‘నాట్య మ‌యూరి’ బిరుదు అందుకున్న ఇంద్రాణి దావులూరి

సాంప్ర‌దాయ నృత్యక‌ళ‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న క‌ళాకారిణి ఇంద్రాణి దావులూరి అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకున్నారు. భార‌త‌దేశంలోనే ప్ర‌ఖ్యాత పుణ్య‌క్షేత్రమైన చిదంబ‌రం ఆల‌యంలో ఆమె నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇచ్చారు.

సాక్ష్యాత్తు న‌ట‌రాజ స్వామి జ‌న్మ‌స్థాన‌మైన చ‌దంబ‌రం ఆల‌యంలో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వడం త‌న అదృష్ట‌మ‌ని.. ఈమేర‌కు ఆల‌య క‌మిటీ త‌న‌ను నృత్య ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వాల్సిందిగా కోర‌డం జరిగింద‌ని ఇంద్రాణి పేర్కొన్నారు. ప‌లు వాయిద్యాల ధ్వ‌నుల‌ న‌డుమ ఆమె ఏక‌ధాటిగా 80 నిమిషాల‌పాటు నృత్య ప్ర‌ద‌ర్శ‌న చేసి ఆకట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య సంస్థ ఇంద్రాణి దావులూరికి నాట్య మయూరి బిరుదుని ప్ర‌ధానం చేశారు.

ఇంద్రాణి దావులూరి తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో వెండితెరపై మెరిశారు. ఆమె అనేక టెలివిజన్ యాడ్స్ లలో నటించారు. మలయాళ మనోరమ వంటి యోగా వీడియోల‌తో పాటు ప‌లు షార్ట్ ఫిలింస్ లోనూ ఇంద్రాణి న‌టించారు. ఆమెకు నాట్య మ‌యూరి బిరుదు రావ‌డంపై అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Exit mobile version