సమీక్ష : యువరత్న – మాస్ ఆడియెన్స్ కు మాత్రమే

సమీక్ష : యువరత్న – మాస్ ఆడియెన్స్ కు మాత్రమే

Published on Apr 3, 2021 12:02 AM IST
Yuvaratna movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 01, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.5/5

నటీనటులు : పునీత్ రాజ్‌కుమార్, ప్రకాష్ రాజ్, సాయి కుమార్, సయేషా సైగల్, ధనంజయ

దర్శకత్వం : సంతోష్ ఆనంద్ రామ్

నిర్మాత‌లు : విజయ్ కిరాగండూర్

సంగీతం : ఎస్.ఎస్. థమన్

సినిమాటోగ్రఫీ : వెంకటేష్ అంగురాజ్

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వంలో అటు కన్నడ మరియు తెలుగులో ఈరోజే విడుదల కాబడిన చిత్రం “యువరత్న”. తెలుగులో డీసెంట్ బజ్ నడుమ విడుదల కాబడిన ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రం ప్రేక్షకులను ఎంత ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వెళ్లినట్టయితే గురుదేవ దేశముఖ్(ప్రకాష్ రాజ్)కి చెందిన కాలేజ్ లో ఓ నిరుపేద బ్రిలియెంట్ స్టూడెంట్ అయినటువంటి ఓ అమ్మాయి అనుకోకుండా ఆత్మహత్య చేసుకుంటుంది. దీనితో గురుదేవ్ అవినీతికి కేరాఫ్ అయిన విద్యాశాఖ మంత్రి(సాయి కుమార్)తో పోరాటం చేస్తాడు మరి ఈ క్రమంలోనే అర్జున్(పునీత్ రాజ్ కుమార్) ప్రకాష్ రాజ్ కు తోడుగా నిలబడతాడు. మరి ఇలా నిలబడ్డ అర్జున్ కి అతనికి సంబంధం ఏంటి? ఈ పోరాటంలో అర్జున్ విజయం సాధిస్తాడా?ఆమె ఎందుకు ఆత్మ హత్య చేసుకోవాల్సి వస్తుంది? తనకి ఏదన్నా బ్యాక్ డ్రాప్ రిలేటెడ్ గా ఉందా అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో మేజర్ హైలైట్ పునీత్ రాజ్ కుమార్ అనే చెప్పాలి తన ఎంట్రీ నుంచి సినిమా అంతా వన్ మాన్ షో గా నడుస్తుంది. ఆల్రెడీ పునీత్ మంచి టాలెంటెడ్ అని తెలిసిందే. మరి అవన్నీ తనకి వచ్చిన మెళుకువలు అన్ని కూడా ఇందులో కనిపిస్తాయి.

అంతే కాకుండా తన గత చిత్రాల్లో కంటే ఇందులో కనిపించే డిఫరెంట్ లుక్ కాస్త మాస్ అండ్ కొత్తగా ఉంటుంది. మరి అలాగే ప్రకాష్ రాజ్ కి తనకి నడిచిన కొన్ని ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. మాస్ ఆడియెన్స్ కు కావాల్సిన ఎలిమెంట్స్ కూడా చాలా మేర మాస్ మీల్స్ కావాలి అనుకున్న వారికి నచ్చుతాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో డ్రా బ్యాక్స్ మరియు లాజిక్ లేని అంశాలు కాస్త ఎక్కువే కనిపిస్తాయి. కథనం అంతా కూడా ఒక్క హీరో రోల్ పైనే కావాలని చొచ్చించినట్టు అనిపిస్తుంది. అలాగే మరో పెద్ద డ్రా బ్యాక్ హీరోయిన్ సాయేషా మరియు పునీత్ కు సరైన కెమిస్ట్రీ కానీ అందుకు దోహద పడే సీన్స్ కానీ సరిగా లేకపోవడం.

వీటితో పాటుగా కథ. కథలో ఎలాంటి కొత్తదనము కనిపించదు పైగా సబ్జెక్టుకు అవసరం లేని అనవసరపు సన్నివేశాలు యాడ్ చెయ్యడం మరో విసుగు తెప్పించే అంశం. క్లైమాక్స్ కూడా పెద్దగా కన్వీనెన్స్ గా ఉండదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాస్త అతిగా అనిపిస్తుంది. అంటే బాగా ఎక్కువ సౌండింగ్ తో ఓవర్ గా అనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రం సాంకేతిక వర్గంలో మొట్ట మొదటిగా చెప్పుకోవాల్సింది నిర్మాణ సంస్థ కోసం.. కేజీయఫ్ లాంటి సాలిడ్ సినిమా ఇచ్చిన హోంబలే వారు ఈ చిత్రానికి కూడా ఉన్నతమైన నిర్మాణ విలువలు అందించారు. థమన్ సంగీతం ఓవరాల్ గా ఈ సినిమాకి ఓకే అని చెప్పొచ్చు. వెంకటేష్ అనురాగ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ జ్ఞానేష్ మాటడ్ ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుణ్ణు అన్ని అనవసరపు సన్నివేశాలు కొన్ని స్లో మోషన్ షాట్స్, సెకండాఫ్ లో కొన్ని సీన్స్ కట్ చేసి ఉంటే బాగుండేది.

ఇక దర్శకుడు సంతోష్ విషయానికి వస్తే.. మొదట అంతా ఈ సినిమా ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుంది అనుకోవచ్చు కానీ మాస్ తో పాటు ఓ మంచి మెసేజ్ ను ఇచ్చే ప్రయత్నం తాను చేసాడు. ప్రస్తుత రోజుల్లో విద్యా విధానంపై తాను రాసుకున్న కోర్ లైన్ బాగుంది కానీ దాన్ని మాస్ ఎలిమెంట్స్ తో సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోవడం బాధాకరం. ఈ కమెర్షియల్ యాంగిల్ ను తాను కనుక మరో వెర్షన్ లో ప్రెజెంట్ చేసి ఉంటే అవుట్ పుట్ వేరేలా వచ్చి ఉండొచ్చు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే ఈ “యువరత్న”లో మెయిన్ లీడ్ పునీత్ తన వరకు మంచి ప్రయత్నం చేసాడు. తనలోని ఫుల్ మాస్ యాంగిల్ అలాగే అదిరే డాన్స్ సహా అన్నిటిలో మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. అలాగే పలు మాస్ ఎలిమెంట్స్ కూడా బాగుంటాయి కానీ ఈ సినిమా లైన్ కు దర్శకుడు చేసిన మెసేజ్ ప్రెజెంటేషన్ కు అంత కన్వీనెంట్ గా అనిపించవు. ఈ లాజిక్స్ పక్కన పెట్టి మాస్ ఎలిమెంట్స్ కోరుకునే వారికి అయితే ఈ సినిమాను ఓసారి ట్రై చెయ్యొచ్చు.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు