఆసక్తికరమైన కథనంతో సినిమాని పూర్తి స్థాయిలో ఇంట్రెస్టింగ్ గా మలచలేకపోయారు. అక్కడక్కడ స్లోగా నడిచే సన్నివేశాలు కారణంగా ఈ సినిమా కొంత స్లో అనిపిస్తోంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ గా సాగాయి.

పోలీసులు ఇన్విస్టిగేట్ చేసే క్రమం పెరిగే కొద్ది చాలా ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉండాలి. కానీ ఈ చిత్రంలో చాలా తేలికపాటి ఇన్విస్టిగేషన్ తోనే ముగించడం అంతగా రుచించదు. అలాగే చాలా సీన్స్ లాజిక్ లెస్ గా సాగుతాయి. పైగా కొన్ని కీలక సీన్స్ ను చాలా సింపుల్ గా ఎండ్ చేశారు.

 

సాంకేతిక విభాగం :

 
దర్శకులు ఓ మంచి స్టోరీ ఐడియా తీసుకున్నారు గాని, ఆ ఐడియాకు తగ్గట్టు అంతే కొత్తగా ట్రీట్మెంట్ మాత్రం రాసుకోలేదు. సినిమాలో సప్సెన్స్ ఇంట్రస్ట్ పెంచే స్కోప్ ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ ని సింపుల్ గా హ్యాండిల్ చేశారు. మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే… మణిశర్మ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపధ్య సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫర్ పనితనం బాగుంది. సినిమా మూడ్ కి అనుగుణంగా దృశ్యాలని తెరకెక్కించారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ కథకు అవసరం లేని సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. ఇక సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

ముందు చెప్పుకున్నట్లు ఓ సోషల్ ఇష్యూకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ థీమ్ తీసుకున్నారు. అలాగే ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాలో గుడ్ ఎమోషన్స్, బెటర్ స్క్రిప్ట్, మరియు బెస్ట్ ఫీల్ ఉంది. అలాగే సమంత నటన ఈ సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తోంది. అయితే స్క్రీన్ ప్లే లో స్లో నెరేషన్, కొన్ని సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. కానీ, సినిమాలో కంటెంట్ అండ్ ట్రీట్మెంట్ బాగుంది. మొత్తమ్మీద ఈ చిత్రం మెప్పిస్తోంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version