విడుదల తేదీ : డిసెంబర్ 28, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : రామ్ కార్తీక్ , ప్రణాళి , చమ్మక్ చంద్ర
దర్శకత్వం : బాల బోడేపూడి
నిర్మాత : హరి బాలసుబ్రమణ్యం
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫర్ : తిరుజ్ఞాన
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
‘ఇదం జగత్’ మరియు ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రాలతో పాటు ఈ రోజు వెండితెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి “మంచు కురిసే వేళలో” అనే సినిమా కూడా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..
కథ :
ఆనంద్ కృష్ణ(రామ్ కార్తీక్) తన ఇంజనీరింగ్ ను పూర్తి చేసి ఒక రేడియో జాకీగా పనిచేస్తుంటాడు.ఒక రోజు అనుకోకుండా హీరోయిన్ గీత(ప్రనలి ఘోఘరే) ని చూసి మొదటి చూపులోనే ఇష్టపడతాడు. ఆమె కూడా అతను చదివే కాలేజ్ లోనే చేరడంతో ఇద్దరి మధ్య మెల్లగా స్నేహం చిగురిస్తుంది దానితో మొదటి చూపుతోనే ప్రేమలో పడ్డ ఆనంద్ తన ప్రేమను గీతకు చెప్పేద్దాం అనే లోపు గీత ఆనంద్ కు ప్రకాష్(యశ్వంత్) అనే వ్యక్తితో తనకి ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని చెప్పి షాకిస్తుంది. అసలు ఈ ప్రకాష్ ఎవరు? గీతకి అతనికి ఉన్న సంబంధం ఏమిటి? చివరికి ఆనంద్ ,గీత విషయంలో తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా అన్నది తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఇక ఈ చిత్రానికి సంబందించిన ప్లస్ పాయింట్స్ కి వెళ్లినట్టయితే,హీరో రామ్ కార్తీక్ ఒక ప్రేమికుడిగా మంచి నటనను కనబర్చారు.ఇక రెండో ముఖ్య ప్రధాన పాత్రదారుడు యశ్వంత్ కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే మెప్పించారు.అలాగే హీరోయిన్ గా ప్రనలి ఘోఘరే రెండు షేడ్స్ కలిగిన పాత్రల్లో మంచి నటనను కనబర్చారు.
ప్రముఖ హాస్య నటునిగా పలు చిత్రాల్లో నటించిన దివంగత కమెడియన్ విజయ సాయి కూడా తన పాత్రకు సరైన న్యాయం చేకూర్చారు. ఇక హాస్యానికి వస్తే జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర తనదైన మార్క్ కామెడీతో బాగానే అలరిస్తారు.
మైనస్ పాయింట్స్ :
సినిమా అసలు కథలోకి వెళ్ళడానికే చాలా ఎక్కువ సమయం తీసుకుంది.దీని వలన ప్రేక్షకులకు కాస్త బోర్ ఫీల్ అవుతారు . సెకండాఫ్ కి వచ్చే వరకు అసలు కథ ఇది అని ప్రేక్షకులకు అర్ధం కాదు. కొన్ని చోట్ల అయితే కొన్ని సన్నివేశాలు అసలు అవసరమే లేదు అనిపిస్తుంది.
ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ తో ఈ కథను రాసుకున్న దర్శకుడు దాన్ని పూర్తి స్థాయిలో యూత్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించలేకపోయాడు. దాంతో ఈచిత్రం సాదా సీదాగా అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
తక్కువ బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని నిర్మించినా నిర్మాణ విలువల్లో ఎలాంటి లోపాలు లేకుండా తెరకెక్కించారనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సంగీతం అందించిన శ్రవణ్ భరద్వాజ్ ఇచ్చిన రెండు పాటలు బాగానే ఉన్నా బాక్గ్రౌండ్ స్కోర్ పై ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది.
కొన్ని కొన్ని సన్నివేశాల్లో అయితే సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా ఊటీలో చిత్రీకరించిన సీన్లు మరింత ఇంపుగా ఉంటాయి. ఇక దర్శకత్వం లోకి వచ్చినట్టయితే బాల బోడేపూడి ప్రేమకథపై మంచి లైన్ ని ఎంచుకుని దానిని అందంగా తీర్చిదిద్దడంలో కొంత వరకు సఫలం కొంత వరకు విఫలం అయ్యారని చెప్పాలి అతను ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ దానికి బలమైన ఎమోషన్ సన్నివేశాలను తో తీసి ఉంటే ఫలితం ఇంకా మెరుగ్గా వచ్చి వుండేది.
తీర్పు :
యూత్ ఫుల్ స్టోరీ తో వచ్చిన ఈ మంచు కురిసే వేళలో మెప్పించలేకపోయింది. అందమైన లొకేషన్స్ , అలాగే హీరోయిన్ పాత్ర సినిమాలో హైలైట్ అవ్వగా రొటీన్ స్టోరీ సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది. చివరగా ఈ చిత్రం లవ్ స్టోరీ లను ఇష్టపడే వారికీ నచ్చే అవకాశాలు వున్నాయి కానీ మిగితా వారికీ కనెక్ట్ అవ్వదు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team